• TFIDB EN
  • Editorial List
    అల్లరి నరేష్ కెరీర్‌లో టాప్ 10 హిట్ చిత్రాలు
    Dislike
    300+ views
    9 months ago

    తెలుగులో రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హీరో అల్లరి నరేష్. డైరెక్టర్ ఈవీవీ కుమారుడైనప్పటికీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే యాభైకి పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో అల్లరి నరేష్ నటించిన టాప్ 10 బెస్ట్ చిత్రాలను ఇప్పుడు చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . నాంది(ఫిబ్రవరి 19 , 2021)
    UA|146 minutes|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    సూర్యప్రకాశ్‌ (అల్లరి నరేశ్‌) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. హత్య చేశాడనే ఆరోపణలతో అతడ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీంతో ఐదేళ్లు జైలులోనే అతడు మగ్గుతాడు. ఇంతకీ ఆ హత్యను ఎవరు చేశారు? లాయర్‌ ఆద్య (వరలక్ష్మీ) అసలు నిందితులను ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది కథ.

    అప్పటివరకు కామెడీ జనర్‌లో సినిమాలు తీసిన అల్లరి నరేష్.. ఈ చిత్రంతో తన రూట్‌ మార్చుకుని యాక్షన్ సినిమాల వైపు మారాడు. ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.

    2 . సుడిగాడు(ఆగస్టు 24 , 2012)
    UA|హాస్యం
    శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
    3 . సీమ టపాకాయ్(మే 13 , 2011)
    U|128 min|డ్రామా
    కోటీశ్వరుడైన కృష్ణ.. సత్య ప్రేమలో పడతాడు. ఆమెకు డబ్బున్న వారిపై ద్వేషం ఉండటంతో పేదవాడిగా సత్యకు దగ్గరవుతాడు. సత్యను ఇంప్రెస్‌ చేయడం కోసం కృష్ణ ఏం చేశాడు? అన్నది కథ.
    4 . కత్తి కాంతారావు(డిసెంబర్ 10 , 2010)
    UA|హాస్యం,డ్రామా
    కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
    5 . బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్(ఏప్రిల్ 18 , 2008)
    UA|హాస్యం
    దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
    6 . బ్లేడు బాబ్జీ(అక్టోబర్ 24 , 2008)
    U|150 minutes|హాస్యం
    తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
    7 . సీమా శాస్త్రి(నవంబర్ 16 , 2007)
    U|హాస్యం
    సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
    8 . అల్లరి(మే 10 , 2002)
    UA|డ్రామా,రొమాన్స్
    రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది.

    తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్న నరేష్.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

    9 . కితకితలు(మే 05 , 2006)
    U|హాస్యం
    పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన రాజాబాబు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. అయితే రాజాబాబు తల్లిదండ్రులు అతని ఇష్టానికి వ్యతిరేకంగా.. ఓ లావున్న అమ్మాయితో వివాహం చేస్తారు. వారి హనీమూన్ ట్రిప్‌లో రాజాబాబుకు రంభ అనే అందమైన యువతితో పరిచయమవుతుంది.

    @2021 KTree