• TFIDB EN
  • సినిమా విడుదల తేదీ వారీగా తెలుగు తాజా విడుదలలు
    Dislike
    2k+ views
    7 months ago

    థియోటర్లలో విడుదలైన తాజా సినిమాల వివరాలను లిస్ట్‌లో చూడవచ్చు. ఆయా సినిమా రివ్యూలు, రేటింగ్ వంటి అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఇంకా చిత్రంలోని నటీనటులు, వారి పాత్రల వివరాలను తెలుసుకోవచ్చు.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మిరల్(మే 17 , 2024)
    U/A|క్రైమ్,థ్రిల్లర్
    హరి, రమ భార్య భర్తలు. తన భర్తను ఎవరో చంపినట్లు రమకు కల వస్తుంది. దీంతో కుల దైవం గుడిలో పూజ చేయించేందుకు సొంత ఊరికి వెళ్తారు. అనంతరం సిటీకి బయలుదేరినప్పటి నుంచి హరి, రమలకు వింత అనుభవాలు ఎదురవుతాయి. కలలో వచ్చిన సంఘటనలే వారికి తారసపడతాయి. హరి ఫ్యామిలీని వెంటాడుతున్న ఆ అతీతశక్తి ఏంటి? హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అన్నది కథ.
    2 . దర్శిని(మే 17 , 2024)
    U/A|డ్రామా
    సంతోష్, ప్రియ, లివింగ్ స్టోన్ అనే ముగ్గురు ఫ్రెండ్స్.. దర్శిని అనే సైంటిస్ట్‌కు చెందిన ఫామ్‌ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి పెన్‌ సెన్సార్‌ కనిపిస్తుంది. ప్రతిరోజు నెక్ట్స్‌ డే అదే సమయానికి ఏం జరుగుతుందో చూపిస్తుంటుంది. మరోవైపు సైంటిస్ట్ దర్శిని అదే బంగ్లాలో శవమై కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ భవిష్యత్‌ మిషిన్‌ కథేంటి? అసలు దర్శిని ఎలా చనిపోయింది? అన్నది కథ.
    3 . ఆరంభం(మే 10 , 2024)
    U/A|థ్రిల్లర్
    మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
    4 . కృష్ణమ్మ(మే 10 , 2024)
    U/A|డ్రామా
    భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో రివేంజ్‌ తీర్చుకుంటాడు.
    5 . ప్రతినిధి 2(మే 10 , 2024)
    U/A|డ్రామా,థ్రిల్లర్
    చేతన్‌ (నారా రోహిత్‌) నిజాయతీ గల జర్నలిస్టు. NCC ఛానల్‌ సీఈవోగా ఉంటూ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎంపై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? అన్నది స్టోరీ.
    6 . కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌(మే 10 , 2024)
    U/A|యాక్షన్,డ్రామా,సైన్స్ ఫిక్షన్
    ఏప్స్‌ను పాలిస్తున్న ప్రాక్సిమస్‌ సీజర్‌.. మనుషులను అంతం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో నోవా అనే యువతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్‌ సీజర్‌.. నోవా, చింపాజీతో ఎలాంటి పోరాటం చేసింది? ప్రాక్సిమస్‌ను వారు కలిసికట్టుగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.
    7 . మదర్ అఫ్ ది బ్రైడ్(మే 09 , 2024)
    U/A|హాస్యం,డ్రామా
    విదేశాల్లో చదువుకొని ఇంటికి వచ్చిన ఎమ్మా.. తల్లి లానాకు తన పెళ్లి విషయం చెప్పి షాకిస్తుంది. మరో నెలలో తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్తుంది. అయితే తనకు కాబోయే అల్లుడు గతంలో తన మనసు గాయపరిచిన వ్యక్తి కుమారుడని లానాకు తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది.
    8 . బాక్(మే 03 , 2024)
    U/A|హాస్యం,హారర్
    శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. బాక్‌ అనే దుష్టశక్తి వల్ల అతని చెల్లెలు శివాని (తమన్నా) మరణిస్తుంది. అసలు ఆ బాక్ ఎవరు? శివాని ఫ్యామిలీని ఎందుకు టార్గెట్‌ చేసింది? శివాని ఆత్మగా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కథలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏంటి? అన్నది కథ.
    9 . ఆ ఒక్కటీ అడక్కు(మే 03 , 2024)
    U/A|డ్రామా
    గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
    10 . శబరి(మే 03 , 2024)
    U/A|డ్రామా,సైన్స్ ఫిక్షన్
    సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్‌ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్‌ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్‌ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది? అన్నది కథ.
    11 . ప్రసన్న వదనం(మే 03 , 2024)
    U/A|డ్రామా
    రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.
