• TFIDB EN
  • ETV విన్‌లో టాప్ 10 యాక్షన్ చిత్రాలు ఇవే!
    Dislike
    2k+ views
    6 months ago

    ETV విన్ యాప్‌లో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 10 యాక్షన్ చిత్రాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో సమరసింహారెడ్డి, అసెంబ్లీ రౌడి వంటి మాస్ చిత్రాలున్నాయి. యాక్షన్ చిత్రాల్లో లభించే యాక్షన్ మజాను ఇప్పుడే ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
    2 . దొంగ రాముడు(ఫిబ్రవరి 18 , 1988)
    U|యాక్షన్
    పెద్ద ఎస్టేట్ వారసుడైన రామకృష్ణ తన దేశానికి తిరిగి వచ్చినప్పుడు, తన ఎస్టేట్ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం చూస్తాడు. తన ఎస్టేట్‌ను తిరిగి పొందాలని నిర్ణయించుకుంటాడు కానీ అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు.
    3 . సమరసింహా రెడ్డి(జనవరి 13 , 1999)
    U/A|యాక్షన్,డ్రామా
    సమరసింహారెడ్డి తన కుటుంబ హత్యకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అనుకోకుండా వాసు అనే అమాయకుడిని చంపేస్తాడు. ఓ అబద్దంతో వాసు కుటుంబానికి దగ్గరై వారిని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
    4 . యుగంధర్(నవంబర్ 30 , 1979)
    U|యాక్షన్,డ్రామా
    క్రూరమైన డాన్‌ యుగంధర్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. అతడి ముఠాను పట్టుకోవడం కోసం అచ్చం యుగంధర్‌లా ఉండే మరో వ్యక్తిని పోలీసు అధికారి జగన్నాథ్ రంగంలోకి దింపుతాడు.
    5 . ఆలయ శిఖరం(మే 07 , 1983)
    U|యాక్షన్,డ్రామా
    శీను కుటుంబం అతనిపైనే ఆధారపడి జీవిస్తోంది. అతని అన్నయ్య శేఖర్ చదువు పూర్తయ్యాక మంచి రోజులు వస్తాయని ఆ కుటుంబం ఆశిస్తోంది. అయితే శీను మరిన్ని బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
    6 . అసెంబ్లీ రౌడీ(జూన్ 03 , 1991)
    U/A|యాక్షన్,డ్రామా
    తప్పుడు హత్య కేసులో శివాజీ అరెస్ట్‌ అవుతాడు. ఆ కేసు విచారణలో ఉండగా శివాజీ ఎన్నికల్లో పోరాడి గెలుస్తాడు. అతను రాజకీయాల్లో ఉన్న అవినీతిని బయటకు తీసి ప్రజల తరఫున పోరాడుతాడు.
    7 . నెంబర్ వన్(జనవరి 14 , 1994)
    U|యాక్షన్,డ్రామా
    కృష్ణ తన చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుంటాడు. తన చెల్లెలు, సోదరుడిని పెంచాల్సి వస్తుంది. అయితే సౌందర్యను కలవడంతో అతని జీవితం మారిపోతుంది.
    8 . రుస్తుం(డిసెంబర్ 02 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    హరి తన తోటి గ్రామస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటాడు. భూస్వామి గంగా రాయుడు ఊరి ప్రజలకు ముప్పు తలపెట్టేందుకు యత్నించగా హరి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు.
    9 . గూడాచారి 116(ఆగస్టు 11 , 1966)
    U|యాక్షన్,థ్రిల్లర్
    అంతర్జాతీయ క్రిమినల్ ముఠాకు వ్యతిరేకంగా ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించిన తర్వాత సీక్రెట్ ఏజెంట్ 303 హత్యకు గురవుతాడు. దీంతో ఏజెంట్ 116 తన సహోద్యోగి హత్య గురించి నిజాన్ని వెలికితీసే లక్ష్యంతో బయలుదేరాడు.
    10 . ఏజెంట్ విక్రమ్ (మే 29 , 1986)
    U/A|యాక్షన్,అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న విక్రమ్ అనే పోలీసు అధికారికి దేశ రక్షణలో భాగమైన క్షిపణిని తిరిగి కనిపెట్టే బాధ్యతను ప్రభుత్వం అప్పగిస్తుంది. ఈ మిషన్‌లో ఇంజనీర్ ప్రీతి అతనికి సహాయం చేస్తుంది.

    @2021 KTree