• TFIDB EN
  • Editorial List
    కళ్యాణ్ రామ్ టాప్ 10 బెస్ట్ చిత్రాలు
    Dislike
    300+ views
    9 months ago

    నందమూరి హరికృష్ణ నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ రామ్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. నిత్యం కొత్త కథలతో కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ తెలుగు తెరకు నవ్యత్వాన్ని పరిచయం చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా తీసిన ఆయన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బింబిసార(ఆగస్టు 05 , 2022)
    UA|146 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ,హిస్టరీ
    త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు (కల్యాణ్‌ రామ్‌) క్రూరత్వానికి ప్రతీక. అలాంటి బింబిసారుడు మాయా దర్పణం వల్ల క్రీ.పూ 500 ఏళ్ల నాటి నుంచి ప్రస్తుత ప్రపంచంలోకి అడుగుపెడతాడు. వర్తమానంలో బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ.

    బింబిసారా చిత్రం హిట్ ద్వారా తొలి ఇండస్ట్రీ హిట్‌ను కళ్యాణ్ రామ్ అందుకున్నాడు.

    2 . తొలి చూపులోనే(అక్టోబర్ 09 , 2003)
    UA|డ్రామా,రొమాన్స్
    రాజు, భాను ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ భాను తండ్రి శ్రీకర్ ప్రసాద్, తన స్నేహితుడి కొడుకుతో ఆమె పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. దీంతో రాజు వారిద్దరినీ పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు.
    3 . 118(మార్చి 01 , 2019)
    UA|126 minutes|యాక్షన్,థ్రిల్లర్
    గౌతమ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతనికి రోజూ ఒక మహిళ హత్యకు గురైనట్లు పదే పదే పీడకలలు వస్తుంటాయి. అయితే తన కల వెనుక నిజాన్ని కనుగోనేందుకు అన్వేషణ మొదలు పెడుతాడు.
    4 . పటాస్(జనవరి 23 , 2015)
    A|133 min|యాక్షన్,రొమాన్స్
    అవినీతిపరుడైన పోలీస్ అధికారి కళ్యాణ్ సిన్హా.... హైదరాబాద్‌కు ట్రాన్సఫర్ అవుతాడు. అక్కడ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బు సంపాధిస్తుంటాడు. ఇది డీజీపీ సాయి కుమార్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుంది.
    5 . అతనొక్కడే(మే 07 , 2005)
    UA|147 minutes|యాక్షన్
    రామ్‌, అంజలి బావ మరదళ్లు. చిన్నప్పుడు అన్న అనే రౌడీ వారి కుటుంబంలోని అందర్ని హత్య చేస్తాడు. అతడి బారి నుంచి రామ్‌, అంజలి తప్పించుకొని ఒకరి గురించి ఒకరికి తెలయకుండా దూరంగా పెరుగుతారు. పెద్దయ్యాక అన్నపై ప్రతీకారం తీర్చుకునేందుకు కలుస్తారు.

    ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ తొలి బ్లాక్‌బాస్టర్ హిట్‌ను అందించింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన మాస్ ప్రేక్షకులను దగ్గర చేసింది.


    @2021 KTree