• TFIDB EN
  • Editorial List
    Top 10 Chiranjeevi Movies: చిరంజీవి ఉత్తమ 10 చిత్రాలు ఇవే
    Dislike
    1 Likes 2k+ views
    8 months ago

    తెలుగు చిత్రసీమలో పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుప్రీం హీరోగా ఎదిగి మెగాస్టార్‌గా స్థిరపడ్డాడు. సినీ కెరీర్‌లో 150కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత మెగాస్టార్ సొంతం. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత. అందులో ఉత్తమ మైన చిత్రాలేంటో చెప్పడం కాస్త కష్టమే. నటన, సినిమాకు వచ్చిన ఆదరణ, విమర్శకుల ప్రశంసలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని సినిమాల పేర్లను ప్రస్తావించొచ్చు. అవేంటో చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . రుద్రవీణ(మార్చి 04 , 1988)
    U|170 minutes|డ్రామా,మ్యూజికల్
    సంగీత విద్వాంసుని కొడుకు తన సంగీతంతో సమాజాన్ని మార్చాలని కోరుకుంటాడు కానీ అతని తండ్రి అతని ప్రవర్తనను ఒప్పుకోడు. అతని ప్రయత్నాలకు ప్రభుత్వం నుండి ప్రశంసలు అందడంతో ఆ తండ్రి మారుతాడు.

    సంప్రదాయ సంగీతం, శక్తితో సమాజాన్ని మార్చాలనుకునే పాత్రలో చిరంజీవి నటించాడు. 1988లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    2 . స్వయంకృషి(సెప్టెంబర్ 03 , 1987)
    U|డ్రామా,మ్యూజికల్
    సాంబయ్య (చిరంజీవి) చెప్పులు కుట్టుకుంటూ స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. గంగ (విజయశాంతి)ను పెళ్లి చేసుకొని చెల్లెలు కొడుకు చిన్నాను సొంత బిడ్డలా పెంచుతాడు. అయితే ధనిక జీవితానికి ఇష్టపడ్డ చిన్నా కాయ కష్టం పనులను అసహ్యించుకుంటాడు. చిన్నా అసలు తండ్రి గోవింద్‌ (చరణ్‌రాజ్‌) రాకతో సాంబయ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది కథ.

    వీధి కార్మికులను గౌరవించాలనే వృత్తాంతంతో ఈ సినిమా తెరకెక్కింది. చర్మకారుడి(చెప్పులు కుట్టేవాడు) పాత్రలో నటించి ఈ వృత్తికే గౌరవం తీసుకొచ్చాడు చిరంజీవి. 1987లో ఈ సినిమా విడుదలై కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.

    3 . చంటబ్బాయి(ఆగస్టు 22 , 1986)
    U|హాస్యం,డ్రామా
    పాండు రంగారావు ఒక డిటెక్టివ్, జేమ్స్ పాండ్‌గా ప్రసిద్ధి చెందాడు. ఒక మహిళ తప్పిపోయిన తన సోదరుడిని కనిపెట్టేందుకు పాండు రంగారావును కలవడంతో అతని జీవితం ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.

    జేమ్స్ బాండ్‌గా చెప్పుకొనే డిటెక్టివ్ పాత్రలో నటించాడు చిరంజీవి. అదృశ్యమైన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కొడుకుని కనిపెట్టేందుకు డిటెక్టివ్ ఏం చేశాడన్నది నవ్వులు పూయిస్తుంది. 1986లో సినిమా విడుదలైంది.

    4 . జగదేక వీరుడు అతిలోక సుందరి(మే 09 , 1990)
    U|యాక్షన్,ఫ్యామిలీ
    నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.

    దేవకన్య ఉంగరంతో టూరిస్ట్ గైడ్‌కి అతీంద్రియ శక్తులు అలవడుతాయి. కానీ, ఆ ఉంగరాన్ని తిరిగి తనకిచ్చేయాలని దేవకన్య వెంటపడుతుంది. టూరిస్ట్ గైడ్‌గా చిరంజీవి నటించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నాడు. 1990లో సినిమా విడుదలైంది.

