• TFIDB EN
  • ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో తప్పక చూడాల్సిన టాప్ 10 యాక్షన్ చిత్రాలు
    Dislike
    2 Likes 3k+ views
    6 months ago

    తెలుగు OTT ప్లాట్‌ఫాం 'ఆహా'లో 2020-2023 వరకు వచ్చిన యాక్షన్ చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన టాప్ 10 సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో క్రాక్, సరిలేరు నీకెవ్వరూ, భీమ్లానాయక్ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. మీ మనసుకు నచ్చిన మీకు ఆనందాన్ని పంచే చిత్రాన్ని ఎంచుకుని చూసి యాక్షన్‌ మోడ్‌ను ఆస్వాదించండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . క్రాక్(జనవరి 09 , 2021)
    U/A|యాక్షన్,థ్రిల్లర్
    హీరో నిక్కచ్చిగా ఉండే పోలీసాఫీసర్‌. సీఐగా ఒంగోలుకి వెళ్లాక అక్కడ ముఠా నాయకుడు కఠారి కృష్ణ(సముద్రఖని)తో వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ హత్యకు గురవుతాడు. ఆ హత్యతో కఠారీ కృష్ణకు సంబంధం ఏంటి? ఈ కేసును వీరశంకర్‌ (రవితేజ) ఎలా ఛేదించాడు? అన్నది కథ.
    2 . సర్కారు వారి పాట(మే 12 , 2022)
    U/A|యాక్షన్,డ్రామా
    అమెరికాలో ఫైనాన్స్ వ్యాపారం చేసే మహేశ్‌ దగ్గర కళావతి (కీర్తి సురేష్‌) అబద్దాలు చెప్పి డబ్బు అప్పు తీసుకుంటుంది. డబ్బు ఇవ్వనని చెప్పడంతో వైజాగ్‌లో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్‌ (సముద్రఖని) దగ్గరకు మహేశ్ వెళ్తాడు. రూ.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఇంతకీ ఆ రూ.10 వేల కోట్ల కథేమిటి? ఇంతకీ మహేశ్ గతం ఏమిటి? అనేది కథ.
    3 . సరిలేరు నీకెవ్వరు(జనవరి 11 , 2020)
    U/A|యాక్షన్,డ్రామా
    అజయ్( మహేష్ బాబు) పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఓ పని నిమిత్తం కర్నూలుకు బయల్దేరుతాడు. మరోవైపు భారతి( విజయశాంతి) కర్నూలులో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో భారతికి స్థానిక మంత్రి ప్రకాశ్ రాజ్‌ వల్ల సమస్య ఎదురవుతుంది. ఇదే సమయంలో కర్నూలుకు వచ్చిన అజయ్ భారతికి ఎలాంటి సాయం చేస్తాడు. అసలు భారతికి అజయ్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగతా కథ
    4 . భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 , 2022)
    U/A|యాక్షన్,డ్రామా
    బీమ్లా నాయక్‌ (పవన్‌ కల్యాణ్‌) నిజాయతీ గల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. రాజకీయ పలుకుపడి ఉన్న డానియల్ శేఖర్‌ (రానా) కారులో మద్యం సీసాలతో వెళ్తూ పోలీసులకు చిక్కుతాడు. బీమ్లా నాయక్‌ డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతని అహం దెబ్బ తింటుంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడన్నది కథ.
    5 . వకీల్ సాబ్(ఏప్రిల్ 09 , 2021)
    U/A|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
    ప‌ల్ల‌వి (నివేదా థామ‌స్‌), జ‌రీనా (అంజ‌లి), దివ్య నాయక్ (అన‌న్య నాగ‌ళ్ల‌) ఓ ఇంట్లో అద్దెకుంటారు. ఓ రోజు ఎంపీ కొడుకు పల్లవిపై లైంగిక దాడి చేయబోగా ఆమె తప్పించుకొని ఇంటికి వస్తుంది. ఆ త‌ర్వాత ప‌ల్ల‌విపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదవుతుంది. దీంతో అమాయ‌కులైన ముగ్గుర‌మ్మాయిలు క‌ష్టాల్లో ప‌డ‌తారు. ఆ సంద‌ర్భంలో వకీల్‌సాబ్ (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) వారికి ఎలా అండగా నిలబడ్డాడు? కోర్టులో ప‌ల్ల‌వి కేసుని ఎలా గెలిపించాడు? అన్నది కథ.
    6 . నాంది(ఫిబ్రవరి 19 , 2021)
    U/A|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    సూర్యప్రకాశ్‌ (అల్లరి నరేశ్‌) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. హత్య చేశాడనే ఆరోపణలతో అతడ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీంతో ఐదేళ్లు జైలులోనే అతడు మగ్గుతాడు. ఇంతకీ ఆ హత్యను ఎవరు చేశారు? లాయర్‌ ఆద్య (వరలక్ష్మీ) అసలు నిందితులను ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది కథ.

    @2021 KTree