• TFIDB EN
  • Editorial List
    బాలకృష్ణ- విజయశాంతి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ ఎందుకు సూపర్ హిట్ అయ్యాయి?
    Dislike
    2k+ views
    10 months ago

    నందమూరి నటసింహం బాలకృష్ణ- విజయశాంతి జోడీకి 90 దశకంలో హిట్ పేయిర్‌గా గుర్తింపు ఉంది. బాలయ్యకు జోడీగా విజయశాంతి మొత్తం 17 చిత్రాల్లో నటించింది. వీటిలో 90శాతం చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి జోడీలో సినిమా వస్తుందంటే థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యేవి. ఎక్కువగా డైరెక్టర్లు వీరి కాంబోలో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం కథానాయకుడుగా కాగా చివరి చిత్రం నిప్పురవ్వ. మరి వీరి కాంబోలో వచ్చిన సినిమాల జాబితాపై ఓలుక్ వేద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . నిప్పు రవ్వ(సెప్టెంబర్ 03 , 1993)
    U|131 minutes|యాక్షన్,డ్రామా
    ఒక పోలీసు అధికారి తన పని పట్ల విధేయతతో ఉంటాడు. కానీ స్వభావం విషయంలో చాలా దూకుడుగా ఉంటాడు. అయితే, ఒక నేరస్థుడు అతన్ని మోసపూరితమైన నేర ప్రపంచంలోకి లాగినప్పుడు విషయాలు మలుపు తిరుగుతాయి.

    ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. బాలకృష్ణతో విజయశాంతి నటించిన చివరి చిత్రమిది.

    2 . రౌడీ ఇన్స్పెక్టర్(మే 07 , 1992)
    A|144 minutes|యాక్షన్,డ్రామా
    ఆటోరిక్షా డ్రైవర్ అయిన రాణి, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఇన్‌స్పెక్టర్ రామరాజుతో ప్రేమలో పడుతుంది. నగరంలో జరుగుతున్న నేర కార్యకలాపాలను అంతం చేయడానికి రామరాజుకు సహాయం చేయడానికి రాణి కృషి చేస్తుంది.

    విజయశాంతి- బాలకృష్ణ జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని బి.గోపాల్ డైరెక్ట్ చేశారు.

    3 . తల్లి తండ్రులు(ఫిబ్రవరి 11 , 1991)
    U|140 minutes|యాక్షన్,డ్రామా
    వ్యాపారవేత్త వెంకటరామయ్య ప్రత్యర్థి కుట్రకు బలికావడం వల్ల అతడు తన ఆస్తిని కోల్పోయే ప్రమాదంలో పడుతాడు. అయితే, అతని పెద్ద కొడుకు ఆ పరిస్థితి నుంచి కాపాడాడు.

    తాతినేని రామరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాలకృష్ణ- విజయశాంతి(BalaKrishna - Vijayashanti) జంటకు నటన పరంగా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ అయింది.

    4 . లారీ డ్రైవర్(డిసెంబర్ 21 , 1990)
    U|135 mins|యాక్షన్,డ్రామా
    బి.గోపాల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా చేశారు. పరుచూరి బ్రదర్స్‌ కథ, మాటలు అందించారు. విజయశాంతి, రావుగోపాల రావు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరాలు అందించారు.

    బాలకృష్ణ- విజయశాంతి జంటగా... బి గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన లారీ డ్రైవర్ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

    5 . ముద్దుల మేనల్లుడు(జూలై 07 , 1990)
    U|138 minutes|డ్రామా
    తరతరాలుగా రెండు కుటుంబాల మధ్య ఉన్న స్పర్థను ఈ చిత్రం చూపిస్తుంది. ఇళ్ల మధ్య గోడను నిర్మించినప్పుడు వివాదం మరింత ముదురుతుంది. చివరికి వారు ఎలా కలిశారు? అన్నది కథ.

    కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం విజయంతో కోడిరామకృష్ణ- బాలకృష్ణ- విజయశాంతి కాంబో అంటే హిట్‌కు మారుపేరుగా మారిపోయింది

    6 . ముద్దుల మావయ్య(ఏప్రిల్ 07 , 1989)
    UA|138 minutes|డ్రామా
    రాజా తన సోదరి లక్ష్మీ ( సీత ) కోసం మాత్రమే జీవిస్తున్న అనాథ. ఆమె చిన్నాను ప్రేమించడంతో రాజా వారికి పెళ్లి చేస్తారు. అయితే విలన్‌ కొడుకు అయిన చిన్నా.. లక్ష్మీని కత్తితో పొడిచి చంపుతాడు. ఆ తర్వాత రాజా ఏం చేశాడు? అన్నది కథ.

    కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించింది. మరోసారి బాలయ్య- విజయశాంతి తమ జోడీతో ప్రేక్షకులను అలరించారు.

    7 . భలే దొంగ(ఫిబ్రవరి 10 , 1989)
    U|151 minutes|యాక్షన్
    సురేంద్ర.. నగరాన్ని శాసిస్తున్న విధాతను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. ఆ డబ్బుతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతుంటాడు. అతడ్ని పట్టుకునేందుకు ఎస్పీ ఇంద్రాణి రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    విజయశాంతి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన మరో హిట్ చిత్రం భలే దొంగ. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.

    8 . ఇన్‌స్పెక్టర్ ప్రతాప్(జనవరి 15 , 1988)
    U|149 minutes|యాక్షన్,డ్రామా
    స్థానిక మాదకద్రవ్యాల వ్యాపారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిజాయితీగల పోలీసు అధికారి ప్రతాప్ తన ఉద్యోగం కోల్పోతాడు. అయినప్పటికీ, అతను నేరస్థుడిని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు.

    ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ హిట్ సాధించింది.

