• TFIDB EN
  • అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్ 10 మిస్టరీ క్రైమ్ చిత్రాలు
    Dislike
    2k+ views
    6 months ago

    మిస్టరీ- క్రైమ్ జనర్‌ చిత్రాలంటే ప్రేక్షకులకు ఎప్పుడు ఆసక్తి ఉంటూనే ఉంటుంది. మిస్టరీని ఛేదించే సీన్లు ఆద్యంతం థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని పంచుతాయి. ఈక్రమంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో టాప్ 10 మిస్టరీ- క్రైమ్‌ చిత్రాలను YouSay TFIDB లిస్ట్ చేసింది. వీటిలో దృశ్యం, పలాస, హిట్2, ఫాస్ట్ ఎక్స్ వంటి చిత్రాలు ఉన్నాయి. మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకుని చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . దృశ్యం 2(నవంబర్ 25 , 2021)
    U|క్రైమ్,థ్రిల్లర్
    పోలీస్ ఆఫీసర్ గీత (నదియా) కొడుకు హత్య కేసు నుంచి బయటపడ్డ రాంబాబు (వెంకటేష్) ఫ్యామిలీకి మళ్లీ ఆరేళ్ల తరువాత కష్టాలు మొదలవుతాయి. పోలీసులు వేసిన ఎత్తులు ఏంటి? దానికి రాంబాబు వేసిన పై ఎత్తులు ఏంటి? అన్నది కథ.
    2 . హిట్: ది సెకండ్ కేస్(డిసెంబర్ 02 , 2022)
    A|క్రైమ్,మిస్టరీ
    వైజాగ్‌లో ఓ యువతి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారుతుంది. ఆ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ దేవ్ (అడివి శేష్) ప్రత్యేక అధికారిగా వస్తాడు. ఇంతకు హంతకుడు ఎవరు? మహిళలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నాడు అనేది మిగతా కథ
    3 . పలాస 1978(మార్చి 06 , 2020)
    A|యాక్షన్,క్రైమ్,డ్రామా
    భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వీరిద్దరు నిర్ణయించుకుంటారు.
    4 . హిట్: ది ఫస్ట్ కేస్(ఫిబ్రవరి 28 , 2020)
    U/A|యాక్షన్,మిస్టరీ,థ్రిల్లర్
    ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
    5 . V(సెప్టెంబర్ 05 , 2020)
    U/A|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    క్లిష్టతరమైన కేసులను ఛేదిస్తూ విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్‌కు... 'V' అనే సీరియల్ కిల్లర్ చిక్కుముడిగా మారుతాడు. తనను హత్యలు చేయకుండా అడ్డుకోవాలని పోలీస్‌ ఆఫీసర్‌ను 'V' సవాలు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    6 . టైగర్ నాగేశ్వరరావు(అక్టోబర్ 20 , 2023)
    U/A|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    టైగర్ నాగేశ్వరరావు(రవితేజ) అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు అనేది కథ.
    7 . కపటధారి(ఫిబ్రవరి 19 , 2021)
    U/A|క్రైమ్,థ్రిల్లర్
    గౌతమ్‌ (సుమంత్‌) ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌. అతను విధులు నిర్వర్తిస్తున్న పరిధిలో 40 ఏళ్ల కిందట జరిగిన హత్యలకు సంబంధించి అస్తిపంజరాలు బయటపడతాయి. ఆ తర్వాత గౌతమ్‌ ఏం చేశాడు? కేసు దర్యాప్తులో అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    8 . మధ(మార్చి 13 , 2020)
    U/A|మిస్టరీ,థ్రిల్లర్
    నిషా అనే అనాథ, అర్జున్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. కానీ నిషాను మానసిక రోగిగా అర్జున్ చిత్రీకరించి తర్వాత ఆమెకు ద్రోహం చేస్తాడు. దీంతో ఆమెను మానసిక చికిత్సాలయంలో బలవంతంగా చేరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    9 . హంట్(జనవరి 26 , 2023)
    U/A|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడుతాడు. ప్రమాదం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ప్రమాదానికి ముందు, తన స్నేహితుడు ACP ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) హత్య కేసును దర్యాప్తు చేస్తుంటాడు. ఇంతకు ఆర్యన్ దేవ్‌ను ఎవరు చంపారు? అర్జున్ జ్ఞాపకశక్తిని తిరిగి పొందాడా? అన్నది మిగతా కథ.
    10 . ఫాస్ట్ X(మే 19 , 2023)
    U/A|యాక్షన్,అడ్వెంచర్,క్రైమ్
    డొమినిక్ టొరెట్టో (విన్ డీజిల్) తన భార్య లెట్టీ(మిచెల్లీ రోడ్రిడ్జ్‌)తో కలిసి సుఖంగా జీవితాన్ని సాగిస్తుంటాడు. ఇదే సమయంలో రోమ్ నగరంలో ఒక మిషన్‌కు సంబంధించి ఏజెన్సీ నుంచి సమాచారం అందుతుంది. అయితే, దానికి డొమినిక్‌ వెళ్లకుండా రోమన్‌ (టైరీస్ గిబ్సన్) లీడ్‌గా టీమ్‌ను పంపిస్తాడు. ఆ తర్వాత అదొక కుట్ర అని తెలుస్తుంది. ఆ కుట్రం నుంచి తన టీమ్‌ను, కుటుంబాన్ని టొరెట్టో ఎలా కాపాడుకున్నాడు? ఇంతకు ఆ కుట్ర చేసింది ఎవరు అనేది మిగిలిన కథ

    @2021 KTree