• TFIDB EN
  • Editorial List
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    2023 ఏడాదిలో విడుదలైన చాలా సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. భారీ బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. నిర్మాతలకు పెద్దఎత్తున నష్టాలను మిగిల్చాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూసేయండి

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . హిడింబ(జూలై 20 , 2023)
    A|యాక్షన్,డ్రామా
    హైదరాబాద్‌లో మహిళలు అదృశ్యమవుతుంటారు. ఇది పోలీసులకు పెద్ద ఛాలెంజ్‌గా నిలుస్తుంది. ఈ కేసను ఛేదించే బాధ్యతను స్పేషల్ ఆఫీసర్ ఆద్య(నందిత శ్వేత)కు అప్పగిస్తారు. ఈ బృందంలో ఏసీపీ అభయ్( అశ్విన్ బాబు) భాగమవుతాడు. ఇంతకు తప్పిపోయిన మహిళలకు ఏమైంది. ఆద్య, అభయ్ కలిసి కిడ్నాప్ కేసును ఛేదించారా అనేది మిగిలిన కథ.

    అశ్విన్ బాబు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. రూ.20 కోట్లతో ఈ సినిమా తెరకెక్కగా.. రూ.10 కోట్లు మాత్రమే రాబట్టింది.

    2 . చంద్రముఖి 2(సెప్టెంబర్ 28 , 2023)
    UA|171 minutes|హాస్యం,హారర్
    రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది.

    ఈ చిత్రం రాఘవ లారెన్స్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.80 కోట్లతో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకే పరిమితమైంది.

    3 . హంట్(జనవరి 26 , 2023)
    UA|129 minutes|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడుతాడు. ప్రమాదం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ప్రమాదానికి ముందు, తన స్నేహితుడు ACP ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) హత్య కేసును దర్యాప్తు చేస్తుంటాడు. ఇంతకు ఆర్యన్ దేవ్‌ను ఎవరు చంపారు? అర్జున్ జ్ఞాపకశక్తిని తిరిగి పొందాడా? అన్నది మిగతా కథ.

    సుధీర్ బాబు లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రం రూ.16 కోట్లతో రూపొందగా.. కేవలం రూ.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్‌గా నిలిచింది.

    4 . రావణాసుర(ఏప్రిల్ 07 , 2023)
    A|140 minutes|యాక్షన్,థ్రిల్లర్
    ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో మేఘా ఆకాష్‌ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్‌ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్‌ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు? రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? అనేది సినిమా కథాంశం.

    రావణాసుర చిత్రం రూ.50 కోట్లతో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.23 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్‌గా నిలిచింది.

    5 . రుద్రంగి(జూలై 07 , 2023)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    ఈ కథ 1940 కాలానికి చెందింది. భీమ్ రావు దేశ్‌ముఖ్(జగపతి బాబు) రుద్రాంగి ప్రాంతాన్ని పాలిస్తుంటాడు. అతడు ఘోరమైన కామ వాంచ కలవాడు. భీమ్‌రావుకు ఇద్దరు భార్యలు. ఓ రోజు రుద్రంగి (గానవి లక్ష్మణ్) అనే అందమైన స్త్రీని చూస్తాడు. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఆమె గురించి ఓ విషయం తెలిసి షాకవుతాడు. ఇంతకు ఆమె గురించి భీమ్‌రావుకు తెలిసిన నిజం ఏమిటి? అనేది మిగతా కథ

    జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్‌గా నిలిచింది. రూ.12 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ.6 కోట్లు మాత్రమే రాబట్టింది.

    6 . కస్టడీ(మే 12 , 2023)
    UA|148 minutes|థ్రిల్లర్,క్రైమ్ సినిమా,యాక్షన్,క్రైమ్
    శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల‌ని అనుకుంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి)ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మ‌రోవైపు రేవ‌తికి వేరే పెళ్లి నిశ్చయించార‌ని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు తీసుకెళ్తాడు. అసలు రాజన్న ఎవరు? అతన్ని చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.

    నాగచైతన్యకు మరో ఫ్లాప్‌ను మిగిల్చింది ఈ సినిమా. ఈ చిత్రం రూ.45 కోట్లతో తెరకెక్కగా.. కేవలం రూ.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

    7 . గాంఢీవధారి అర్జున(ఆగస్టు 25 , 2023)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    లండన్‌లో అర్జున్(వరుణ్ తేజ్) ఓ ఏజెన్సీ తరఫున బాడీగార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో అక్కడ జరగుతున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు కేంద్రమంత్రి రాజ్ బహుదూర్( నాజర్) వస్తాడు. అతన్ని లండన్‌లో చంపాలని కొంతమంది కుట్రపన్నుతారు. ఈ విషయం తెలిసి అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఆ కుట్రల నుంచి రాజ్‌ బహుదూర్‌ను అర్జున్ ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.

    వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది.

    8 . ఏజెంట్(ఏప్రిల్ 28 , 2023)
    UA|156 Minutes|యాక్షన్,థ్రిల్లర్
    రిక్కీ ( అఖిల్‌ ) 'రా' ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్‌ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్‌ ప్రారంభించిన మాఫియా డాన్‌ ది గాడ్‌ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్‌. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ

    ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ.40 కోట్లు కాగా.. కేవలం రూ.14 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

    9 . ఆదిపురుష్(ఆగస్టు 11 , 2023)
    UA|179 minutes|యాక్షన్,అడ్వెంచర్,మైథలాజికల్
    ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ

    ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తెలుగులో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసినప్పటికీ... మొత్తంగా ఈ చిత్రం ప్లాప్‌గా నిలిచింది.

    10 . భోళా శంకర్(ఆగస్టు 11 , 2023)
    UA| |డ్రామా,యాక్షన్
    శంక‌ర్ (చిరంజీవి) త‌న చెల్లెలు మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేశ్‌) చ‌దువుకోసం కలకత్తాలో దిగుతాడు. అక్కడ చెల్లెల్ని కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవ‌ర్‌గా జీవితాన్ని మొద‌లుపెడ‌తాడు. ఈక్రమంలో మ‌హాల‌క్ష్మితో శ్రీక‌ర్ (సుశాంత్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. వాళ్లిద్దరికి పెళ్లి ప్రయత్నాల్లో ఉంటూనే.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠాను శంకర్ చంపుతాడు. అసలు హ్యుమన్ ట్రాఫికింగ్‌తో శంకర్‌కు ఏం సంబంధం? అనేది కథ

    110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లను మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.


    @2021 KTree