• TFIDB EN
  • Editorial List
    పవన్ కళ్యాణ్ టాప్ 10 కామెడీ చిత్రాలు
    Dislike
    2 days ago

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయన సుదీర్ఘ సినిమా కెరీర్‌లో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. తనదైన హావభావాలతో కామెడీ పంచ్‌ డైలాగ్స్ విసురుతుంటారు. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్‌.. అగ్రనటుడిగా ఎదిగారు. పవన్‌ తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు.అందులో ఆయన నటించిన కామెడీ చిత్రాలను ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కెమెరామెన్ గంగతో రాంబాబు(అక్టోబర్ 18 , 2012)
    UA|154 minutes|డ్రామా
    అన్యాయం చేస్తున్న వారిని కొట్టిమరి రాంబాబు న్యాయం చేస్తుంటాడు. అతడి క్యారెక్టర్‌ నచ్చి కెమెరామెన్‌ గంగా తమ న్యూస్‌ ఛానెల్‌లో జర్నలిస్టుగా జాయిన్‌ చేయిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో అతడు ఎలాంటి మార్పును తీసుకొచ్చాడు? అన్నది కథ.
    2 . భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 , 2022)
    UA|145 minutes|యాక్షన్,డ్రామా
    బీమ్లా నాయక్‌ (పవన్‌ కల్యాణ్‌) నిజాయతీ గల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. రాజకీయ పలుకుపడి ఉన్న డానియల్ శేఖర్‌ (రానా) కారులో మద్యం సీసాలతో వెళ్తూ పోలీసులకు చిక్కుతాడు. బీమ్లా నాయక్‌ డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతని అహం దెబ్బ తింటుంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడన్నది కథ.
    3 . ఖుషి(ఏప్రిల్ 27 , 2001)
    UA|177 minutes|రొమాన్స్
    మధు, సిద్ధూలు కాలేజీ ఫ్రెండ్స్. అపార్థాల కారణంగా దూరంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న ఇగో కారణంగా చెప్పుకోరు. అయితే మధు, సిద్ధూ ప్రాణ స్నేహితుల ప్రేమ ప్రమాదంలో పడినప్పుడు వీరిద్దరూ కలిసి వారి ప్రేమను గెలిపిస్తారు. ఈ ప్రయాణంలో ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుసుకుని కలిసేందుకు ప్రయత్నిస్తారు.
    4 . తొలి ప్రేమ(జూలై 24 , 1998)
    U|146 minutes|డ్రామా,రొమాన్స్
    అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.
    5 . బంగారం(మే 03 , 2006)
    A|176 minutes|యాక్షన్,డ్రామా
    బంగారం అనే న్యూస్ రిపోర్టర్ బీబీసీలో పనిచేయాలని కలగంటాడు. అయితే తాను పనిచేసే ఛానెల్ ఛైర్మన్ రికమండేషన్ కోసం రాయలసీమ వెళ్తాడు. అక్కడ అతని కుమార్తే ప్రమాదంలో పడగా ఆమెను రక్షిస్తాడు.
    6 . జల్సా(ఏప్రిల్ 01 , 2008)
    A|167 minutes|యాక్షన్,హాస్యం
    సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
    7 . గుడుంబా శంకర్(సెప్టెంబర్ 10 , 2004)
    U|176 minutes|యాక్షన్,రొమాన్స్
    గుడుంబా శంకర్‌తో గౌరి ప్రేమలో పడుతుంది. అయితే ఆమెను గ్యాంగ్‌స్టర్ అయిన కుమార్ స్వామిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని గుడుంబా శంకర్ తెలుసుకుంటాడు. గౌరిని అతని నుంచి కాపాడేందుకు శంకర్ ఒక ప్లాన్ వేస్తాడు.
    8 . కాటమరాయుడు(మార్చి 24 , 2017)
    UA|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    పవన్ కల్యాణ్ తన కుటుంబం మరియు గ్రామం కోసం నిలబడే ఓ ధైర్యశాలి వ్యక్తిగా ప్రధాన పాత్ర పోషించారు. గ్రామంలో తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అవంతిక అనే యువతి అతని జీవితంలోకి రావడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
    9 . అత్తారింటికి దారేది(సెప్టెంబర్ 27 , 2013)
    U|175 minutes|యాక్షన్,డ్రామా,ఫ్యామిలీ
    హీరో తన అత్తయ్యను తాతయ్యతో కలిపేందుకు ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అత్తను తన కుటుంబంలో ఎలా కలిపాడు? అన్నది కథ.
    10 . గబ్బర్ సింగ్(మే 11 , 2012)
    UA|152 minutes|యాక్షన్,డ్రామా
    వెంకటరత్నం తండ్రిపై కోపంతో ఊరు వదిలి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక గబ్బర్‌సింగ్‌ అనే పోలీసు ఆఫీసర్‌గా అదే ఊరికి తిరిగొస్తాడు. ఆ ఊరిలోని సిద్దప్ప నాయుడు చాలా దుర్మార్గుడు. రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతడికి హీరో ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.

    @2021 KTree