• TFIDB EN
  • Editorial List
    సుధీర్ బాబు హిట్ చిత్రాలు
    Dislike
    200+ views
    3 months ago

    సూపర్ స్టార్ కృష్ణ సొంత అల్లుడిగా సుధీర్‌బాబు అందరికి తెలుసు. అయితే కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ... హీరోగా అంచెలు అంచెలుగా ఎదిగాడు. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . నన్ను దోచుకుందువటే(సెప్టెంబర్ 20 , 2018)
    U|142 minutes|డ్రామా,రొమాన్స్
    కార్తీక్‌ (సుధీర్‌ బాబు)కు అమెరికా వెళ్లాలని లక్ష్యం. మరదలి నుంచి తప్పించుకునేందుకు మేఘన (నభా నతేష్‌)ను ప్రేమిస్తున్నట్లు అబద్దం ఆడతాడు. తర్వాత వారిద్దరు ఒకరినొకరు నిజంగానే ఇష్టపడతారు. మరి కార్తీక్‌-మేఘన ఒక్కటయ్యారా? లేదా హీరో తన లక్ష్యం కోసం అమెరికా వెళ్లాడా? అన్నది కథ.
    2 . శ్రీదేవి సోడా సెంటర్(ఆగస్టు 27 , 2021)
    UA|154 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    సూరిబాబు (సుధీర్‌బాబు), శ్రీదేవి (ఆనంది) ఒకరినొకరు ఇష్టపడతారు. వీరి ప్రేమకు కులం అడ్డువస్తుంది. ఈ క్రమంలోనే ఓ హత్య కేసులో సూరిబాబు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు - శ్రీదేవి కలిశారా లేదా? అన్నది కథ.
    3 . V(సెప్టెంబర్ 05 , 2020)
    UA|140 minutes|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    క్లిష్టతరమైన కేసులను ఛేదిస్తూ విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్‌కు... 'V' అనే సీరియల్ కిల్లర్ చిక్కుముడిగా మారుతాడు. తనను హత్యలు చేయకుండా అడ్డుకోవాలని పోలీస్‌ ఆఫీసర్‌ను 'V' సవాలు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    4 . సమ్మోహనం(జూన్ 15 , 2018)
    U|144 minutes|డ్రామా,రొమాన్స్
    విజ్జు (సుధీర్‌బాబు) ఇంట్లో సినిమా షూటింగ్‌ జరుగుతుంది. అందులో హీరోయిన్‌గా నటించే సమీరా (అదితిరావు హైదరీ)ను విజ్జు ప్రేమిస్తాడు. ఈ విషయం ఆమెకు చెప్పగా తిరస్కరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సమీరా, విజ్జు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ.
    5 . ప్రేమ కథా చిత్రమ్(జూన్ 07 , 2013)
    UA|130 minutes|డ్రామా,హారర్
    నలుగురు యువకులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా కలిసి ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. కానీ ఆ ఇంట్లో వారి ప్లాన్లన్నీంటిని కొన్ని సంఘటనలు అడ్డుకుంటాయి. ఎంటా సంఘటనలు? ఇంతకు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనకున్నారన్నది మిగతా కథ.

    ఈ చిత్రం సుధీర్ బాబుకు తొలి హిట్‌ను అందించింది. ఈ చిత్రం ద్వారా యూత్‌లో క్రేజ్ సంపాదించాడు.


    @2021 KTree