• TFIDB EN
  • Editorial List
    తెలుగులో టాప్ 10 లవ్ బ్రేకప్ సినిమాలు
    Dislike
    3k+ views
    10 months ago

    లవ్‌లో ఫెయిల్ అయినంత మాత్రన లైఫ్‌ లేదనుకుంటే పొరపాటు. అలా అయితే 25 ఏళ్ల తర్వాత ఎవరు బ్రతికి ఉండరు. లవ్‌లో ఫెయిల్ అయినా మనల్ని ఇష్టపడే వారితో లైఫ్‌ను ఎంజాయ్ చేయవచ్చు అని కొన్ని సినిమాలు చూపించాయి. ఆ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అర్జున్ రెడ్డి(ఆగస్టు 25 , 2017)
    A|182 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
    2 . సూర్య S/O కృష్ణన్(నవంబర్ 14 , 2008)
    U|169 minutes|డ్రామా,రొమాన్స్
    సూర్య సైన్యాధికారి. మరణానికి దగ్గరైన తండ్రిని చూసేందుకు ఇంటికి వస్తాడు. తండ్రిని చూడగానే ఆయనతో ఉన్న మధురమైన జ్ఞాపకాలు ఒక్కసారిగా సూర్య కళ్లముందుకు వస్తాయి. యవ్వనంలో తన లవ్‌ స్టోరీ కూడా గుర్తుకు వస్తుంది. ఆ జ్ఞాపకాలు ఏంటి? అన్నది కథ.

    లవ్‌లో పడితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుది, ప్రేమలో విఫలమైతే ఎలాంటి బాధ ఉంటుంది, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో ఈ సినిమా భావోద్వేగాల పరంగా అద్భుతంగా చూపించింది.

    3 . మళ్ళీ రావా(డిసెంబర్ 08 , 2017)
    U|124 minutes|డ్రామా,రొమాన్స్
    "మళ్ళీ రావా" అనే సినిమా కథ.. కార్తిక్, అంజలి జీవితాలను మూడు దశలలో - బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాలను చూపిస్తుంది. ఈ దశల్లో వారి ప్రేమకథ, అనుబంధాలు ఎలా సాగాయన్నది కథ.

    చైల్డ్‌ లైఫ్‌లో ఉండే క్రష్ గురించి ఈ సినిమా అద్భుతమై డ్రామాతో చూపిస్తుంది.

    4 . సమ్మోహనం(జూన్ 15 , 2018)
    U|144 minutes|డ్రామా,రొమాన్స్
    విజ్జు (సుధీర్‌బాబు) ఇంట్లో సినిమా షూటింగ్‌ జరుగుతుంది. అందులో హీరోయిన్‌గా నటించే సమీరా (అదితిరావు హైదరీ)ను విజ్జు ప్రేమిస్తాడు. ఈ విషయం ఆమెకు చెప్పగా తిరస్కరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సమీరా, విజ్జు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ.
    5 . రాజా రాణి(సెప్టెంబర్ 27 , 2013)
    U|164 minutes|డ్రామా,రొమాన్స్
    ఒకరినొకరు ఇష్టపడని జాన్, రెజీనా బలవంతంగా పెళ్లి చేసుకుని కష్టతరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. అయితే గతంలో వీరిద్దరికి బాధకరమైన లవ్‌ స్టోరీలు ఉంటాయి. ఆ ప్రేమకథలు ఏంటి? చివరికి జాన్‌-రెజినా కలిశారా లేదా? అన్నది కథ.

    ప్రేమలో విఫలమైనంత మాత్రాన మన లైఫ్ ఇండ్ కాదు. మనల్ని ఇష్టపడే వారికోసం బతకవచ్చు అని చూపించిన సినిమా

    6 . ఏ మాయ చేసావే(ఫిబ్రవరి 26 , 2010)
    UA|162 minutes|డ్రామా,రొమాన్స్
    ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమలో విరహం కలిగించే బాధ వంటి అంశాలను అందంగా చూపిస్తుంది

    7 . లవ్ ఫెయిల్యూర్(ఫిబ్రవరి 17 , 2012)
    U|హాస్యం,రొమాన్స్
    అరుణ్, పార్వతి కాలేజీలో ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి పేరెంట్స్ లవ్ స్టోరీ ఈ యువ జంటలో మార్పు తెస్తుంది. ఇంతకీ ఏంటా ప్రేమకథ? అరణ్‌, పార్వతిలో వచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
    8 . నిన్ను కోరి(జూలై 07 , 2017)
    U|137 minutes|డ్రామా,రొమాన్స్
    పల్లవి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉమను తన భర్తతో కలిసి తన ఇంట్లో ఉండమని ఆహ్వానిస్తుంది. పల్లవిని తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉమ వారి కాపురంలో కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు.

    మనం ప్రేమించిన వాళ్ల నుంచి విడిపోయినా.. వాళ్లు ఎక్కడున్న క్షేమంగా ఉండాలని నిజమైన లవర్ కోరుకుంటాడని ఈ చిత్రం అంతర్థానంగా చెబుతుంది.

    9 . మజిలీ(ఏప్రిల్ 05 , 2019)
    UA|154 minutes|డ్రామా,రొమాన్స్
    క్రికెటర్ కావాలనే బలమైన కోరిక ఉన్న పూర్ణ.. అన్షును ప్రేమిస్తాడు. కానీ ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత బలవంతంగా శ్రావణితో పూర్ణకు పెళ్లి అవుతుంది.

    ప్రేమలో విఫలమైనంత మాత్రాన మన లైఫ్ ఇండ్ కాదు. మనల్ని ఇష్టపడే వారికోసం బతకవచ్చు అని చూపించిన సినిమా

    10 . మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(ఫిబ్రవరి 06 , 2015)
    U|144 minutes|డ్రామా,రొమాన్స్
    రాజారాం (శర్వానంద్) నేషనల్ లెవల్‌ రన్నింగ్ కాంపిటీషన్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. అదే టైములో ముస్లిం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. అనుకోని కారణం చేత వారిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తిరిగి వారు కలిశారా లేదా? అన్నది స్టోరీ.

    ప్రేమ అంటే ఏమిటో కరెక్ట్ నిర్వచనం ఇచ్చిన సినిమా ఇది. ఒక అమ్మాయి అబ్బాయి సిన్సియర్‌గా ప్రేమించుకుంటే ఊపిరి ఉన్నంత వరకు వారి ప్రేమ అలాగే ఉంటుందని నిరూపించింది ఈ సినిమా.


    @2021 KTree