• TFIDB EN
  • Editorial List
    10 Best Movies of Naga Chaitanya: నాగచైతన్య హీరోగా చేసిన టాప్‌-10 చిత్రాలు
    Dislike
    2k+ views
    6 months ago

    అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జోష్‌’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చైతు.. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా లవర్‌ బాయ్‌ ట్యాగ్‌ సొంతం చేసుకున్నాడు. ఆపై పలు యాక్షన్‌ సినిమాల్లో సైతం నటించి మాస్‌ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రతీ సినిమాకు నటుడిగా ఎంతో మెరుగవుతూ స్టార్‌ హీరోగా ఎదుగుతున్నాడు. చైతు ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో టాప్‌-10 మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మనం(మే 23 , 2014)
    U/A|163 minutes|డ్రామా,ఫ్యామిలీ
    పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
    2 . ఏ మాయ చేసావే(ఫిబ్రవరి 26 , 2010)
    U/A|162 minutes|డ్రామా,రొమాన్స్
    ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.
    3 . 100 % లవ్‌(మే 06 , 2011)
    U|140 minutes|డ్రామా,రొమాన్స్
    బాలు, మహాలక్ష్మీ బావ మరదళ్లు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఈగో వల్ల బహిర్గతం చేసుకోరు. ఈ క్రమంలోనే మహాలక్ష్మీకి ఇంకొకరితో పెళ్లి నిశ్చయమవుతుంది. మరి బాలు - మహాలక్ష్మీ కలిశారా లేదా? అన్నది కథ.
    4 . సాహసం శ్వాసగా సాగిపో(నవంబర్ 11 , 2016)
    U/A|యాక్షన్,డ్రామా,రొమాన్స్,థ్రిల్లర్
    ఓ లాంగ్‌ రైడ్‌ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను ఎలా చిగురింప చేసింది? ఈ క్రమంలో వారు పొందిన అనుభూతులు ఏంటి? ఈ రైడ్‌లో వారికి ఎదురైన భయానక సంఘటన ఏమిటీ? అన్నది కథ.
    5 . ప్రేమమ్(అక్టోబర్ 07 , 2016)
    U/A|136 minutes|డ్రామా,రొమాన్స్
    విక్రమ్‌ (నాగ చైతన్య) జీవితంలో మూడు దశల్లో చోటుచేసుకున్న ప్రేమల చుట్టూ సినిమా తిరుగుతుంది. అవి అతడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది కథ.

    నాగచైతన్యకు మంచి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ప్రేమమ్‌. ఇందులో చైతు అప్పటివరకూ తీసిన చిత్రాలకు ఎంతో భిన్నంగా నటించాడు. కథలోకి వెళితే ఇందులో మూడు లవ్‌స్టోరీలు ఉంటాయి. స్కూల్లో అనుపమ పరమేశ్వరన్‌ చైతు ఇష్టపడతాడు. కాలేజీలో లెక్చరర్‌ శ్రుతిహాసన్‌ను ప్రేమిస్తాడు. అయితే ఆమెకు ప్రమాదం జరిగి గతం మర్చిపోతుంది. కానీ చైతూ శృతిని మరిచిపోలేకపోతాడు. ఆ సమయంలోనే మడోన్నా సెబాస్టియన్ పరిచయం కావడం.. మూడో లవ్ స్టోరీ మొదలవడం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురిలో చైతూ ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    6 . కస్టడీ(మే 12 , 2023)
    U/A|148 minutes|థ్రిల్లర్,క్రైమ్ సినిమా,యాక్షన్,క్రైమ్
    శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల‌ని అనుకుంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి)ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మ‌రోవైపు రేవ‌తికి వేరే పెళ్లి నిశ్చయించార‌ని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు తీసుకెళ్తాడు. అసలు రాజన్న ఎవరు? అతన్ని చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.
    7 . ఒక లైలా కోసం(అక్టోబర్ 17 , 2014)
    U/A|150 minutes|హాస్యం,రొమాన్స్
    హీరో తొలిచూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. కానీ నందుకి కార్తీక్ అన్నా, కార్తీక్‌తో పెళ్లి అన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో ప్రేమను హీరోయిన్‌ అర్థం చేసుకుందా? లేదా? అన్నది కథ.
    8 . జోష్(సెప్టెంబర్ 05 , 2009)
    U/A|168 minutes|డ్రామా
    దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.

    నాగచైతన్య అరంగేట్ర చిత్రం ‘జోష్‌’. వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య కాలేజీ స్టూడెంట్‌గా నటించాడు. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే వ్యక్తిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో కార్తిక నాయర్‌ హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్‌ రాజ్‌, సిద్దు జొన్నలగడ్డ, సునీల్‌, బ్రహ్మానందం, శ్రేయ ధన్వంతరి కీలకపాత్రలు పోషించారు. సందీప్‌ ఛోటా సంగీతం సమకూర్చారు.

    9 . ఆటోనగర్ సూర్య(జూన్ 27 , 2014)
    A|157 minutes(Initial Version)145 minutes(Final Version)|డ్రామా,థ్రిల్లర్
    ఆటోనగర్‌ను ఇంద్రన్న(జయ ప్రకాష్ రెడ్డి), మేయర్ కోటిలింగం (మధు) గుప్పెట్లోకి తీసుకుంటారు. ప్రజలను మభ్యపెట్టి అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటారు. జైలు నుంచి ఆ ప్రాంతానికి వచ్చి సూర్య (నాగచైతన్య) రాబందుల రాజ్యాన్ని కూలదోయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు? విలన్లతో ఎలా తలపడ్డాడు? అన్నది కథ.
    10 . దోచెయ్(ఏప్రిల్ 24 , 2015)
    U|136-minute|యాక్షన్,హాస్యం,థ్రిల్లర్
    చందు అనే యువకుడు తన తండ్రిని జైలు నుండి తప్పించి, తన సోదరిని డాక్టర్‌గా మార్చాలని అనుకుంటాడు. అయితే, క్రిమినల్ అయిన మాణిక్యంతో తలపడినప్పుడు అతని కలలు చెదిరిపోతాయి.

    @2021 KTree