• TFIDB EN
  • Editorial List
    Tollywood Science Fiction Movies: తెలుగులో వచ్చిన టాప్‌ సైంటి ఫిక్‌ చిత్రాలు
    Dislike
    3 Likes 4k+ views
    11 months ago

    ఇప్పటివరకూ టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. ఫ్యామిలీ,యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌, కామెడీ ఇలా ప్రతీ జోనర్‌లో వందలాది సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే సైంటిఫిక్‌ జోనర్ చిత్రాలు మాత్రం టాలీవుడ్‌లో పరిమిత సంఖ్యలోనే వచ్చాయి. అయినప్పటికీ ఆ సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. రొటిన్ సినిమాలకు భిన్నంగా ఉండే ఈ చిత్రాలు ప్రేక్షకులకు మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో వచ్చిన టాప్‌ సైంటిఫిక్‌ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బొంభాట్(డిసెంబర్ 03 , 2020)
    U|హాస్యం,రొమాన్స్,సైన్స్ ఫిక్షన్
    ఎప్పుడు తాను దురదృష్టవంతుడినే అని భావించే ఓ యువకుడు అనుకోకుండా ఓ రోజు.. ఓ శాస్త్రవేత్తను కలుస్తాడు. ఆ తర్వాత అతని జీవితం కీలక మలుపు తిరుగుతుంది. అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయన్నది మిగతా కథ.

    తెలుగులో వచ్చిన మరో సైంటిఫిక్‌ మూవీ ‘బొంభాట్‌. మనిషికి.. మర మనిషికీ మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరక్కించారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించారు. సాయి సుశాంత్‌ రెడ్డి, చాందిని చౌదరి, ప్రియదర్శి, శిశిర్‌ శర్మ, తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషించారు.

    2 . నాని(మే 14 , 2004)
    UA|173 minutes|డ్రామా,రొమాన్స్
    ఓ సైంటిస్ట్ ద్వారా 28 ఏళ్ల యువకుడిగా మారిన చిన్నారి నాని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఓనర్ కూతురితో ప్రేమలో పడతాడు. కానీ అతను తన తల్లి నుంచి దూరమవుతున్నాని భావించి తిరిగి చిన్న పిల్లాడిలా మారుతాడు.
    3 . ఒక్క క్షణం(డిసెంబర్ 28 , 2017)
    UA|154 minutes|రొమాన్స్,థ్రిల్లర్,సైన్స్ ఫిక్షన్
    శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఎదైతే జరుగుతుందో అదే సంఘటనలు ఏడాది తర్వాత.. తమ జీవితాల్లో జరుగుతున్నట్లు జీవా, జోష్న గుర్తిస్తారు. స్వాతి హత్యకు గురైనప్పుడు, విధిని ఎదురించి జోష్నాను కాపాడేందుకు జీవా ఏం చేశాడు అనేది కథ

    అల్లు శిరీష్‌ హీరోగా వీ.ఐ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఒక్క క్షణం’ రూపొందింది. సైంటిఫిక్, సస్సెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని పంచింది. జీవా (అల్లు శిరీష్), జో (సురభి) లవర్స్. జో ఫ్లాట్‌కు ఎదురుగా ఉండే ఫ్లాట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) దంపతులు ఉంటారు. అయితే వారి జీవితంలో జరిగిన ఘటనలే జీవా-జోలకు కూడా ఎదురవుతాయి. అయితే అలా ఎందుకు జరుగుతుందన్నది ఆసక్తికరం.

    4 . అంతరిక్షం 9000 KMPH(డిసెంబర్ 21 , 2018)
    U|140 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    దేవ్‌ (వరుణ్‌ తేజ్‌) ఓ వ్యోమగామి. విప్రయాన్‌ అనే శాటిలైట్‌ను చంద్రుడిపైకి పంపడంలో విఫలమవుతాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ శాటిలైట్‌ను పంపే అవకాశం దేవ్‌కు వస్తుంది. ఈసారి దేవ్‌ సక్సెస్‌ అయ్యాడా లేదా? అంతరిక్షంలో దేవ్‌ టీమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.
    5 . అద్భుతం(నవంబర్ 19 , 2021)
    UA|142 minutes|రొమాన్స్,సైన్స్ ఫిక్షన్
    తన వల్లే తన తండ్రి చనిపోయాడన్న బాధతో ఓ యువకుడు ఆత్య హత్య చేసుకోవాలనుకుంటాడు. ఇదే క్రమంలో ఇష్టంలేని పెళ్లిచేసుకోలేక ఓ యువతి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి ఆత్యహత్య చేసుకావలనుకుంటున్న యువకుడి నుంచి ఆమె ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీంతో సూసైడ్ చేసుకోవడం మానేసి ఇద్దరు గొడవ పడుతారు. వారిద్దరి పరిచయం ప్రేమగా మారి ఒకరినొకరు కలవాలనుకుంటారు. మరి ఇద్దరు కలుస్తారా? ఆ తర్వాత ఏమి జరిగిందనేది కథ

    యంగ్‌ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. టైమ్‌ ట్రావెల్‌ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు పాత్రల మధ్య క్రాస్‌ టైమ్‌ కనెక్షన్‌ను నాలుగేళ్లుగా తీసుకొని ఈ మూవీని రూపొందించారు. కథకు హాస్యం, ఉత్కంఠ జోడించి డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ మంచి ఫలితం రాబట్టాడు.

    6 . ఓకే ఒక జీవితం(సెప్టెంబర్ 09 , 2022)
    U|157 minutes|డ్రామా,సైన్స్ ఫిక్షన్
    ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. వీరికి పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. పాల్‌ ఓ టైమ్‌ మిషన్‌ కనిపెడతాడు. గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. వారు గతంలో ఏం చేశారన్నది కథ.
    7 . యశోద(నవంబర్ 11 , 2022)
    UA|132 minutes|సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    యశోద(సమంత) పేద ఒక పేద యువతి. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల అద్దె తల్లి కావడానికి ఒప్పుకుంటుంది. ఆమెను మధు(వరలక్ష్మి శరత్ కుమార్)కి చెందిన ఎవా అనే సరోగసీ సెంటర్‌కి తీసుకెళ్తారు. అక్కడ యశోద అద్దె గర్భం మాటున జరగుతున్న ఘోరాలు తెలుస్తాయి. సరోగసి మాఫియాతో సమంత ఎలా పోరాడింది? ఆ మాఫియా కోరల్లోంచి సమంత బయటపడిందా? అనేది కథ
    8 . ఆదిత్య 369(జూలై 18 , 1991)
    U|141 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ

    తెలుగులో వచ్చిన మెుట్టమెుదటి సైంటిఫిక్‌ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ చిత్రం టైం మిషన్ అనే డిఫరెంట్ కాన్స్పెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. దీంతో బాలయ్య కెరీర్‌లోని చెప్పుకోతగ్గ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటిగా నిలిచింది.


    @2021 KTree