• TFIDB EN
  • Editorial List
    2023లో చిన్న సినిమాగా వచ్చి.. సూపర్ హిట్లుగా నిలిచిన చిత్రాలు
    Dislike
    500+ views
    1 year ago

    2023 ఏడాదిలో చాలా చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని మాత్రం ఊహించని విజయాన్ని దక్కించుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూడండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మ్యాడ్(అక్టోబర్ 06 , 2023)
    UA|హాస్యం,డ్రామా
    మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? అనేది మిగతా కథ.

    ఎలాంటి అంచనాలు లేకుండా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న చిత్రంగా వచ్చిన మ్యాడ్ మూవీ.. ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా ద్వారా జూ. ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ ఆరంగేట్రం చేశాడు.

    2 . ప్రేమ విమానం(అక్టోబర్ 13 , 2023)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    పల్లేటూరు నేపథ్యంగా సాగే కథ ఇది. రాము( దేవాన్ష్ నామా), లచ్చి(అనిరుధ్ నామా) ఇద్దరు చిన్నపిల్లలు. వీరికి విమానం ఎక్కాలనేది కోరిక. కానీ వారి పేదరికం వల్ల అది కుదరదు. అప్పుల బాధతో తండ్రి చనిపోగా వారిని తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్) పోషిస్తుంది. ఇదే ఊరిలో మణి( సంగీత్ శోభన్) సర్పంచ్ కూతురు అభిత ప్రేమించుకుంటారు. అభితకు పెళ్లి కుదరడంతో దుబాయ్‌కి పారిపోవాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ రామ్, లచ్చిలను చూసి షాకవుతారు. అసలు రామ్‌, లచ్చి ఏయిర్‌పోర్టుకు ఎందుకు వచ్చారు. మణి, అభిత పెళ్లి చేసుకున్నారా? అన్నది మిగతా కథ

    విభిన్న కథతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదానికి ఈ సినిమా ఉదాహారణ. సంగీత్ శోభన్ నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

    3 . కళ్యాణం కమనీయం(జనవరి 14 , 2023)
    U|106 minutes|హాస్యం,రొమాన్స్,డ్రామా
    శివ (సంతోష్ సోబన్) నిరుద్యోగి. శ్రుతి (ప్రియా భవానీ శంకర్) అతని భార్య, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శివకు ఉద్యోగం తెచ్చుకుని తనను తాను నిరూపించుకుంటానని శృతి నమ్ముతోంది. ఆర్థికంగా మద్దతిస్తుంది. కానీ అకస్మాత్తుగా, శ్రుతి తన భర్తకు వీలైనంత త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలని డిమాండ్ చేసి, శివకు దూరమవుతుంది. ఆ తర్వాత శివ ఏం చేశాడు అనేది మిగతా కథ.

    సంతోష్ శోభన్ నటించిన ఈ చిత్ర మంచి ప్రేక్షకాదరణ పొందింది. జాబ్ లేకపోవడం వల్ల ఓ యువకుడి ప్రేమలో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే కథాంశంతో ఈ సినిమా చిత్రీకరించబడింది.

    4 . రైటర్ పద్మభూషణ్(ఫిబ్రవరి 03 , 2023)
    U|123 minutes|డ్రామా,ఫ్యామిలీ
    పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్) కల. అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు. ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ, ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ

    Suhas once again achieved great success with 'Writer Padmabhushan,' a film with a strong storyline that impressed the audience.

    5 . బుట్ట బొమ్మ(ఫిబ్రవరి 04 , 2023)
    UA|135 minutes|డ్రామా,రొమాన్స్
    సత్య (అనిఖా సురేంద్రన్), ఒక అమాయక పల్లెటూరి అమ్మాయి. అనుకోకుండా ఓరోజు ఆటో డ్రైవర్ మురళి నంబర్‌కు పొరపాటున డయల్ చేస్తుంది. అతనితో మాట్లాడుతూ ప్రేమలో పడుతుంది. ఓ రోజు వైజాగ్‌లో మొదటిసారి ఇద్దరు కలుస్తారు. వీరిని రామకృష్ణ (అర్జున్ దాస్) అనుసరిస్తాడు. రామకృష్ణ వారిని ఎందుకు అనుసరించాడు? తరువాత ఏం జరిగింది? ఆ ముగ్గురి మధ్య సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ

    ఓ అమాయక యువతి మనస్తత్వాన్ని, ఆమె మానసిక సంఘర్షణను ఈ సినిమాలో అందంగా చూపించారు.

    6 . మెమ్ ఫేమస్(మే 26 , 2023)
    UA|150 minutes|హాస్యం,డ్రామా
    తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. అయితే జులాయిగా తిరిగే వీరంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? అనేది మిగతా కథ.

    విడుదలకు ముందే వినూత్న ప్రచారంతో ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసిన ఈ సినిమా... విడుదల తర్వాత కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.

    7 . బేబీ(జూలై 14 , 2023)
    UA|177 minutes|డ్రామా,రొమాన్స్
    ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌తో ఇష్టం లేకున్నా శారీరకంగా ఒకటవ్వాల్సి వస్తుంది. ఆనంద్‌ను వైష్ణవి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? చివరకు ఆనంద్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.

    చిన్న సినిమా వచ్చిన బేబి చిత్రం సైతం.. యువ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది

    8 . విమానం(జూన్ 09 , 2023)
    UA|120 Minutes|డ్రామా
    ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలనే ఆశ ఉంటుంది. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తుంటాడు. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. ఇంతకు వీరయ్య తన కొడుకు చివరి కోరిక తీర్చాడా? అనేది మిగిలిన కథ.

    ఈ చిత్రం విడుదలకు ముందే తనదైన ప్రమోషన్స్‌ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. రిలీజ్‌ ‌అయ్యాక ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ, ప్రశంసలను పొందింది.

    9 . బలగం(మార్చి 03 , 2023)
    U|129 minutes|డ్రామా
    ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. అయితే మూడో రోజు, ఐదో రోజు పిట్ట ముట్టదు. ఆ తర్వాత ఏం జరిగింది? పిట్ట ముట్టేందుకు సాయులు కుటుంబ సభ్యులు ఏం చేశారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న సాయిలు ఎలా బయటపడ్డాడు? సాయిలు తండ్రి తన చెల్లెలకు ఎందుకు దూరంగా ఉన్నాడు? అనేది మిగిలిన కథ.

    తెలంగాణ పల్లె సంస్కృతి, జీవన విధానం ఇతివృత్తంగా వచ్చిన బలగం సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. చిన్న సినిమాల్లో బాహుబలి హిట్‌తో పొల్చదగిన విజయాన్ని సొంతం చేసుకుంది.


    @2021 KTree