
శోభన్ బాబు సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలు
700+ views1 year ago
ఆంధ్రుల అందాల నటుడిగా, ఫ్యామిల్ స్టార్‌గా పేరొందిన శోభన్ బాబు గుర్తింపు పొందారు. ఆయన నట జీవితంలో ప్రేమ కథ, ఫ్యామిలీ చిత్రాలతో లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెద్దసంఖ్యలో సంపాదించుకున్నారు. అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు. ఆయన నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన టాప్ చిత్రాలను ఓసారి చూద్దాం.

1 . ఏవండీ ఆవిడ వచ్చింది(మార్చి 05 , 1993)
U|డ్రామా
రామకృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. అతని కుమార్తె శాంతిని అతని మొదటి భార్య మేనల్లుడితో వివాహం చేస్తాడు. అయితే రామకృష్ణయ్య ఇద్దరి భార్యల మధ్య అపార్థాలు ఏర్పడినప్పుడు, అతను వాటన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు.

2 . బలరామ కృష్ణులు(నవంబర్ 07 , 1992)
U|139 minutes|డ్రామా,రొమాన్స్
బలరామయ్య తన సవతి తల్లి వేరే కులం కాబట్టి సవతి సోదరుడు, సవతి సోదరిని అంగీకరించడు. అతని కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడంతో పరిస్థితులు మారతాయి.
.jpeg)
3 . గోరింటాకు(అక్టోబర్ 12 , 1979)
U|డ్రామా
పేదవాడైన రాజు డాక్టర్ కావడం కోసం సుజాత తన వంతు తోడ్పాటు అందిస్తుంది. అయితే రాజు వృత్తి రిత్యా పరిచయమైన పద్మను పెళ్లి చేసుకుంటాడు. దీంతో రాజు బతుకును పండించిన సుజాత అతడికి దూరమవుతుంది.
.jpeg)
4 . దేవత(సెప్టెంబర్ 04 , 1982)
A|డ్రామా,రొమాన్స్
జానకి తన చెల్లెలు లలిత కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అయితే తను ప్రేమించిన రాంబాబునే అక్క ప్రేమిస్తున్నట్లు లలిత తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? అక్క కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధ పడింది? అన్నది కథ.
.jpeg)
5 . సంపూర్ణ రామాయణం(మార్చి 16 , 1972)
U|ఫ్యామిలీ
ఈ చిత్రం రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడి బాల్యవృత్తాంతం, అరణ్యవాసం, పట్టాభిషేకం వరకు రామాయణంలో జరిగిన ఘట్టాలను ఈ చిత్రంలో తెరకెక్కించారు.
.jpeg)
6 . సోగ్గాడు(డిసెంబర్ 19 , 1975)
U|155 minutes|డ్రామా
శోభనాద్రి తన మరదలు సరోజను ప్రేమిస్తాడు. శోభనాద్రికి చదువు లేకపోవడంతో వారి పెళ్లికి మేనమామ ఒప్పుకోడు. దీంతో సరోజ కంటే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని శోభనాద్రి ఛాలెంజ్ చేస్తాడు.

7 . చెల్లెలి కాపురం(నవంబర్ 27 , 1971)
U|డ్రామా,మ్యూజికల్
శోభన్ బాబు మంచి కవి. నల్లగా ఉండటం వల్ల తన రచనలను ప్రచురించలేకపోతాడు. దీంతో తన స్నేహితుడి పేరుతో కవితలను ప్రచురించాలని నిర్ణయించుకుంటాడు.