• TFIDB EN
  • Editorial List
    శ్రీదేవి నటించిన సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలు
    Dislike
    200+ views
    3 months ago

    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో దేవకన్యగా గుర్తింపు పొందిన శ్రీదేవి ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. ఆమె అద్భుత నటనతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకోగలిగారు. అమయాకత్వం అందం కలగలిపిన ఆమె నటన ఎంతో ప్రత్యేకమైనది. తెలుగులో శ్రీదేవి నటించిన చిత్రాల్లో టాప్ చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . వయ్యారి భామలు వగలమారి భర్తలు(ఆగస్టు 20 , 1982)
    U|138 mins|హాస్యం
    రామలింగం, సోమలింగం ఇద్దరు సంతోషంగా వివాహం చేసుకున్న జంటలపై అసూయపడతారు. వారి కుటుంబ జీవితానికి అంతరాయం కలిగించడానికి వారి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు.
    2 . క్షణ క్షణం(అక్టోబర్ 09 , 1991)
    U|158 minutes|హాస్యం,క్రైమ్
    సత్య, చందు విచిత్రమైన పరిస్థితుల్లో కలిసి రోడ్ ట్రిప్ వెళ్ళవలసి వస్తుంది. అయితే వారిని నాయర్ అనే ఒక బ్యాంకు దొంగ, ఇన్‌స్పెక్టర్ యాదవ్ వెంబడిస్తారు. ఈ ప్రయాణంలో సత్య, చందు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
    3 . జగదేక వీరుడు అతిలోక సుందరి(మే 09 , 1990)
    U|యాక్షన్,హాస్యం,ఫ్యామిలీ
    నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.
    4 . దేవత(సెప్టెంబర్ 04 , 1982)
    A|డ్రామా,రొమాన్స్
    జానకి తన చెల్లెలు లలిత కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అయితే తను ప్రేమించిన రాంబాబునే అక్క ప్రేమిస్తున్నట్లు లలిత తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? అక్క కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధ పడింది? అన్నది కథ.
    5 . బొబ్బిలి పులి(జూలై 09 , 1982)
    A|176 mins|యాక్షన్,డ్రామా
    అవినీతి మయంగా మారిన ప్రభుత్వ రంగాన్ని తనదైన రీతిలో బాగు చేయాలని ఒక ఆర్మీ ఆఫీసర్ నిర్ణయించుకుంటాడు. అయితే పరిస్థితులు అతనికి సహకరించకపోవడంతో ఇబ్బందుల్లో పడుతాడు.
    6 . ప్రేమాభిషేకం(ఫిబ్రవరి 18 , 1981)
    U|147 minutes|డ్రామా,రొమాన్స్
    రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
    7 . కొండవీటి సింహం(అక్టోబర్ 07 , 1981)
    U|యాక్షన్,డ్రామా
    ఎస్పీ రంజిత్ కుమార్ నిజాయతీ గల పోలీసు ఆఫీసర్. న్యాయం కోసం పోరాడే క్రమంలో కొడుకుతో విభేదిస్తాడు. చివరికి రాము తన తండ్రి ప్రయత్నాలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు.
    8 . ఆకలి రాజ్యం(జనవరి 09 , 1981)
    A|141 minutes|డ్రామా
    ఒక నిరుద్యోగ యువకుడు దేశ రాజధానిలో ఉద్యోగం కోసం వెతుకుతున్న సందర్భంలో ఎదొర్కొన్న సమస్యలే ఈ సినిమా కథ. ఆకలి, మనిషి వ్యక్తిత్వం, మానవ సంబంధాలు, సమాజాన్ని చూసే ధృక్కొణం వంటి అంశాలు ఈ సినిమాలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ సినిమాలో శ్రీశ్రీ కవితలు ఆలోచింపజేస్తాయి.
    9 . సర్దార్ పాపా రాయుడు(అక్టోబర్ 30 , 1980)
    U|151 minutes|యాక్షన్
    అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు ధర్మరాజు తన కూతురి ప్రేమికుడు, నిజాయతీపరుడైన రాము అనే పోలీసును కలుసుకోవడంతో షాక్ అవుతాడు, అతను తప్పుడు కేసుతో కొన్నాళ్ల క్రితం జైలులో ఉంచిన వ్యక్తిని పోలి ఉంటాడు.
    10 . వేటగాడు(జూలై 05 , 1979)
    U|149 mins|డ్రామా
    వేటగాడైన రామారావు.. శ్రీదేవిని ప్రేమిస్తాడు. అయితే శ్రీదేవి తండ్రి జగ్గయ్య వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. శ్రీదేవి తల్లి మరణానికి రామారావు తండ్రి కారణమని జగ్గయ్య భావిస్తుంటాడు. మరోవైపు శ్రీదేవిని పెళ్లి చేసుకోని ఆస్తి కొట్టేయాలని విలన్‌ కొడుకు యత్నిస్తుంటాడు. చివరికీ ఏమైంది? అన్నది కథ.
    11 . పదహారేళ్ళ వయసు(ఆగస్టు 31 , 1978)
    U|డ్రామా
    పదహారేళ్ల మల్లి తన గ్రామాన్ని సందర్శించినప్పుడు పశువైద్యుడ్ని ఇష్టపడుతుంది. అయితే అతనికి చెడు ఉద్దేశాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆమె ఇబ్బందుల్లో పడుతుంది.

    @2021 KTree