• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi Top 10 Family Movies: చిరంజీవి టాప్ 10 ఫ్యామిలీ మూవీస్
    Dislike
    2k+ views
    8 months ago

    చిరంజీవికి ప్రత్యేమమైన ఫ్యామిలీ ఆడియెన్స్ ఉంటారు. సినిమా కథల ఎంపికలో చిరంజీవి ఫ్యామిలీ మూవీస్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. సెంటిమెంట్, ఎమోషన్స్‌ని పండించడంలోనూ మెగాస్టార్‌కు సాటిరారంటే అతిశయోక్తి కాదు. తండ్రిగా, కొడుకుగా, అన్నయ్యగా, తమ్ముడిగా, అల్లుడిగా.. ఇలా చిరు నటించిన పాత్ర లేదు. అన్నింట్లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుడితో కంటతడి పెట్టించగలడు. 150కు పైగా సినిమాలలో ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కి దగ్గరయ్యాయి. అందులో టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . విజేత(అక్టోబర్ 23 , 1985)
    U|డ్రామా,రొమాన్స్
    చినబాబు ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటాడు. బాగా సంపాదిస్తున్న అన్నదమ్ములు ఉన్నప్పటికీ, తన చెల్లెలి పెళ్లికి తన తండ్రి చాలా కష్టపడుతున్నాడని తెలుసుకున్నప్పుడు, చిన్నా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు.

    కుటుంబం కోసం తన లక్ష్యాన్ని సైతం డబ్బుకు తాకట్టు పెట్టే చిన్నబాబు పాత్రలో నటించాడు చిరంజీవి. తండ్రి మాట జవదాటని కొడుకుగా, అన్నయ్యలకు చేదోడుగా నిలిచే తమ్ముడిగాా ఆడియెన్స్‌ని మెప్పించాడు.

    2 . శుభలేఖ(జూన్ 11 , 1982)
    U|139 mins|డ్రామా,మ్యూజికల్
    సుజాత అనే లెక్చరర్, ఒక ధనవంతుడు పెళ్లి ప్రతిపాదనతో తన ఇంటికి వచ్చినప్పుడు వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడుతుంది. కానీ ఆమె ఆధునిక ఆలోచనలు ఆమెను ఉద్యోగం లేకుండా చేస్తాయి. అంతేకాదు సుజాత కుటుంబం ఆమెను బహిష్కరిస్తుంది.

    మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అయిన నరసింహ మూర్తి పాత్రలో చిరంజీవి ఒదిగి పోయాడు. సమాజం కట్టుబాట్లను ధిక్కరించే సుజాతకు ఆశ్రయమిచ్చి సాహసం చేస్తాడు. చివరికి సుజాత ప్రేమను పొందుతాడు.

    3 . శ్రీ మంజునాథ(జూన్ 22 , 2001)
    U|157 minutes|డ్రామా,హిస్టరీ
    మంజునాథ (అర్జున్‌) అనే నాస్తికుడు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. అతడు శివుని భక్తురాలైన కాత్యాయిని (సౌందర్య)ని వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత మంజునాథ జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో అతడు శివుడికి పరమభక్తుడిగా మారిపోతాడు. మరి మంజునాథ ఎందుకు మారాడు? మారిన తర్వాత ఏం చేశాడు? అనేది మిగతా కథ.

    శివుడి పాత్రలో అతిథిగా నటించాడు చిరంజీవి. ప్రతి శివరాత్రికి టీవీలో ఈ సినిమాను వేస్తారంటే ఎంతగా ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు.

    4 . మంచుపల్లకీ(నవంబర్ 19 , 1982)
    U|132 minutes|డ్రామా
    ఒక కాలనీలో నివసిస్తున్న నిరుద్యోగ యువకులు వారి పక్కింట్లో ఉంటున్న గీతను చూసి ఇష్టపడుతారు. అయితే వారి మాయలో పడని గీత వారికి గుణపాఠం నేర్పుతుంది. వారి బాధ్యతలను గ్రహించేలా చేస్తుంది.
    5 . అన్నయ్య(జనవరి 07 , 2000)
    U/A|157 mins|హాస్యం,డ్రామా
    రాజారామ్ తన ఇద్దరు తమ్ముళ్లను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. వారు చేసే అల్లరి పనులను ఎప్పుడూ క్షమిస్తుంటాడు. ఒక సంఘటన వల్ల రాజారామ్ తన తమ్ముళ్లను ఇంట్లో నుంచి గెంటి వేస్తాడు. కానీ వారికి రహస్యంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అయితే రాజారామ్ తమ్ముళ్లు మాత్రం అతన్ని ద్వేషించుకుంటారు.
    6 . రాజా విక్రమార్క(నవంబర్ 14 , 1990)
    U|154 minutes|యాక్షన్,డ్రామా
    రాజా విక్రమార్క ( చిరంజీవి ) స్కంద ద్వీపపు యువరాజు. యువరాజు కావడంతో, తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి వీలుండేది కాదు. అతని తండ్రి రాజా భూపతి ( సత్యనారాయణ ) మరొక రాజ్య యువరాణితో పెళ్ళి సంబంధం మాట్లాడుతాడు. పెళ్లి ఇష్టంలేని రాజా విక్రమార్క రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతాడు. ఓ నగరంలో మెకానిక్‌గా పనిచేస్తాడు. ఈక్రమంలో ప్రమాదంలో ఓ సంపన్న యువతికి బాడీగార్డ్‌గా మారుతాడు? ఇంతకు ఆ యువతికి వచ్చిన ప్రమాదం ఏమిటి? ఆమెను రాజా ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.
    7 . జగదేక వీరుడు అతిలోక సుందరి(మే 09 , 1990)
    U|యాక్షన్,ఫ్యామిలీ
    నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.
    8 . చిరంజీవి(undefined 00 , 1985)
    A|క్రైమ్,డ్రామా
    చిరంజీవి ఒక టాలీవుడ్ చిత్రం, ఇది 18 ఏప్రిల్ 1985న విడుదలైంది. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి, భానుప్రియతో విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం కన్నడ చిత్రం నానే రాజా (1984)కి రీమేక్.
    9 . మగధీరుడు(మార్చి 07 , 1986)
    U|డ్రామా,మ్యూజికల్
    చిరు ఒక అమ్మాయిని తన ప్రేమిస్తాడు. తన కుటుంబానికి ఇష్టం లేకున్నా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇదే సమయంలో అతని తండ్రి మరణిస్తాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్తి కోసం తగాదా పడుతారు. మరోవైపు చిరు జైలుకు వెళ్లిపోవడంతో అతని భార్య ఒంటరిగా మిగిలిపోతుంది.
    10 . హిట్లర్(జనవరి 04 , 1997)
    U|153 minutes|డ్రామా
    మాధవరావుకి తన ఐదుగురు చెల్లెళ్లంటే ప్రాణం. క్రూరమైన సమాజం నుండి చెల్లెళ్లను రక్షించే క్రమంలో వారి పట్ల కాస్త కఠినంగా ఉంటాడు. సిస్టర్స్ తన అన్నకు ఎదురు తిరిగినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.

    @2021 KTree