• TFIDB EN
  • Editorial List
    Telugu Rural backdrop Movies: గ్రామీణ నేపథ్యంతో వచ్చి హిట్‌ అందుకున్న టాలీవుడ్ చిత్రాలు
    Dislike
    1 Likes 2k+ views
    1 year ago

    టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సైతం అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన టాప్‌-10 చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సోగ్గాడే చిన్ని నాయనా(జనవరి 15 , 2016)
    UA|145 minutes|హాస్యం,డ్రామా
    బంగార్రాజు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కొడుకు కాపురం గురించి ఆందోళన చెందుతున్న భార్య కోసం తిరిగి భూమి పైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భూమిపైకి వచ్చిన బంగర్రాజు ఆత్మ ఏం చేసింది? అన్నది కథ.
    2 . శతమానం భవతి(జనవరి 14 , 2017)
    U|133 minutes|డ్రామా,ఫ్యామిలీ
    "శతమానం భవతి" అనే చిత్రం, తమ ఉద్యోగాల పరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, బిజీగా గడుపుతున్న పిల్లల నుంచి అప్యాయత కోరుకునే ఓ వృద్ధ జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. బిజీ లైఫ్‌ గడుపుతున్న పిల్లల్ని ఏకతాటిపై తెచ్చేందుకు వారు ఒక ప్లాన్ వేయడంతో కథ మొదలుతుంది.
    3 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
    A|146 minutes|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
    రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.

    పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.

    4 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
    UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.

    సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.

    5 . మెమ్ ఫేమస్(మే 26 , 2023)
    UA|150 minutes|హాస్యం,డ్రామా
    తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. అయితే జులాయిగా తిరిగే వీరంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? అనేది మిగతా కథ.
    6 . శ్రీమంతుడు(ఆగస్టు 07 , 2015)
    UA|158 minutes|యాక్షన్,డ్రామా
    కోటీశ్వరుడి కుమారుడైన హర్ష, పేదరికం సామాజిక సమస్యలతో కుదేలైన ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిలో మార్పు తెచ్చే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటాడు.
    7 . బలగం(మార్చి 03 , 2023)
    U|129 minutes|డ్రామా
    ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. అయితే మూడో రోజు, ఐదో రోజు పిట్ట ముట్టదు. ఆ తర్వాత ఏం జరిగింది? పిట్ట ముట్టేందుకు సాయులు కుటుంబ సభ్యులు ఏం చేశారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న సాయిలు ఎలా బయటపడ్డాడు? సాయిలు తండ్రి తన చెల్లెలకు ఎందుకు దూరంగా ఉన్నాడు? అనేది మిగిలిన కథ.

    అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.

    8 . దసరా(మార్చి 30 , 2023)
    UA|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
    ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

    సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా రాబట్టింది.

    9 . రంగస్థలం(మార్చి 30 , 2018)
    UA|174 minutes|డ్రామా,హిస్టరీ,రొమాన్స్
    ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ.

    రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.


    @2021 KTree