    5 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

    పనీపాట లేకుండా తిరిగే రాజారం పాత్రలో నటించాడు చిరంజీవి. తన అన్నయ్యను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం, విడిపియిన కుటుంబాన్ని ఒక్కటి చేయడమే లక్ష్యంగా సినిమా సాగుతుంటుంది. 1991లో రిలీజై ట్రెండ్ సెట్ చేసింది.

    6 . ఆపద్బాంధవుడు(అక్టోబర్ 09 , 1992)
    U|డ్రామా,మ్యూజికల్
    మాధవ తన యాజమాని కూతురు హేమతో ప్రేమలో పడుతాడు. అయితే సామాజిక కట్టుబాట్ల కారణంగా తన ప్రేమను బయటపెట్టడు. కానీ హేమ అకస్మాత్తుగా మెంటల్ ఆస్పత్రిలో చేరినప్పుడు.. ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

    ఓ ఇంట్లో నౌకరిగా, ప్రియురాలిని కాపాడుకునే ఆపద్బాంధవుడిగా చిరంజీవి నటించాడు. మతి కోల్పోయిన యజమాని కుమార్తెను మామూలు మనిషిగా మార్చడానికి చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.

    7 . పశివాడి ప్రాణం(జూలై 23 , 1987)
    U|యాక్షన్,క్రైమ్
    భార్య చనిపోవడంతో మధు మద్యానికి బానిసవుతాడు. అతని జీవితంలోకి అనుకోకుండా వినికిడి, మాట లోపం ఉన్న రాజా అనే పిల్లవాడు వస్తాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను చంపిన హంతకులు అతన్ని చంపేందుకు వెతుకుతుంటారు.

    ఓ చిన్నారి కోసం జీవితాన్నే మార్చుకున్న మధు పాత్ర పోషించాడు చిరంజీవి. చిన్నారి తల్లిదండ్రులను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    8 . ఠాగూర్(సెప్టెంబర్ 24 , 2003)
    U|176 minutes|యాక్షన్,డ్రామా
    ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండి అధికారులను నిర్మూలించడానికి ఠాగూర్ అనే ప్రొఫెసర్ తన స్టూడెంట్స్‌తో ఒక నిఘా సంస్థను రూపొందిస్తాడు. ఆ సంస్థ ద్వారా అవినీతి పరులను ఏరిపారేస్తాడు.

    సమాజంలో అవినీతి అనే భూతం ఉండకూడదని తపించే ఫిజిక్స్ ప్రొఫెసర్‌ రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.

    9 . ఇంద్ర(జూలై 24 , 2002)
    U|173 minutes|యాక్షన్
    రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.

    తరతరాలుగా వస్తున్న శత్రుత్వాన్ని, ప్రజల సమస్యల్ని రూపు మాపడానికి ఇంద్ర సేన రెడ్డి పాత్రలో నటించాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం భారీ హిట్‌ని అందుకుంది. ఫ్యాక్షన్ లీడర్‌గా చిరంజీవి చెప్పిన డైలాగులూ ఇప్పటికీ ఫేమస్.

    10 . శంకర్ దాదా MBBS(అక్టోబర్ 15 , 2004)
    U|172 minutes|హాస్యం
    శంకర్ దాదా.. స్థానికంగా సెటిల్‌మెంట్లు చేసే రౌడీ. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన శంకర్ దాదా... తన తల్లిదండ్రులకు తానొక డాక్టర్‌ అని అబద్దం చెబుతాడు. అయితే శంకర్ డాక్టర్ కాదన్న విషయాన్ని రామలింగేశ్వరరావు అతని తల్లిదండ్రులకు చెబుతాడు.

    ఔషధాలతో కాకుండా మానవత్వంతో రోగులకు చికిత్స చేయాలనే నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. శంకర్‌ పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వించాడు చిరంజీవి.


    @2021 KTree