• TFIDB EN
  • Editorial List
    Prabhas Top Action Movies: ప్రభాస్‌ విశ్వరూపం చూపించిన టాప్‌-10 యాక్షన్‌ చిత్రాలు
    Dislike
    3k+ views
    6 months ago

    టాలీవుడ్‌లో యాక్షన్‌ హీరో అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ గుర్తుకు వస్తారు. ఆరు అడుగుల ఎత్తు, సాలిడ్‌ ఫిజిక్‌తో ప్రభాస్ చేసే ఫైట్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ తన కెరీర్‌లో పలు యాక్షన్‌ చిత్రాల్లో నటించారు. అగ్రెసివ్‌ లుక్‌, వీరోచిత ఫైటింగ్స్‌తో అందులో అదరగొట్టాడు. వాటి ద్వారా మాస్‌ అడియన్స్‌కు మరింత చేరువ అయ్యారు. ప్రభాస్‌ ఇప్పటివరకూ చేసిన టాప్-10 అత్యుత్తమ యాక్షన్‌ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
    U/A|171 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 చిత్రంలో ప్రభాస్ విశ్వరూపం చూపించాడు. యుద్ద సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో తనకి సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇందులో ప్రభాస్‌ నటన మూవీకే హైలెట్‌ అని చెప్పవచ్చు. విలన్‌గా రానా ప్రభాస్‌కు చక్కటి సహకారం అందించాడు.

    2 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
    U/A|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.
    3 . ఛత్రపతి(సెప్టెంబర్ 29 , 2005)
    U/A|165 minutes|డ్రామా
    శివాజీ అతడి కుటుంబం ఓ కారణం చేత శ్రీలంక నుంచి విశాఖకు వలస వస్తారు. అక్కడ తమను బానిసలుగా చూస్తున్న బాజీరావు అనే రౌడీకి శివాజీ ఎదురు తిరుగుతాడు. తన వారికి అండగా నిలిచి లీడర్‌గా ఎదుగుతాడు.
    4 . మిర్చి(ఫిబ్రవరి 08 , 2013)
    A|160 minutes|యాక్షన్
    ఈ సినిమా కథ జై అనే యువకుడి చూట్టూ తిరుగుతుంది. తన ఊరు, కుటుంబంతో శతృత్వం ఉన్న ఓ కుటుంబాన్ని మార్చేందుకు వారి ఇంటికి వెళ్తాడు. కానీ అతనేవరో ఆ కుటుంబానికి తెలిసిపోతుంది

    టాలీవుడ్‌ దర్శకుడు కొరటాల శివ.. క్లాస్‌, మాస్‌ అంశాలను మేళవించి ‘మిర్చి’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ‌అంతేగాక యాక్షన్‌ సీన్స్‌లో తన మార్క్‌ చూపిస్తూ రెచ్చిపోయాడు. ఈ చిత్రంలో రిచా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్‌, నదియా, ఆదిత్య, రాఘుబాబు, సంపత్‌ నంది కీలక పాత్రలు పోషించారు.

    5 . బుజ్జిగాడు(మే 22 , 2008)
    U/A|146 minutes|యాక్షన్,డ్రామా
    బుజ్జి రజనీకాంత్‌ ఫ్యాన్‌. చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండే చిట్టితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. 12 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన బుజ్జి.. చిట్టిని వెత్తుకుంటూ వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.

    పూరి జగన్నాథ్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘బుజ్జిగాడు’. ఈ సినిమాలో ప్రభాస్‌ నిఖార్సయిన మాస్‌ హీరోగా కనిపించాడు. ఈ మూవీలో ప్రభాస్‌ యాస, భాష, బాడీ లాంగ్వేజ్ మాస్‌ ఆడియన్స్‌ను మరింత దగ్గర చేసింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా త్రిష నటించగా.. మోహన్‌బాబు, సంజన, సుబ్బరాజు, అజయ్, కోట శ్రీనివాసరావు, ఆలీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

    6 . బిల్లా(ఏప్రిల్ 03 , 2009)
    A|154 minutes|యాక్షన్,థ్రిల్లర్
    అంతర్జాతీయ నేరస్థుడు బిల్లాలాగే చిల్లర దొంగ రంగా ఉంటాడు. అతన్ని చూసిన ఏసీపీ కృష్ణ మూర్తి చనిపోయిన బిల్లా స్థానంలో రంగాను పంపించి మాఫియా రహస్యాలను కనుగొనాలని నిర్ణయించుకుంటాడు.
    7 . మున్నా(ఏప్రిల్ 26 , 2007)
    U/A|174 minutes|యాక్షన్
    కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు.
    8 . ఏక్ నిరంజన్(అక్టోబర్ 29 , 2009)
    U/A|155 minutes|యాక్షన్,డ్రామా
    రోడ్లపై పిల్లల్ని అడుక్కునే రాకెట్‌ను నడిపే వ్యక్తి చిన్నతనంలో చోటును కిడ్నాప్ చేస్తాడు. అయితే, అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులకు చోటు సహాయం చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబం కోసం వెతుకుతాడు.
    9 . రెబెల్(సెప్టెంబర్ 28 , 2012)
    A|176 minutes|యాక్షన్
    రిషి తల్లిదండ్రులు దారుణ హత్యకు గురవుతారు. ఇంతకి వారిని చంపిందెవరు? రిషి తండ్రి భూపతిరాజు గతం ఏంటి? స్టీఫెన్‌ - రాబర్ట్‌ను రిషి ఎందుకు వెతుకున్నాడు? అన్నది కథ.

    ప్రభాస్‌ హీరోగా, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రెబల్‌’. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌లో తన ఉగ్రరూపం చూపించారు. ముఖ్యంగా హిజ్రా వేషదారణ వచ్చిన విలన్లతో ప్రభాస్‌ చేసే ఫైటింగ్‌ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రభాస్‌కు జంటగా తమన్నా నటించింది. ఇందులో దీక్షా సేథ్‌, తమన్నా హీరోయిన్లుగా నటించారు. కృష్ణం రాజు, ముకేష్ రిషి, ప్రదీప్‌ రావత్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.

    10 . సాహో(ఆగస్టు 30 , 2019)
    U/A|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
    వాజీ అనే నగరం కేంద్రంగా గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలను సిండికేట్‌గా రాయ్( జాకీ ష్రాప్) నిర్వహిస్తుంటాడు. అండర్‌వరల్డ్‌ను చేజిక్కించుకోవాలని దేవరాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అతని కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ

    @2021 KTree