• TFIDB EN
  • ఆహాలో టాప్ 10 కామెడీ సినిమాలు
    Dislike
    3k+ views
    1 year ago

    ఆహాలో 2020 నుంచి 2023 వరకు స్ట్రీమింగ్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో టాప్ 10 సినిమాలను ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. వీటిలో డీజే టిల్లు, సామజవరగమన, జాంబీ రెడ్డి వంటి హిట్ చిత్రాలతో పాటు ఇతర చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు చూసి కడుపుబ్బ నవ్వుకోండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . డీజే టిల్లు(ఫిబ్రవరి 12 , 2022)
    UA|హాస్యం,రొమాన్స్
    డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
    2 . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(అక్టోబర్ 15 , 2021)
    UA|హాస్యం,రొమాన్స్
    హర్ష (అఖిల్‌) ఎంతో మంది పెళ్లి కూతర్లని చూస్తాడు. అందులో ఒకరైన విభ (పూజా హెగ్డే) హర్షకు బాగా నచ్చుతుంది. కానీ విభ రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం ఏమిటి? హర్ష ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    3 . ప్రేమలు(మార్చి 08 , 2024)
    U|హాస్యం,రొమాన్స్
    స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌.
    4 . కీడా కోలా(నవంబర్ 03 , 2023)
    UA|హాస్యం,క్రైమ్
    ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
    5 . జాంబీ రెడ్డి(ఫిబ్రవరి 05 , 2021)
    UA|హాస్యం,హారర్
    మారియో (తేజ సజ్జా) ఓ గేమ్‌ డిజైనర్‌. స్నేహితుడు కల్యాణ్‌ (హేమంత్‌) పెళ్లికి తన గ్యాంగ్‌తో రుద్రవరానికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన వారికి అనూహ్య పరిణాణం ఎదురవుతుంది. ఫ్రెండ్స్‌లోని కిరీటీ జాంబీలాగా మారిపోతాడు. అతడు ఎందుకు అలా అయ్యాడు? ఊరు మెుత్తం జాంబీల్లాగా మారడానికి కారణం ఏంటి? వారిని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? అన్నది కథ.
    6 . వినరో భాగ్యము విష్ణు కథ(ఫిబ్రవరి 18 , 2023)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    దర్శన (కాశ్మీరా పరదేశి), ఒక యూట్యూబర్, ఆమె ఫోన్ నంబర్‌లో లాస్ట్‌ నెంబర్‌కు తర్వాత ఉన్న విష్ణు (కిరణ్ అబ్బవరం)తో అనుకోకుండా ఓ రోజు ఫోన్ కలుస్తుంది. వీరి పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారుతుంది. మరోవైపు మురళి శర్మతో ఇదే తరహా ఫొన్ పరిచయం ఏర్పడుతుంది. దర్శన తన యూట్యూబ్ ఛానెల్‌ని మరింత విస్తరించేందుకు విష్ణు, శర్మ సాయం చేస్తారు. అయితే ఓ రోజు శర్మను దర్శన కాల్చి చంపుతుంది? అసలు శర్మను దర్శన ఎందుకు కాల్చి చంపుతుంది అన్నది మిగతా కథ.
    7 . భానుమతి & రామకృష్ణ(జూలై 03 , 2020)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలు, భావజాలం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు, వారు ప్రేమలో ఎందుర్కొన్న సవాళ్లు ఏమిటి అన్నది మిగతా కథ.

    @2021 KTree