• TFIDB EN
  • Editorial List
    Best Movies Of Gopichand: గోపిచంద్‌ నటించిన టాప్‌-10 బెస్ట్‌ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    టాలీవుడ్‌లోని టాలెంటెడ్‌ హీరోల్లో గోపిచంద్‌ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో విలన్‌ పాత్రలు పోషించిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆపై హీరోగా స్థిరపడి పలు సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఎక్కువగా యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో నటించిన గోపిచంద్‌ ఒకేసారి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. గోపిచంద్‌ నటించిన చిత్రాల్లో టాప్-10 మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సీటీమార్(సెప్టెంబర్ 10 , 2021)
    UA|138 minutes|డ్రామా,క్రీడలు
    కార్తీక్‌ (గోపీచంద్‌) మహిళల కబడ్డీ జట్టు కోచ్‌. తాను తీర్చిదిద్దిన జట్టును జాతీయ స్థాయిలో గెలిపించి ఊరిలోని స్కూల్‌ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో కార్తీక్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది కథ.
    2 . శౌర్యం (సెప్టెంబర్ 25 , 2008)
    UA|159 minutes|యాక్షన్,డ్రామా
    పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌కు చెల్లెలు దివ్య అంటే ప్రాణం. ఓ చిన్న ఆపార్థం వల్ల విజయ్‌ను వదిలి ఆమె దూరంగా వెళ్లిపోతుంది. లోకల్‌ డాన్‌ శివరామ్‌.. విజయ్‌పై కోపంతో దివ్యాను చంపాలనుకుంటాడు. దీంతో ఇద్దరూ ఆమె కోసం గాలిస్తుంటారు. దివ్య ఎవరికి దొరికింది? అన్నది కథ.
    3 . జిల్(మార్చి 27 , 2015)
    A|130 min|యాక్షన్,డ్రామా
    జై అనే సిన్సియర్ ఫైర్ ఆఫీసర్ తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అతను సావిత్రితో ప్రేమలో పడతాడు. ఆమెతో హాయిగా గడుపుతున్న క్రమంలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ మధ్య ఓ విషయంలో గొడవ జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన చిన్న మనస్పర్థలు పెద్ద యుద్ధానికి దారితీస్తుంది.
    4 . లక్ష్యం(జూలై 05 , 2007)
    UA|164 minutes|డ్రామా
    కరుడుగట్టిన నేరస్థుడైన సెక్షన్ శంకర్, బ్యాంకు ఉద్యోగి హత్యలో ACP బోస్‌ను ఇరికిస్తాడు. బోస్ సోదరుడైన చందు తన అన్నను రక్షించి, శంకర్‌ను ఎదుర్కొవాలని నిర్ణయించుకుంటాడు.
    5 . లౌక్యం(సెప్టెంబర్ 26 , 2014)
    UA|149 minutes|హాస్యం,డ్రామా
    హీరో తన ఫ్రెండ్‌ కోసం విలన్‌ చెల్లెల్ని కిడ్నాప్‌ చేసి వారికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత విలన్‌ నుంచి తప్పించుకొని నగరానికి వచ్చిన హీరో అక్కడ తొలిచూపులోనే హీరోయిన్‌ను ప్రేమిస్తారు. తీరా ఆమె విలన్‌ రెండో చెల్లెలు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    6 . రణం(ఫిబ్రవరి 10 , 2006)
    UA|145 minutes|యాక్షన్
    చిన్నా ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్తాడు, అక్కడ భగవతి అనే రౌడీతో గొడవ పడుతాడు. భగవతి సోదరి మహేశ్వరితో ప్రేమలో పడినప్పుడు అతను ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు.
    7 . వర్షం(జనవరి 14 , 2004)
    U|159 minutes|యాక్షన్,రొమాన్స్
    వెంకట్, శైలజ రైలులో కలుసుకుని ప్రేమలో పడతారు. కానీ శైలజ తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. ఆమెను ఇష్టపడ్డ భద్రన్న అనే పెద్ద రౌడీతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.

    ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో గోపిచంద్‌ విలన్‌ పాత్ర పోషించారు. తన అద్భుతమైన నటనతో సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో గోపిచంద్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. శోభన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష చేసింది. ప్రకాష్‌రాజ్‌, సునీల్‌, చంద్రమోహన్‌, జయప్రకాష్‌ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు.

    8 . గోలీమార్(మే 27 , 2010)
    A|145 minutes|యాక్షన్
    గంగారాం పోలీస్ ఉద్యోగంలో చేరడానికి చాలా కష్టపడుతాడు. చివరికి జాబ్ సంపాదించి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎదుగుతాడు. అతను పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్లను చంపుతున్న క్రమంలో ఇద్దరు క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌లు అతని ఉద్యోగం పోయేలా చేస్తారు. మరి గంగారాం ఆ గ్యాంగ్‌స్టర్లను ఎలా ఎదుర్కొన్నాడు. తిరిగి తన ఉద్యోగాన్ని ఎలా పొందాడు అన్నది స్టోరీ. గోలీమార్ చిత్రం గోపిచంద్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల లాభం సాధించింది.
    9 . జయం(జూన్ 14 , 2002)
    UA|152 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    కాలేజీలో చదువుకునే ఓ యువ జంట ప్రేమలో పడుతుంది. అయితే యువతి తల్లిదండ్రులు వారి బంధువుల అబ్బాయికి ఇచ్చి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. మరి వారి ప్రేమ గెలుస్తుందా?
    10 . సాహసం(జూలై 12 , 2013)
    UA|160 minutes|యాక్షన్,అడ్వెంచర్
    తాత రాసిన వీలునామా దొరుకుతుంది. అందులో వారసుల కోసం వజ్రాలు దాచినట్లు ఉంటుంది. దీంతో వజ్రాలు వెతుక్కుంటూ హీరో పాకిస్తాన్‌ వెళ్తాడు. వజ్రాల నిధి కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నది కథ.

    గోపిచంద్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సాహసం. 2013లో విడుదలైన ఈ చిత్రం గోపిచంద్‌ తీసిన బెస్ట్‌ సినిమాల్లో టాప్‌-3లో కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా నిధి అన్వేషణ చుట్టూ తిరుగుతుంది. ఇందులో గోపిచంద్‌కు జోడీగా తాప్సీ నటించింది. శక్తికపూర్‌, అలీ, సుమన్‌ కీలకపాత్రలు పోషించారు. కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి సంగీతం అందించారు.


    @2021 KTree