• TFIDB EN
  • Editorial List
    Best movies of Venkatesh: వెంకటేష్‌ హీరోగా చేసిన టాప్‌-10 సూపర్‌ హిట్‌ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    టాలీవుడ్‌లోని దిగ్గజ నటుల్లో వెంకటేష్‌ ఒకరు. ఆయన ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ కథా చిత్రాలతో మహిళల అభిమానాన్ని పొందారు. ఇప్పటివరకూ 70కి పైగా చిత్రాలు చేసిన ఆయన అందులో మెజారిటీ చిత్రాలు ఫ్యామిలీ ఓరియంటడ్‌లోనే రావడం విశేషం. ఇక వెంకటేష్‌ ఒక్క ఫ్యామిలీనే కాగా యాక్షన్‌ హీరోగాను పేరు సంపాదించాడు. అంతేగాక తనదైన కామెడీ టైమింగ్‌తో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. వెంకటేష్‌ ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో టాప్‌-10 మూవీస్‌ జాబితా మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కలిసుందాం రా(జనవరి 14 , 2000)
    U|డ్రామా,ఫ్యామిలీ
    రాఘవయ్య తన విడిపోయిన కొడుకు భాస్కర్ కుటుంబాన్ని అతని పుట్టినరోజుకు ఆహ్వానించడానికి అంగీకరిస్తాడు. రాఘవయ్య మనవడు రఘు, తన తండ్రి, తాతల మధ్య బంధం చెడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకుంటాడు. ఆ సమస్యను పరిష్కరించి మనవడిగా రాఘవయ్య తనను అంగీకరించేలా చేస్తాడు.
    2 . ఘర్షణ(జూలై 30 , 2004)
    A|159 minutes|యాక్షన్,క్రైమ్
    తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక గ్యాంగ్‌స్టర్ డీసీపీ రామచంద్ర లవర్‌ మాయను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను రక్షించేందుకు డీసీపీ రామచంద్ర ఓ మిషన్ చేపడుతాడు.
    3 . మల్లీశ్వరి(ఫిబ్రవరి 18 , 2004)
    U|155 minutes|రొమాన్స్
    ఆంధ్రబ్యాంకులో పనిచేస్తున్న ప్రసాద్.. మల్లీశ్వరిని చూడగానే ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను పొందెందుకు నానా తంటాలు పడుతాడు. అయితే మల్లీశ్వరి ఎవరో తెలుసుకున్నాక తన ప్రేమను పక్కకు పెట్టి ఆమెకు రక్షణగా నిలుస్తాడు.
    4 . ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(ఏప్రిల్ 27 , 2007)
    UA|157 minutes|డ్రామా
    గణేష్ ఒక నిరుద్యోగి.. కీర్తిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె సాయంతో కీర్తి పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు. అయితే, ఆమె అప్పటికే వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నట్లు గణేష్‌ తెలుస్తుంది. ఓ సంఘటన వల్ల గణేష్‌ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్తాడు. గణేష్‌ను మాములు మనిషి చేసేందుకు అతని స్నేహితుడు తన ఊరికి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో అతనికి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.
    5 . కూలీ నం.1(జూలై 12 , 1991)
    U|146 min 46 sec|రొమాన్స్
    సంపన్న కుటుంబానికి చెందిన ఒక మహిళ కూలీతో ప్రేమలో పడినప్పుడు, ఆ జంట తమ సామాజిక హోదాలో ఉన్న విభేదాల కంటే తమ ప్రేమ బలమైనదని నిరూపించడానికి ప్రయత్నిస్తారు.
    6 . రాజా(మార్చి 18 , 1999)
    U|166 minutes|డ్రామా,రొమాన్స్
    రాజా తన స్నేహితుడు బాలుతో కలిసి అంజలి ఇంటికి దొంగతనానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వారం పాటు ఇంట్లో అంజలి చెప్పిన పనులు చేసేందుకు అంగీకరిస్తాడు. ఈ క్రమంలో అంజలి గతాన్ని తెలుసుకున్న రాజా ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరి రాజా ఆమెకు చేసిన సాయం ఏమిటి? ఈక్రమంలో అతను ఎదుర్కొన్న అవమానాలు ఏమటి అన్నది మిగతా కథ.
    7 . చంటి(జనవరి 10 , 1992)
    U|139 minutes|డ్రామా,రొమాన్స్
    నందిని చంటి అనే అమాయక యువకుడితో ప్రేమలో పడి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకుంటుంది. ఆమె వివాహం గురించి ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకున్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి.

    వెంకటేష్‌, రవిరాజా పినిశెట్టి కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ 'చంటి'. ఇందులో ఇంటి అనే అమాయకుడి పాత్రలో వెంకటేష్‌ అదరగొట్టాడు. ఇందులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో వెంకటేష్ నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. సుజాత, నాజర్‌, మంజుల, వినోద్‌, బ్రహ్మానందం, అల్లురామలింగయ్య కీలక పాత్ర పోషించారు. ఇళయరాజా గొప్ప సంగీతాన్ని అందించారు.

    8 . క్షణ క్షణం(అక్టోబర్ 09 , 1991)
    U|158 minutes|హాస్యం,క్రైమ్
    సత్య, చందు విచిత్రమైన పరిస్థితుల్లో కలిసి రోడ్ ట్రిప్ వెళ్ళవలసి వస్తుంది. అయితే వారిని నాయర్ అనే ఒక బ్యాంకు దొంగ, ఇన్‌స్పెక్టర్ యాదవ్ వెంబడిస్తారు. ఈ ప్రయాణంలో సత్య, చందు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
    9 . స్వర్ణకమలం(జూలై 15 , 1988)
    U|143 minutes|మ్యూజికల్
    ఒక యువతి నృత్యకారుల కుటుంబానికి చెందినది. దురదృష్టవశాత్తు, వారసత్వంగా వచ్చిన నాట్యాన్ని స్వీకరించదు. నృత్యం ఒక అందమైన కళ అని నమ్మే వ్యక్తిని ఆమె కలుసుకున్నప్పుడు విషయాలు మలుపు తిరుగుతాయి.
    10 . దృశ్యం(జూలై 11 , 2014)
    U|150 minutes|డ్రామా,థ్రిల్లర్
    రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.

    మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో వెంకటేష్‌ అద్భుతమైన నటన కనబరిచాడు. కథలోకి వెళితే.. ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్)కి తను చూసే సినిమాలు, భార్య (మీనా) పిల్లలే లోకం. జీవితంలో వచ్చే సమస్యలకు తాను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటాడు రాంబాబు. ఈ క్రమంలో అతడు ఊహించని సమస్యని ఎదుర్కొంటాడు. దాని నుంచి రాంబాబు ఎలా తప్పించుకున్నాడు? బయటపడేందుకు ఎలాంటి ప్లాన్‌లు వేశాడు? పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? అనేది అసలు కథ.

    11 . నువ్వు నాకు నచ్చావ్(సెప్టెంబర్ 06 , 2001)
    U|180 minutes|హాస్యం,మ్యూజికల్
    వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.

    @2021 KTree