• TFIDB EN
  • Editorial List
    10 Best Movies Of Nithin: నితిన్‌ హీరోగా చేసిన టాప్‌-10 అత్యుత్తమ చిత్రాలు
    Dislike
    2k+ views
    5 months ago

    టాలీవుడ్‌లోని మోస్ట్‌ టాలెంటెడ్‌ యంగ్‌ హీరోల్లో నితిన్‌ ఒకరు. జయం సినిమాతో చిత్ర సీమకు పరిచయమైన ఆయన పలు సూపర్‌ హిట్‌ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకూ 25 చిత్రాలు చేసిన నితిన్‌ ఎక్కువ సినిమాల్లో లవర్‌ బాయ్‌ పాత్రను పోషించారు. తద్వారా యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించారు. నితిన్‌ తన నటనతో రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌, ఒక CineMAA అవార్డ్ గెలుచుకున్నారు. కాగా, ఈ హీరో కెరీర్‌లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సై(సెప్టెంబర్ 23 , 2004)
    U/A|163 minutes[citation needed]|యాక్షన్,డ్రామా,క్రీడలు
    ఓ మాఫియా లీడర్ నుంచి తమ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ఆర్ట్స్, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ లీడర్స్ అయిన శశాంక్, పృథ్వీ చేతులు కలుపుతారు. మాఫియా లీడర్‌తో రగ్బీ మ్యాచ్ గెలిస్తే మైదానం విద్యార్థులది అవుతుంది.

    దర్శకధీరుడు రాజమౌళి తీసిన అత్యుత్తమ చిత్రాల్లో ‘సై’ ఒకటి. ఇందులో హీరోగా నితిన్‌ నటించాడు. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రధానంగా రగ్బీ ఆట చుట్టూ తిరుగుతుంది. తమ కాలేజీ మైదానాన్ని విలన్‌ నుంచి కాపాడుకునేందుకు స్టూడెంట్స్‌ ఏం చేశారనేది ఈ మూవీ కథాంశం. ఇందులో హీరోయిన్‌గా జెనీలియా చేసింది. శశాంక్, రాజీవ్‌ కనకాల, ప్రదీప్‌ రావత్‌ కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

    6 . మాస్ట్రో(సెప్టెంబర్ 17 , 2021)
    U/A|135 minutes|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
    అంధుడైన అరుణ్‌ (నితిన్‌) రెస్టారెంట్‌లో పియానో వాయిస్తుంటాడు. అక్కడకు వచ్చే మోహన్‌ (నరేశ్‌) తమ వివాహ వార్షికోత్సవానికి ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్‌ ఇంటికి వెళ్లే సరికి మోహన్‌ హత్యకు గరువుతాడు. ఇంతకీ ఆ హత్య చేసిందేవరు? మోహన్‌ భార్య సిమ్రన్‌ (తమన్నా)కు ఆ హత్యలో ఏమైనా ప్రమేయం ఉందా? అన్నది కథ.

    హీరో నితిన్‌ అంధుడిగా నటించిన సినిమా ‘మ్యాస్ట్రో’. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్‌’ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అంధుడైన అరుణ్‌ (నితిన్‌) ఓ హత్యను కళ్లారా చూస్తాడు. అనంతరం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాడు. అసలు అరుణ్‌కు కళ్లు ఎలా పోయాయి? హత్య అనంతర ఘటనల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది అసలు కథ. ఇందులో నితిన్‌కు జోడీగా నభా నటేశ్‌ నటించింది. తమన్నా, నరేష్‌, శ్రీముఖి, జిషు సేన్‌ గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు.

    7 . జయం(జూన్ 14 , 2002)
    U/A|152 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    కాలేజీలో చదువుకునే ఓ యువ జంట ప్రేమలో పడుతుంది. అయితే యువతి తల్లిదండ్రులు వారి బంధువుల అబ్బాయికి ఇచ్చి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. మరి వారి ప్రేమ గెలుస్తుందా?

    నితిన్‌, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'జయం'. ఇందులో అమాయకుడైన యువకుడి పాత్రలో నితిన్‌ అద్భుతంగా నటించాడు. హీరోయిన్‌ ఇచ్చిన ధైర్యంతో విరోచితంగా విలన్‌తో పోరాడి మెప్పించాడు. ఇందులో సదా హీరోయిన్‌గా చేసింది. విలన్‌ పాత్రను గోపిచంద్ పోషించాడు. ఆర్‌.పి. పట్నాయక్‌ అందించిన సంగీతం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.


    @2021 KTree