టాలీవుడ్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనగానే ముందుగా రామ్ పోతినేని గుర్తుకు వస్తాడు. తన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. రామ్ ప్రతీ సినిమాలోనూ ఫుల్ జోష్‌తో నటిస్తాడు. తెరపై ఎంతో హుషారుగా కనిపిస్తాడు. దేవదాస్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన రామ్.. ఎక్కువగా ప్రేమ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ట్యాగ్‌ను సైతం సంపాదించాడు. రామ్ ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో టాప్-10 మీకోసం..
ప్రేమ, స్నేహం ప్రధాన అంశాలుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ అద్బుతంగా నటించాడు. చిన్ననాటి స్నేహితుడి కోసం ప్రేమనే వదులుకున్న పాత్రలో తనదైన మార్క్ చూపించాడు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా చేశారు. శ్రీవిష్ణు స్నేహితుడిగా నటించాడు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

రామ్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘జగడం’. ఈ చిత్రం రామ్‌ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది. చిన్నప్పటి నుంచి గొడవలు, హింస వైపు ఆసక్తి కనబరిచే వ్యక్తి భవిష్యత్‌లో ఏమయ్యాడనేది సినిమా కథ. ఇందులో రామ్‌కు జంటగా ఈషా నటించింది. ప్రకాష్ రాజ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంతల, ప్రదీప్ సింగ్ రావత్ కీలక పాత్రలు పోషించారు.

రామ్ పోతినేని, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'రెడీ'. 2008లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. ఈ చిత్రం ఏకంగా మూడు నంది అవార్డులను గెలుచుకుంది. ఇందులో రామ్‌కు జోడిగా జెనీలియా నటించింది. నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సునీల్, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.