• TFIDB EN
  • Editorial List
    ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే!
    Dislike
    200+ views
    5 months ago

    టాలీవుడ్‌లో యాక్షన్‌ హీరో అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ గుర్తుకు వస్తారు. ఆరు అడుగుల ఎత్తు, సాలిడ్‌ ఫిజిక్‌తో ప్రభాస్ చేసే ఫైట్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా విడుదలైన కల్కి2898ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 11రోజుల్లో రూ. 900 కలెక్ట్ చేసి రూ. వెయ్యి కోట్ల మైలురాయిని దాటేందుకు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్-10 అత్యుత్తమ యాక్షన్‌ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . డార్లింగ్(ఏప్రిల్ 23 , 2010)
    U|153 mins|డ్రామా
    ప్రభ తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో తన చిన్ననాటి స్నేహితురాలు నందినిని కలుస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అయితే, గ్యాంగ్‌స్టర్ కుమార్తె నిషా అతనితో ప్రేమలో పడడంతో కథ మలుపు తిరుగుతుంది.

    బడ్జెట్ రూ.15 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 40కోట్లు

    2 . రెబెల్(సెప్టెంబర్ 28 , 2012)
    A|176 minutes|యాక్షన్
    రిషి తల్లిదండ్రులు దారుణ హత్యకు గురవుతారు. ఇంతకి వారిని చంపిందెవరు? రిషి తండ్రి భూపతిరాజు గతం ఏంటి? స్టీఫెన్‌ - రాబర్ట్‌ను రిషి ఎందుకు వెతుకున్నాడు? అన్నది కథ.

    బడ్జెట్- రూ. 40కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 44కోట్లు

    3 . మిస్టర్ పర్ఫెక్ట్(ఏప్రిల్ 22 , 2011)
    U|145 min|హాస్యం,రొమాన్స్
    విక్కీ తన చిన్ననాటి స్నేహితురాలి ప్రియతో జరిగిన నిశ్చితార్థాన్ని బ్రేక్‌ చేసుకుంటాడు. అచ్చం తనలాగే ఆలోచించే మరో యువతితో పెళ్లికి సిద్ధపడతాడు. అయితే ప్రియ తన కోసం ఎంతో త్యాగం చేసిందని గ్రహించిన విక్కీ ఏం చేశాడు అన్నది కథ.

    బడ్జెట్ రూ.18 కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 47కోట్లు

    4 . మిర్చి(ఫిబ్రవరి 08 , 2013)
    A|160 minutes|యాక్షన్
    ఈ సినిమా కథ జై అనే యువకుడి చూట్టూ తిరుగుతుంది. తన ఊరు, కుటుంబంతో శతృత్వం ఉన్న ఓ కుటుంబాన్ని మార్చేందుకు వారి ఇంటికి వెళ్తాడు. కానీ అతనేవరో ఆ కుటుంబానికి తెలిసిపోతుంది

    బడ్జెట్ రూ. 35కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 87కోట్లు

    5 . రాధే శ్యామ్(మార్చి 11 , 2022)
    UA|138 minutes|రొమాన్స్,డ్రామా
    విక్రమాదిత్య (ప్రభాస్‌) పేరు మోసిన జ్యోతిషుడు. ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. కానీ ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది? వారు ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? అన్నది కథ.

    బడ్జెట్ రూ. 300 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 152కోట్లు

    6 . ఆదిపురుష్(ఆగస్టు 11 , 2023)
    UA|179 minutes|యాక్షన్,అడ్వెంచర్,మైథలాజికల్
    ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ

    వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.395కోట్లు బడ్జెట్ రూ.395 కోట్లు

    7 . సాహో(ఆగస్టు 30 , 2019)
    UA|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
    వాజీ అనే నగరం కేంద్రంగా గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలను సిండికేట్‌గా రాయ్( జాకీ ష్రాప్) నిర్వహిస్తుంటాడు. అండర్‌వరల్డ్‌ను చేజిక్కించుకోవాలని దేవరాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అతని కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ

    వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.442 కోట్లు బడ్జెట్ రూ.350కోట్లు

    8 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
    UA|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.

    వరల్డ్‌ వైడ్ గ్రాస్ రూ.600కోట్లు బడ్జెట్ రూ.118 కోట్లు

    9 . సలార్(డిసెంబర్ 22 , 2023)
    UA|177 minutes|థ్రిల్లర్,యాక్షన్
    ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.

    వరల్డ్ వైడ్ గ్రాస్: రూ.715 కోట్లు బడ్జెట్ : రూ.270 కోట్లు

    10 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
    UA|171 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.

    వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.1814 కోట్లు బడ్జెట్: రూ. 821కోట్లు


    @2021 KTree