• TFIDB EN
  • Editorial List
    2023 టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 చిత్రాలు
    Dislike
    2k+ views
    9 months ago

    2023 ఏడాది టాలీవుడ్‌లో మంచి విజయాలు నమోదయ్యాయి. పెద్ద హీరోల సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. మరో నెలలో 2023 ఏడాది ముగియనుంది. ఈనేపథ్యంలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాలను ఓసారి చూసేద్దామా..!

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఖుషి(సెప్టెంబర్ 01 , 2023)
    UA|165 minutes|రొమాన్స్,డ్రామా,హాస్యం
    సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.

    సమంత- విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.76 కోట్లు సాధించగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 కోట్లు రాబట్టింది.

    2 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
    A|146 minutes|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
    రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.

    సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో రూ.63 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా.. రూ.89 కోట్లు కొల్లగొట్టింది.

    3 . బేబీ(జూలై 14 , 2023)
    UA|177 minutes|డ్రామా,రొమాన్స్
    ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌తో ఇష్టం లేకున్నా శారీరకంగా ఒకటవ్వాల్సి వస్తుంది. ఆనంద్‌ను వైష్ణవి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? చివరకు ఆనంద్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.

    ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నమోదైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.81 కోట్లు.. తెలుగులో రూ.64 కోట్లు వసూలు చేసింది.

    4 . జైలర్(ఆగస్టు 10 , 2023)
    UA|థ్రిల్లర్,యాక్షన్
    ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ లభించింది. టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.68 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కొల్లగొట్టింది.

    5 . దసరా(మార్చి 30 , 2023)
    UA|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
    ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

    దసరా మూవీ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.118 కోట్లు రాబట్టగా.. తెలుగులో రూ.75 కోట్లు రాబట్టింది.

    6 . బ్రో(జూలై 28 , 2023)
    UA|హాస్యం,డ్రామా
    మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథ

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన 'బ్రో' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు కలెక్ట్ చేసి.. ఈ ఏడాది ఐదో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.82 కోట్లు కొల్లగొట్టింది.

    7 . భగవంత్ కేసరి(అక్టోబర్ 19 , 2023)
    UA|యాక్షన్,డ్రామా
    కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఏం చేశాడు? ఆమెను స్ట్రాంగ్‌ చేసేందుకు ఏలాంటి పనులు చేశాడన్నది మిగతా కథ

    ఈ ఏడాది భగవంత్ కేసరి చిత్రం ద్వారా వరుసగా రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.119 కోట్లు కొల్లగొట్టింది. తెలుగులో దాదాపు రూ.85 కోట్లు రాబట్టింది.

    8 . వీర సింహా రెడ్డి(జనవరి 12 , 2023)
    UA|172 minutes|యాక్షన్,డ్రామా
    వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ ప్రజలకు దేవుడు. ఆయనకు సవతి తల్లి కూతురు భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైన త్యాగం చేస్తాడు. కానీ భానుమతి బాలయ్య చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు జూ. బాలయ్య విదేశాల్లో తన తల్లితో ఉంటాడు. అసలు వీరసింహారెడ్డి తన కుటుంబానికి ఎందుకు దూరమవుతాడు? ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఎందుకు చంపాలనుకుంటుంది అనేది కథ

    నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి బడ్జెట్ దాదాపు.. రూ.110 కోట్లు కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.133.82 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టింది.

    9 . ఆదిపురుష్(ఆగస్టు 11 , 2023)
    UA|179 minutes|యాక్షన్,అడ్వెంచర్,మైథలాజికల్
    ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ

    తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మేనియా మరోసారి నిరూపితమైంది. ఆదిపురుష్ వసూళ్లు ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రూ.100 కోట్ల మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ చిత్రం రూ.133.6 కోట్లు వసూలు చేసింది.

    10 . వాల్తేరు వీరయ్య(జనవరి 13 , 2023)
    UA|160 minutes|యాక్షన్,డ్రామా
    వాల్తేరు వీరయ్య( చిరంజీవి) జాలరి పేటలో ప్రజలకు దేవుడు. ఆయన మాటకు తిరుగులేదు. సముద్రపు ఒడ్డున చిరంజీవికి తెలియకుండా కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తుంటారు. వారిని ఏసీపీ విక్రమ్( రవితేజ) అరెస్ట్ చేస్తాడు. అడ్డుపడిన చిరంజీవిని కూడా లాకప్‌లో వేస్తాడు. చిరంజీవి జైళ్లో ఉన్న సమయంలో అనుకోని విషాదం ఎదురవుతుంది. ఆ విషాధానికి కారణం ప్రకాశ్ రాజ్‌ అని తెలుసుకుని పోలీస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి మలేషియా వెళ్తాడు. ఆ విషాదం ఏమిటి అనేది కథ

    2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 159.68 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 219 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది నెంబర్ 1 చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాకైన బడ్జెట్ రూ.140కోట్లు.


    @2021 KTree