టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్ క్రేజ్ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్.. అగ్రనటుడిగా ఎదిగారు. పవన్ తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. వాటి ద్వారా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. Read More
హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్ సింగ్’ చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది.

పవన్ కల్యాణ్, వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’. బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ'కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్ దేవుడిలా కనిపించడం విశేషం.

పూరి జగన్నాథ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’. ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్' అనే డైలాగ్ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది.

1999లో వచ్చిన ‘తమ్ముడు’ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్ కల్యాణ్ నటించాడు. ఇందులో పవన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.

పవన్ సినిమాల్లో ‘ఖుషి’ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో పవన్ మేనరిజమ్స్, సొంతంగా కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ మూవీకే హైలెట్ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇదే సినిమా పేరుతో విజయ్ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.

పవన్ కల్యాణ్ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ అగ్రస్థానంలో ఉంటుంది. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ అని సాంగ్.