• TFIDB EN
  • నెట్‌ఫ్లిక్స్‌లో బెస్ట్ రొమాంటిక్ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    రొమాంటిక్‌ చిత్రాల్లో బెస్ట్ మూవీలు ఏవో తెలియక కంగారు పడుతున్నారా? నెట్‌ఫ్లిక్స్‌లో 2020- 2023 వరకు వచ్చిన రొమాంటిక్ మూవీల్లో బెస్ట్ రేటింగ్ ఉన్న టాప్ చిత్రాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో లెటెస్ట్.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, భీష్మ, రంగబలి వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీ మనసుకు నచ్చిన సినిమాను ఎంచుకుని రొమాంటిక్ స్వింగ్‌ను ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఉప్పెన(ఫిబ్రవరి 12 , 2021)
    UA|డ్రామా,రొమాన్స్
    మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజాబ్‌ వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.
    2 . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(అక్టోబర్ 15 , 2021)
    UA|హాస్యం,రొమాన్స్
    హర్ష (అఖిల్‌) ఎంతో మంది పెళ్లి కూతర్లని చూస్తాడు. అందులో ఒకరైన విభ (పూజా హెగ్డే) హర్షకు బాగా నచ్చుతుంది. కానీ విభ రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం ఏమిటి? హర్ష ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    3 . ఖుషి(సెప్టెంబర్ 01 , 2023)
    UA|రొమాన్స్,డ్రామా,హాస్యం
    సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.
    4 . టిల్లు స్క్వేర్(మార్చి 29 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
    5 . భీష్మ(ఫిబ్రవరి 21 , 2020)
    U|హాస్యం,డ్రామా,రొమాన్స్
    భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఉద్యోగి అయిన చైత్ర(రష్మిక)ను భీష్మ(నితిన్) ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే క్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై ఇష్టం పెంచుకుంటాడు. ఇదే సమయంలో భీష్మ ఆర్గానిక్స్‌కు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ కంపెనీతో ఏ సంబంధం లేని భీష్మ ఎలా పరిష్కరించాడు అనేది కథ.
    6 . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(సెప్టెంబర్ 07 , 2023)
    UA|హాస్యం,రొమాన్స్
    మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
    7 . సార్(ఫిబ్రవరి 17 , 2023)
    U|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
    బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
    8 . ఓ పిట్ట కథ(మార్చి 06 , 2020)
    U|రొమాన్స్,థ్రిల్లర్
    ఇద్దరి యువకుల ప్రేమ తగాదాతో ఓ యువతి ప్రాణాపాయం ఎదుర్కొంటుంది. వారిలో నిజమైన ప్రేమ ఎవరిదో తెలుసుకుని అతనికి దగ్గరవుతుంది.
    9 . ఊర్వశివో రాక్షశివో(నవంబర్ 04 , 2022)
    UA|హాస్యం,రొమాన్స్,డ్రామా
    పెళ్లి బంధం ఎర్పరుచుకోవాలనే మనస్తత్వం ఉన్న అబ్బాయి... కేవలం లివ్‌- ఇన్‌- రిలేషన్‌ షిప్‌తోనే జీవితం సాగించాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఆ బంధం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ
    10 . రంగబలి (జూలై 07 , 2023)
    UA|హాస్యం,రొమాన్స్,డ్రామా
    శౌర్య (నాగ శౌర్య) తన సొంత ఊరు రాజవరం అంటే ఎనలేని ప్రేమ. ఆ ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. అయితే తండ్రి మాట విని ఉన్నత చదువు కోసం వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ (యుక్తి తరేజా) అనే డాక్టర్‌తో ప్రేమలో పడతాడు. అయితే రావవరంలో ఓ సమస్య కారణంగా సహజ తండ్రి మురళి శర్మ వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఇంతకు ఆ సమస్య ఏమిటి? శౌర్య పరిష్కరించగలిగాడా? అనేది మిగతా కథ

    @2021 KTree