Editorial List
సూర్యకాంతం నటించిన టాప్ 10 బెస్ట్ సినిమాలు
300+ views8 months ago
ఆంధ్రుల గయ్యాలి అత్తగా సూర్యకాంతం గుర్తింపు పొందారు. ఎక్కువగా ఆమె విలన్, శాడిజం నిండిన అత్త, సవితి తల్లి క్యారెక్టర్లను పోషించారు. ఆమె తర్వాత ఆ స్థాయిలో తెలుగులో మరో నటి రాలేదన్నది అతిశయోక్తి కాదు. సూర్యకాంతం నటించిన టాప్ 10 బెస్ట్ చిత్రాలు మీకోసం
1 . దాగుడు మూతలు(ఆగస్టు 21 , 1964)
UA|139 minutes|డ్రామా
ఒక గ్రామంలో సుండేయ నడుపుతున్న హోటల్‌కు ఒక వ్యక్తి తరచూ వస్తుంటాడు. అక్కడ సుబ్బులు అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అయితే ఆ వ్యక్తి ఊరి జమీందారు మనవడు అని తెలిశాక కథ మలుపు తిరుగుతుంది.
2 . కుల గోత్రాలు(ఆగస్టు 24 , 1961)
U|158 mins|డ్రామా
రవి తన తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకుంటాడు. రవి సవతి సోదరి, ఆమె భర్త ఈ పరిస్థితిని ఉపయోగించుకుని వారి మధ్య విభేదాలు సృష్టిస్తారు.
3 . గుండమ్మ కథ(జూన్ 07 , 1962)
U|166 minutes|హాస్యం,డ్రామా
గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు.
4 . భార్య భర్తలు(మార్చి 31 , 1961)
U|159 minutes|డ్రామా,రొమాన్స్
శారద, ఆనంద్ వివాహం జరిగిన వెంటనే, ఆనంద్ తండ్రి అతని పాత్రను అనుమానించడం ప్రారంభించాడు మరియు ఆనంద్ తన గర్భవతి అయిన మాజీ ప్రియురాలిని చంపినందుకు అరెస్టు అవుతాడు.
5 . ఇల్లరికం(మే 01 , 1959)
U|160 minutes|డ్రామా
వేణు అనే పేదవాడు జమీందార్ కూతురు రాధను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఓ వ్యక్తి కారణంగా వేణుకు జమీందార్ ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయి.
6 . అత్తా ఒకింటి కోడలే(సెప్టెంబర్ 12 , 1958)
U|డ్రామా
తాయారమ్మ కొడుకు రఘు బస్తీలో చదువుతూ శోభను ప్రేమిస్తాడు. శోభ తల్లి సుందరమ్మ గయ్యాళి. కట్నం ఇవ్వలేనది కోడల్ని కాపురానికి రానివ్వలేదు. ఈ స్థితిలో రఘు శోభను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా సుందరమ్మ తన కోడలిని ఇంటికి తెచ్చుకోవాలని షరతు పెడతాడు.
7 . తోడి కోడళ్ళు(జనవరి 11 , 1957)
U|182 minutes|డ్రామా
కుటుంబరావు తన ఫ్యామిలీకి పెద్ద. సత్యం అతని భార్య ఇంటిని సమర్ధవంతంగా నడుపుతుంటారు. కుటుంబ ఐక్యతను దెబ్బతీసేందుకు ఒక బంధువు కుట్ర పన్నుతాడు.
8 . చిరంజీవులు(ఆగస్టు 15 , 1956)
UA|166 minutes|డ్రామా,రొమాన్స్
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టీ. రామారావు, జమున ప్రధాన పాత్రలు పోషించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు.
9 . దొంగ రాముడు(అక్టోబర్ 01 , 1955)
U|197 minutes|డ్రామా
తోబుట్టువులైన రాముడు, లక్ష్మి చిన్నతనంలో విడిపోతారు. పెద్దయ్యాక ప్రతీకూల పరిస్థితుల నేపథ్యంలో వారు కలుస్తారు. లక్ష్మిపై హత్యారోపణలు రాగా రాముడు ఆమె నిర్ధోషిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు.
10 . చక్రపాణి(మార్చి 19 , 1954)
UA|147 mins|డ్రామా
చక్రపాణి అనే వ్యక్తి తన మునిమనవడికి బహుమతిగా ఇవ్వడానికి పెద్ద మొత్తాన్ని ఆదా చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతను తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు.