Editorial List
ఈవారం ఆహాలో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ చిత్రాలు
400+ views8 months ago
వాలెంటైన్స్ వీక్ కావడంతో ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌పాం చూసిన లవ్ రొమాంటిక్ చిత్రాలే ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆహా ఓటీటీలో లవ్‌స్టోరీ, చావు కబురు చల్లగా, 'మెంటల్ మదిలో' చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఓ సారి మీరు లుక్ వేయండి.
1 . మంచి రోజులు వచ్చాయి(నవంబర్ 04 , 2021)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
గుండు గోపాల్ (అజయ్ ఘోష్) కూతురు పద్మ (మెహరీన్) సహోద్యోగి సంతోష్‌ను ప్రేమిస్తుంది. గోపాల్‌ను చూసి అసూయ పడే స్నేహితులు ఈ విషయంలో అతడికి లేనిపోని భయాల్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సంతోష్-పద్మ ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
2 . రొమాంటిక్(అక్టోబర్ 29 , 2021)
UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
గోవాలో స్మగ్లింగ్ కోసం రెండు ముఠాల మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంటుంది. వాస్కోడిగామా (ఆకాష్ పూరి) ఓ ముఠాలో చేరి అనతికాలంలోనే నాయకుడిగా ఎదుగుతాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఎదిగిన అతడి కోసం ఏసీపీ రమ్య (రమ్యకృష్ణ)ను ప్రభుత్వం రంగంలోకి దింపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
3 . ఆర్య 2(నవంబర్ 27 , 2009)
UA|165 minutes|రొమాన్స్
ఇద్దరు అనాథలు చిన్నతనంలో విడిపోయి పెద్దయ్యాక కలుసుకుంటారు. ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది.
4 . కొంచెం ఇష్టం కొంచెం కష్టం(ఫిబ్రవరి 05 , 2009)
U|160 minutes|రొమాన్స్
ఒక యువకుడు ఒక యువతిని ప్రేమిస్తాడు. విడిపోయిన యువకుడి తల్లిదండ్రులు కలిస్తేనే.. పెళ్లికి ఒప్పుకుంటానని యువతి తండ్రి కండీషన్ పెడుతాడు.
5 . అందాల రాక్షసి(ఆగస్టు 10 , 2012)
UA|డ్రామా,రొమాన్స్
సంపన్నుడైన గౌతమ్ మిథునను ప్రేమిస్తాడు. కానీ ఆమె మరో వ్యక్తిని ఇష్టపడుతుంది. కొన్ని సంఘటనలు ముగ్గురి జీవితాల్లో కీలక మార్పులకు కారణమవుతాయి. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ చివరికి ఎలా ముగిసింది? అన్నది కథ.
6 . సమ్మతమే(జూన్ 24 , 2022)
UA|130 minutes|హాస్యం,డ్రామా
కృష్ణ (కిరణ్ అబ్బవరం) తన ఆలోచనలకు పూర్తిగా విరుద్దంగా ఉన్న శాన్వీ (చాందిని చౌదరి)ని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైన తన పద్దతిలోకి మార్చాలనుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య సమస్యలు మెుదలవుతాయి. వాటిని కృష్ణ ఎలా పరిష్కరించాడు? అనేది కథ.
7 . ఊర్వశివో రాక్షశివో(నవంబర్ 04 , 2022)
UA|హాస్యం,రొమాన్స్,డ్రామా
పెళ్లి బంధం ఎర్పరుచుకోవాలనే మనస్తత్వం ఉన్న అబ్బాయి... కేవలం లివ్- ఇన్- రిలేషన్ షిప్‌తోనే జీవితం సాగించాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఆ బంధం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ
8 . కృష్ణ అండ్ హిస్ లీల(జూన్ 25 , 2020)
UA|145 minutes|హాస్యం,రొమాన్స్
కృష్ణ అనే యువకుడు తన మాజీ ప్రేయసి సత్యతో విడిపోయి.. మరో అమ్మాయి రాధతో ప్రేమలో పడుతాడు. కానీ సత్య మళ్లీ దగ్గర కావడంతో ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
9 . తరగతి గాధి దాటి(ఆగస్టు 20 , 2021)
UA|22 minutes|డ్రామా
కిట్టు తెలివైన విద్యార్థి, కానీ అతనికి వంటపై ఆసక్తి ఉంటుంది. జాస్మిన్‌తో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఓ సంఘటన వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఇంతకు ఆ సంఘటన ఏమిటి?
10 . ది బేకర్ అండ్ ది బ్యూటీ(సెప్టెంబర్ 10 , 2021)
U|30-45 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఐరా వాసిరెడ్డి బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడుతుంది. రెండేళ్ల తర్వాత విడిపోయి హైదరాబాద్‌కు వస్తుంది. అక్కడ బేకరిలో పనిచేసే విజయ్‌ను కలుస్తుంది. వీరిద్దరూ క్లోజ్ అవుతారు. కానీ విజయ్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. చివరికి ఏం జరిగింది? విజయ్ ఐరా కలుస్తారా? లేక తన గర్ల్‌ఫ్రెండ్‌తో విజయ్ కలుస్తాడా? అన్నది మిగతా కథ
11 . నేను రౌడీ నే(అక్టోబర్ 21 , 2015)
UA|145 minutes|యాక్షన్,రొమాన్స్
పోలీసు అధికారి కొడుకు పాండు, వినికిడి లోపం ఉన్న అమ్మాయి కాదంబరితో ప్రేమలో పడతాడు. అయితే తన తల్లిదండ్రులను హత్య చేసిన గ్యాంగ్‌స్టర్‌ని చంపడానికి తనకు సాయం చేస్తేనే ప్రేమిస్తానని ఆ యువతి అతనికి కంజడీషన్ పెడుతుంది.
12 . ఫిదా(జూలై 21 , 2017)
U|134 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
వరుణ్ అనే ఎన్ఆర్ఐ మెడికల్ స్టూడెంట్ తన అన్న పెళ్లి కోసం ఇండియా వచ్చి భానుమతి అనే తెలంగాణ యువతితో ప్రేమలో పడుతాడు. ఓ సంఘటన వల్ల భానుమతి వరుణ్‌ను అపార్థం చేసుకుంటుంది. మరి ఈ ఇద్దరు తిరిగి కలుసుకుంటారా? లేదా? అన్నది కథ
13 . మా వింత గాధ వినుమ(నవంబర్ 13 , 2020)
UA|డ్రామా
కాలేజీలో లవర్స్ అయిన సిద్ధు, వినీత.. స్నేహితులతో కలిసి గోవాకు వెళ్తారు. అక్కడ వారి రొమాంటిక్ వీడియో వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
14 . మెంటల్ మదిలో(నవంబర్ 24 , 2017)
UA|డ్రామా,రొమాన్స్
స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతను ఇరకాటంలో పడుతాడు.
15 . చావు కబురు చల్లగా(మార్చి 19 , 2021)
UA|137 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసికెళ్లే వ్యాన్ డ్రైవర్. మల్లిక (లావణ్య త్రిపాఠి) భర్త శవాన్ని తీసుకెళ్లేందుకు వచ్చి తొలిచూపులోనే ఆమెను బాలరాజు ఇష్టపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లిక, బాలరాజును ఇష్టపడిందా? లేదా? అన్నది కథ.
16 . లవ్ స్టోరీ(సెప్టెంబర్ 24 , 2021)
UA|165 minutes|డ్రామా,రొమాన్స్
రేవంత్(నాగ చైతన్య) జుంబా సెంటర్ నడుపుతుంటాడు. మౌనిక (సాయి పల్లవి) జుంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? కలిసి బతికేందుకు వారు ఎలాంటి సాహసం చేశారు? అనేది కథ.