• TFIDB EN
  • Editorial List
    Nagarjuna Top-10 Movies: నాగార్జున హీరోగా చేసిన టాప్‌-10 చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకూ వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన విభిన్నమైన పాత్రలతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని అగ్రకథానాయకుల సరసన చేరారు. గ్లామర్‌లో నాగార్జునకు ఏ హీరో సాటి రారని పేరుంది. అందుకే ఆయనకు మన్మథుడు అనే బిరుదును సైతం సినీ ప్రేక్షకులు ఇచ్చారు. నాగార్జున ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో టాప్‌-10 మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . శ్రీరామదాసు(మార్చి 30 , 2006)
    U|150 minutes|డ్రామా,మ్యూజికల్
    గోపన్న కమలను వివాహం చేసుకుని హుస్నాబాద్‌కు తహశీల్దార్‌గా వెళ్తాడు. అక్కడ రామదాసు రాముడికి గుడి కట్టడంతో గొల్కొండ నవాబు అతన్ని బందీగా చేస్తాడు
    2 . సంతోషం(మే 09 , 2002)
    U|150 minutes|డ్రామా,రొమాన్స్
    కార్తిక్‌.. భాను అక్క పద్మావతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఓ రోజు ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తుంది. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన కార్తిక్‌ను చూసి భాను ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    3 . హలో బ్రదర్(ఏప్రిల్ 20 , 1994)
    U|152 minutes|యాక్షన్,హాస్యం
    కవల సోదరులైన దేవా, రవి వర్మ పుట్టగానే మిస్రో అనే గూండా వల్ల వేరు చేయబడుతారు. అయితే వారు పెద్దయ్యాక తిరిగి కలుసుకుని తమ తండ్రికి హాని తలపెట్టాలని చూస్తున్న మిస్రో కొడుకు మిత్రాపై పోరాడుతారు.
    4 . నిన్నే పెళ్ళాడతా(అక్టోబర్ 04 , 1996)
    UA|146 minutes|డ్రామా,రొమాన్స్
    శీను, మహాలక్ష్మీ ఓ పెళ్లిలో కలుసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి శీను ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. కానీ మహా నాన్న ఈ వివాహానికి అడ్డుపడతాడు.
    5 . మనం(మే 23 , 2014)
    UA|163 minutes|డ్రామా,ఫ్యామిలీ
    పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
    6 . ఊపిరి(మార్చి 25 , 2016)
    U|158 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన విక్రమ్ ఆదిత్య (నాగార్జున) తన బాగోగులు చూసుకునేందురు శీను (కార్తి)ను నియమించుకుంటాడు. ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయి? ఎవరెవరి జీవితాలు ఎలా మారాయి? అన్నది కథ.

    నాగార్జున కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఊపిరి ఒకటి. సినిమా మెుత్తం నాగార్జున వీల్‌చైర్‌లోనే కనిపిస్తారు. ముఖం ద్వారానే తన హావాభావాలను పలికించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ నటుడు కార్తీ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. కార్తీకి జంటగా తమన్నా నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, తనికెళ్లభరణి ప్రధాన పాత్రలు పోషించారు.

    7 . అన్నమయ్య(నవంబర్ 11 , 1997)
    U|147 minutes|డ్రామా,మ్యూజికల్
    పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుని జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అన్నమయ్య పాత్రను అక్కినేని నాగార్జున పోషించారు.

    అక్కినేని నాగార్జునలోని నిజమైన నటుడ్ని వెలికితీసిన చిత్రం 'అన్నమయ్య'. అప్పటివరకూ వరుసగా కమర్షియల్‌ చిత్రాలు చేసుకుంటూ వెళ్లిన నాగార్జున అన్నమ్మయ్యతో అందరినీ ఆశ్చర్య పరిచాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుమన్‌ వెంకటేశ్వర స్వామిగా కనిపించారు. రమ్యకృష్ణ, కస్తూరి, భానుప్రియ, మోహన్ బాబు, రోజా, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించాడు.

    8 . శివ(అక్టోబర్ 05 , 1989)
    A|145 minutes|యాక్షన్
    భవాని తన మనుషులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటాడు. కళాశాల విద్యార్థి శివ ఓ కారణంగా అతడిపై పోరాటానికి సిద్ధపడతాడు. ఈ పోరులో ఎవరు గెలిచారన్నది కథ.

    టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసిన చిత్రం ‘శివ’. మూస ధోరణి సినిమాలతో వెళ్తున్న తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కొత్తదనాన్ని పరిచయం చేశాడు. ఈ సినిమాలో హీరో నాగార్జున సైకిల్ చైన్ తెంపి విలన్స్ భరతం పట్టే సీన్ ఎవర్ గ్రీన్. అంతేకాదు తెలుగులో సౌండ్ ఎఫెక్ట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన మెుదటి చిత్రంగానూ శివ నిలిచింది. ఈ సినిమా విజయంతో హీరో నాగార్జున టాప్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. కాగా ఇందులో హీరోయిన్‌గా అమల చేయగా, ఇళయరాజా సంగీతం అందించారు.

    9 . గీతాంజలి(మే 12 , 1989)
    UA|135 minutes|రొమాన్స్
    క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రకాష్‌.. అదే సమస్యతో పోరాడుతున్న గీతాంజలిని ప్రేమిస్తాడు. ప్రకాష్‌ అనారోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె అతడి జీవితం నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.
    10 . మన్మధుడు(డిసెంబర్ 20 , 2002)
    U|142 minutes|రొమాన్స్
    అభిరామ్‌ తన మామకు చెందిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆడవారంటే అతడికి ద్వేషం. అసిస్టెంట్ మేనేజర్‌గా వచ్చిన హారికపై అభిరామ్‌ అనుచితంగా ప్రవర్తిస్తుంటాడు. ఆమెపై కోపం ప్రేమగా మారినప్పుడు కథ కీలక మలుపు తిరుగుతుంది.

    @2021 KTree