    12 . రత్నం(ఏప్రిల్ 26 , 2024)
    U/A|యాక్షన్,డ్రామా
    రత్నం (విశాల్‌).. ఏపీ, తమిళనాడు బోర్డర్‌లో జీవిస్తుంటాడు. జననీని (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అన్నది కథ.
    13 . లవ్ యు శంకర్(ఏప్రిల్ 19 , 2024)
    U/A|అడ్వెంచర్,యానిమేషన్,డ్రామా
    8 ఏళ్ల శివాంష్ అనే బాలుడికి ఓ ప్రమాదం తర్వాత గత జన్మ గుర్తుకు వస్తుంది. తాను రుద్రుడినని, గొప్ప శివ భక్తుడినని తెలుసుకుంటాడు. గురువు సిద్ధేశ్వరుడు అన్యాయంగా తనను చంపినట్లు గ్రహిస్తాడు. రుద్రుడి జన్మకు న్యాయం చేయాలని భావించి వారణాసికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ
    14 . శరపంజరం(ఏప్రిల్ 19 , 2024)
    U/A|డ్రామా,రొమాన్స్
    నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’. లయ కథానాయిక. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
    15 . మార్కెట్ మహాలక్ష్మి(ఏప్రిల్ 19 , 2024)
    U/A|హాస్యం,డ్రామా
    సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పార్వతీశం.. లక్షల్లో జీతం సంపాదిస్తుంటాడు. ఓ రోజు మార్కెట్‌లో కూరగాయలు అమ్మె మహాలక్ష్మీని చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? పార్వతీశం ప్రేమను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది? మహాలక్ష్మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అన్నది స్టోరీ.
    16 . పారిజాత పర్వం(ఏప్రిల్ 19 , 2024)
    U/A|యాక్షన్,డ్రామా
    చైత‌న్య డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటాడు. స్నేహితుడ్ని హీరోగా పెట్టి అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఛాన్స్‌ రాకపోవడంతో తానే నిర్మాత‌గా మారాలని అనుకుంటాడు. డబ్బు కోసం శెట్టి సెకండ్‌ సెటప్‌ను కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ వేస్తాడు. మరోవైపు సునీల్‌, శ్ర‌ద్దా దాస్‌ కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్‌ వేస్తారు. ఈ ఇద్దరిలో శెట్టి భార్యను ఎవరు కిడ్నాప్‌ చేశారు? చివరికి ఏమైంది? అన్నది కథ.
    17 . మారణాయుధం(ఏప్రిల్ 19 , 2024)
    U/A|యాక్షన్,డ్రామా
    రేటింగ్ లేదు
    మారణాయుధం
    18 . టెనెంట్(ఏప్రిల్ 18 , 2024)
    U/A|మిస్టరీ,థ్రిల్లర్
    గౌతమ్‌, సంధ్య పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత వారి కాపురంలో సమస్యలు వస్తాయి. ఓ రోజు మేఘా బెడ్‌పై విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారుంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ యువకుడు పైనుంచి దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? పైనుంచి పడ్డ యువకుడు ఎవరు? గౌతమే ఆమెను చంపేశాడా? అన్నది కథ.
    19 . లవ్ గురు(ఏప్రిల్ 12 , 2024)
    U/A|హాస్యం,రొమాన్స్
    అరవింద్‌ (విజయ్ ఆంటోని)కు కొన్ని కారణాల వల్ల 35 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరంగా ఉంటాడు. ఓ రోజు బంధువుల అమ్మాయి లీలాని చూసి ప్రేమిస్తాడు. హీరోయిన్‌ కావాలని కలలు కంటున్న ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? లీలను హీరోయిన్‌ చేసేందుకు అరవింద్ ఎలాంటి రిస్క్ చేశాడు? అన్నది కథ.
    20 . శ్రీ‌రంగనీతులు (ఏప్రిల్ 12 , 2024)
    U/A|డ్రామా
    మూడు కథల సమాహారమే ఈ చిత్రం. బస్తీకి చెందిన శివ (సుహాస్‌) ఓ టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. స్కూల్ గ్రౌండ్‌లో తన ఫోటోతో పెట్టిన పెద్ద ఫ్లెక్సీని ఎవరో తీసేయడంతో మళ్లీ కొత్తది పెట్టాలని పట్టుదలతో ఉంటాడు. అటు వరుణ్‌, ఐశ్వర్య ప్రేమించుకుంటారు. వీళ్లు కలిశారా? లేదా? అనేది రెండో కథ. ఉన్నత చదువులు చదివిన కార్తిక్‌ డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా మారతాడు. అతడ్ని మార్చడానికి తండ్రి ఏం చేశాడు? అనేది మూడో కథ.

    @2021 KTree