    9 . భానుమతి గారి మొగుడు(నవంబర్ 18 , 1987)
    U|145 minutes|డ్రామా
    డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్లిన జయకృష్ణ.. ధనవంతురాలు, అహంకారి అయిన భానుమతిని కలుస్తాడు. ఆమె తన భర్తలా నటించడానికి అతనిని నియమించుకుంటుంది. అయితే వారిద్దరు ఒకరికొకరు ప్రేమలో పడినప్పుడు వారి జీవితాలు మారుతాయి.

    కోడిరామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. విజయశాంతి-బాలకృష్ణకు (BalaKrishna - Vijayashanti)స్టార్ డామ్‌ను తెచ్చిపెట్టింది ఈ సినిమా.

    10 . మువ్వా గోపాలుడు(మే 19 , 1987)
    U|138 minutes|డ్రామా
    గోపి, నిర్మల ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే, వారి ప్రేమపై అసంతృప్తిగా ఉన్న గోపి మామ బసవ రాజు, తన సొంత కూతురిని పెళ్లి చేసుకునేలా అతన్ని మోసం చేస్తాడు.

    కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో బాలయ్య- విజయశాంతి జోడీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది.

    11 . సాహస సామ్రాట్(ఏప్రిల్ 13 , 1987)
    U|146 mins|యాక్షన్,డ్రామా
    చదువుకున్న, ధనవంతురాలైన రాణి, పల్లెటూరి గుమ్మడి రాముడుతో ప్రేమలో పడుతుంది. అయితే, వారి కులంలోని ఒక శక్తివంతమైన వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం రాముడికి హాని కలిగించాలని పథకం వేస్తాడు.

    ఈ సినిమా విజయంతో విజయశాంతి- బాలకృష్ణ హిట్‌ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ చిత్రాన్ని కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. సూపర్ హిట్ సాధించింది.

    12 . భార్గవ రాముడు(జనవరి 14 , 1987)
    U|149 minutes|యాక్షన్
    భార్గవ నిజాయితీపరుడు, అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అతను చట్టవిరుద్ధమైన పనులను చేయడానికి నిరాకరిస్తాడు. ఈ మంచితనం సహించని కొంతమంది అతన్ని అవినీతి కేసులో తప్పుగా ఇరికిస్తారు.

    ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ- విజయశాంతి తమ పర్ఫామెన్స్‌తో ఇరగదీశారు.

    13 . అపూర్వ సహోదరులు(అక్టోబర్ 09 , 1986)
    UA|152 mins|యాక్షన్
    పుట్టుకతోనే విడిపోయిన కవలలు అరుణ్, రాము వేర్వేరు ప్రాంతాల్లో పెరుగుతారు. విధి వారిని చాలా సంవత్సరాల తర్వాత వారి తల్లిదండ్రులతో కలుపుతుంది. వారి కుటుంబాన్ని నాశనం చేసిన దుష్ట వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇద్దరూ బయలుదేరుతారు.

    పట్టాభిషేకం సినిమా ప్లాప్ కావడంతో మరోసారి బాలయ్య- విజయశాంతి(BalaKrishna - Vijayashanti) జోడీతోనే కే రాఘవేంద్ర రావు.. అపూర్వ సోదరులు సినిమా తీసి హిట్‌ కొట్టారు.

    14 . దేశోద్ధారకుడు(ఆగస్టు 07 , 1986)
    UA|150 minutes|డ్రామా
    ధర్మారాయుడు, నరసింహ నాయుడు అనే ఇద్దరు దుర్మార్గుల వల్ల ఒక ఊరు నాశనమవుతుంది. అయితే ఆ ఊరికి పొరపాటున వచ్చిన గోపిని ప్రత్యేక అధికారి అని అందరు భయపడుతారు. ఊరిలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేకాధికారిగా కొనసాగాలని గోపిని, విజయ అభ్యర్థిస్తుంది.

    ఈ సినిమాను SS రవిచంద్రం డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

    15 . ముద్దుల కృష్ణయ్య(ఫిబ్రవరి 28 , 1986)
    UA|133 minutes|యాక్షన్,మ్యూజికల్
    ఊరిలో ధైర్యవంతుడైన కృష్ణయ్య.. పొగరుగా ప్రవర్తించే సంపన్నురాలైన ఓ మహిళ అతని కూతురితో గొడవపడుతాడు. అయితే విబేధాలను పరిష్కరించేందుకు తన కూతురుని పెళ్లి చేసుకోవాలని సంపన్నురాలైన మహిళ భర్త కృష్ణయ్యకు సూచిస్తాడు.

    కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ- విజయశాంతి జోడీ కట్టారు.

    16 . పట్టాభిషేకం(డిసెంబర్ 19 , 1985)
    UA|144 minutes|డ్రామా,రొమాన్స్
    పట్టాభిషేకం సినిమాలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. నందమూరి హరికృష్ణ నిర్మించారు.

    కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన పట్టాభిషేకం చిత్రంలో బాలయ్య- విజయశాంతి(BalaKrishna - Vijayashanti) రెండోసారి జోడీ కట్టారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.

    17 . కథానాయకుడు(డిసెంబర్ 14 , 1984)
    U|153 minutes|డ్రామా
    జస్టిస్‌ రాజేశ్వరి దేవికి ఇద్దరు తమ్ముళ్లు. అందులో ఒకరైన రవి (బాలకృష్ణ) అన్యాయాలను ఎదిరిస్తుంటాడు. అవినీతి పరులైన ఇద్దరు రాజకీయ నాయకులు చేస్తున్న అరాచకాలను ఎదిరిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.

    నందమూరి బాలకృష్ణ- విజయశాంతి జంటగా తొలిసారి కథానాయకుడు అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంది విజయం సాధించింది.


    @2021 KTree