• TFIDB EN
  • నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 క్రైమ్ థ్రిల్లర్ తెలుగు చిత్రాలు
    Dislike
    3 Likes 4k+ views
    1 year ago

    ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ కచ్చితంగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ రేటింగ్ ఉన్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో విరూపాక్ష, స్పైడర్, గేమ్ ఓవర్ వంటి చిత్రాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం థ్రిల్లింగ్ సినిమాల్లో ఉండే మజాను ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . యానిమల్‌ (డిసెంబర్ 01 , 2023)
    A|యాక్షన్,క్రైమ్,డ్రామా
    దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
    2 . రోజా(ఆగస్టు 15 , 1992)
    U|రొమాన్స్,థ్రిల్లర్
    తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన ఒక సాధారణ అమ్మాయి రోజా. జమ్మూ కాశ్మీర్‌లో ఓ రహస్య మిషన్‌ కోసం వెళ్లిన రిషిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. ఈక్రమంలో తన భర్త రిషిని కనుగొనడానికి రోజా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. చివరకు రోజా తన భర్తను తిరిగి కలిసిందా? లేదా? అనేది మిగతా కథ.
    3 . జవాన్(నవంబర్ 02 , 2023)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
    4 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
    A|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
    రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
    5 . శ్యామ్ సింఘా రాయ్(డిసెంబర్ 24 , 2021)
    UA|థ్రిల్లర్,డ్రామా,యాక్షన్
    వాసు (నాని) డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ‘ఉనికి’ పేరుతో తీసిన చిత్రం బ్లాక్‌బాస్టర్‌ అవుతుంది. అయితే కాపీ రైట్ కేసులో వాసు అరెస్టు అవుతాడు. ఆ సినిమా కథకు రచయిత శ్యామ్‌ సింగరాయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    6 . కొండ పొలం(అక్టోబర్ 08 , 2021)
    U|యాక్షన్,అడ్వెంచర్,థ్రిల్లర్
    రవీంద్రనాథ్‌ (వైష్ణవ్‌తేజ్‌) నాలుగేళ్లుగా ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు గొర్రెల్ని మేపడానికి కొండపొలానికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అడవి ఏం నేర్పింది? అతనిలో వచ్చిన మార్పేమిటి? అన్నది కథ.
    7 . సరిపోదా శనివారం(ఆగస్టు 29 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. అక్కడ అరాచకం చేస్తున్న పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? అక్కడి వారికి ఏ విధంగా అండగా నిలిచాడు? అన్నది స్టోరీ. సరిపోదా శనివారం సినిమాను రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
    8 . సలార్(డిసెంబర్ 22 , 2023)
    UA|థ్రిల్లర్,యాక్షన్
    ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.
    9 . స్పైడర్(సెప్టెంబర్ 27 , 2017)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు.
    10 . మేజర్(జూన్ 03 , 2022)
    UA|థ్రిల్లర్,యాక్షన్,బయోగ్రఫీ
    సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌) కష్టపడి ఆర్మీలో చేరతాడు. అంచెలంచెలుగా ఎదిగి NSG కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే ముంబయి తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో వారిని మట్టుబెట్టే బాధ్యత సందీప్‌ బృందంపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.

    @2021 KTree