• TFIDB EN
  • ఆహాలో టాప్ 10 క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు
    Dislike
    3k+ views
    1 year ago

    వెన్నులో వ‌ణుకుపుట్టించే ఉత్కంఠ‌భ‌రిత‌మైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ లిస్ట్‌ మిమ్మల్ని మెప్పించవచ్చు. ఆహాలో టాప్ 10 క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇక్కడ సేకరించడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లోని మజాను ఆస్వాదించండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . క్రైమ్ రీల్(జూలై 19 , 2024)
    A|క్రైమ్,డ్రామా
    ఒక అమాయకురాలైన అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేయడం మెుదలుపెడుతుంది. అంతటితో ఆగకుండా సోషల్‌ మీడియాలో వచ్చే ట్రెండ్స్‌ ఫాలో అవ్వడం, వాటిలో పాల్గొనడం చేస్తుంది. దీంతో హీరోయిన్‌ కావాలన్న కల ఆమెలో మెుదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోషల్‌ మీడియా రీల్స్‌ వల్ల ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
    2 . హరోం హర(జూన్ 14 , 2024)
    UA|యాక్షన్,క్రైమ్,డ్రామా
    కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు? అన్నది కథ.
    3 . యేవమ్‌(జూన్ 14 , 2024)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    వికారాబాద్‌ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో ఎస్సై సౌమ్య (చాందినీ చౌదరీ)కు పోస్టింగ్‌ వస్తుంది. అదే స్టేషన్‌లో పనిచేసే మరో ఎస్సై అభిరామ్‌కు దగ్గరవుతుంది. అయితే అభిరామ్‌కు గతంలోనే హారికతో పెళ్లి జరుగుతుంది. మరోవైపు ఓ యుగంధర్‌ అనే సైకో ప్రభాస్‌ పేరు వాడుకొని అమ్మాయిలను ట్రాప్‌ చేసి హత్యలు చేస్తుంటాడు. హారికకు ఆ సైకోకు సంబంధం ఏంటి? సౌమ్య ఇన్‌వెస్టిగేషన్‌లో బయటపడిన షాకింగ్‌ నిజాలు ఏంటి?
    4 . మిరల్(మే 17 , 2024)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    హరి, రమ భార్య భర్తలు. తన భర్తను ఎవరో చంపినట్లు రమకు కల వస్తుంది. దీంతో కుల దైవం గుడిలో పూజ చేయించేందుకు సొంత ఊరికి వెళ్తారు. అనంతరం సిటీకి బయలుదేరినప్పటి నుంచి హరి, రమలకు వింత అనుభవాలు ఎదురవుతాయి. కలలో వచ్చిన సంఘటనలే వారికి తారసపడతాయి. హరి ఫ్యామిలీని వెంటాడుతున్న ఆ అతీతశక్తి ఏంటి? హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అన్నది కథ.
    5 . తెప్ప సముద్రం(ఏప్రిల్ 19 , 2024)
    UA|క్రైమ్,మిస్టరీ,థ్రిల్లర్
    తెప్ప సముద్రం అనే గ్రామంలో స్కూల్‌ పిల్లలు మాయమవుతుంటారు. దీనిని కనిపెట్టేందుకు ఎస్సై గణేష్‌ (చైతన్య రావు) రంగంలోకి దిగుతాడు. మరోవైపు రిపోర్టర్‌ ఇందు (కిశోరి ధాత్రిక్‌) కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో వారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి? ఆ వాస్తవాలు ఏంటి? గణేష్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది స్టోరీ.
    6 . భరతనాట్యం(ఏప్రిల్ 05 , 2024)
    UA|హాస్యం,క్రైమ్
    రాజు సుందరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆర్థిక సమస్యల వల్ల డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని భావిస్తాడు. ఓ ముఠా నుంచి పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. దీంతో ఆ ముఠా నుంచి రాజుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడు డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.
    7 . భామాకలాపం 2(ఫిబ్రవరి 16 , 2024)
    UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
    కొత్తగా హోటల్‌ పెట్టుకున్న అనుపమ (ప్రియమణి) అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? అన్నది కథ
    8 . కోట బొమ్మాళి P.S(నవంబర్ 24 , 2023)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ.
    9 . కీడా కోలా(నవంబర్ 03 , 2023)
    UA|హాస్యం,క్రైమ్
    ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
    10 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
    UA|క్రైమ్,హారర్,థ్రిల్లర్
    ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ

    @2021 KTree