• TFIDB EN
  • Editorial List
    Vijay Devarakonda Top 10 Movies: టాలీవుడ్‌లో విజయ్ నటించిన బెస్ట్‌ చిత్రాలు ఇవే
    Dislike
    2k+ views
    6 months ago

    టాలీవుడ్‌ యువ సంచలనంగా విజయ్‌ దేవరకొండకు పేరుంది. అతడు తీసిన క్లాస్‌, మాస్‌ చిత్రాలు విజయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అర్జున్‌ రెడ్డి సినిమాతో అతడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిపోయాడు. పెద్ద సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. అటు యంగ్‌ ఆడియన్స్‌ విజయ్‌ నటన, యాటిట్యూడ్, బాడీ, లాంగ్వేజ్‌కు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌ తీసిన టాప్‌-10 బెస్ట్‌ చిత్రాలు మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అర్జున్ రెడ్డి(ఆగస్టు 25 , 2017)
    A|182 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.

    విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘అర్జున్‌ రెడ్డి’ నిలిచింది. ఈ సినిమా విజయంతో విజయ్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా చేసింది. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, కమల్‌ కామరాజు, జియా శర్మ, సంజయ్ స్వరూప్ కీలక పాత్రలు పోషించారు.

    2 . పెళ్లి చూపులు(జూలై 29 , 2016)
    U|118 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
    3 . గీత గోవిందం(ఆగస్టు 15 , 2018)
    U/A|142 minutes|హాస్యం,రొమాన్స్
    గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.

    పరుశురామ్‌ దర్శకత్వంలో ‘గీతా గోవిందం’ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ మూవీలో విజయ్ లుక్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    4 . టాక్సీవాలా(నవంబర్ 17 , 2018)
    U/A|137 minutes|ఫాంటసీ,థ్రిల్లర్
    శివ (విజయ్‌ దేవరకొండ) ట్యాక్సీ డ్రైవర్‌. ఓ పాత ట్యాక్సీని తక్కువ ధరకే కొనుగోలు చేస్తాడు. కానీ, ఆ కారులో దెయ్యం ఉందని శివ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    5 . మహానటి(మే 09 , 2018)
    U|169 minutes|బయోగ్రఫీ,డ్రామా
    దిగ్గజ నటి సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆమె ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? ఆమె జీవితంపై నటుడు జెమినీ గణేషన్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? వంటి అంశాలను ఇందులో చూపించారు. సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించింది.
    6 . ఎవడే సుబ్రమణ్యం(మార్చి 21 , 2015)
    U|150 minutes|డ్రామా,రొమాన్స్
    మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈక్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు.
    7 . డియర్ కామ్రేడ్(జూలై 26 , 2019)
    U/A|170 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
    8 . నోటా(అక్టోబర్ 05 , 2018)
    U/A|153 minutes|డ్రామా,థ్రిల్లర్
    వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకు. తండ్రి ఓ కేసులో ఇరుక్కోవడంతో సీఎం పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి గురించి వరుణ్‌కు తెలిసిన నిజాలేంటి? వాసుదేవ్‌పై దాడి చేసింది ఎవరు? అన్నది కథ.

    విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ చిత్రం 'నోటా'. ఇందులో విజయ్ సీఎం నటించి మెప్పించాడు. కథలోకి వెళితే.. వరణ్‌ (విజయ్‌ దేవరకొండ) లండన్‌లో గేమ్ డెవలపర్‌గా పనిచేస్తుంటాడు. తన తండ్రి సీఎం వాసుదేవ్‌ (నాజర్‌) అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఇండియాకు వస్తాడు. వాసుదేవ్‌ నమ్మే స్వామిజీ మాట ప్రకారం వరుణ్‌ రాష్ట్ర సీఎంగా పదవి చేపడతాడు. జర్నలిస్టు మహేందర్‌ (సత్యరాజ్‌) సాయంతో ప్రజలు మెచ్చే నాయకుడు అవుతాడు. దీంతో వాసుదేవ్‌ ఎలాగైన వరుణ్‌ను పదవిలో నుంచి దించేయాలని చూస్తాడు. తన తండ్రి ఎత్తులకు పైఎత్తు వేసి వరుణ్‌ తన పదవిని ఎలా కాపాడుకున్నాడన్నది అసలు కథ.

    9 . వరల్డ్ ఫేమస్ లవర్(ఫిబ్రవరి 14 , 2020)
    U/A|148 minutes|డ్రామా,రొమాన్స్
    సమాజంలోని భిన్న మనస్తత్వాలు, భిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తుల్లో ప్రేమ పట్ల విభిన్న దృక్కోణాలను ఆవిష్కరించే నాలుగు స్ఫూర్తిదాయకమైన ప్రేమకథల సమాహారమే ఈ సినిమా.
    10 . ద్వారక(మార్చి 03 , 2017)
    U/A|హాస్యం,డ్రామా
    శ్రీనివాస్ (విజయ్ దేవరకొండ) తన స్నేహితులతో కలిసి ఓ దొంగతనం చేయబోయి ద్వారక అపార్టుమెంట్లో తలదాచుకుంటాడు. అక్కడికి చేరిన విజయ్‌ను అపార్ట్‌మెంటు వాళ్లు స్వామి కృష్ణానంద అని నమ్మడం ప్రారంభిస్తారు. పెద్దఎత్తున కానుకలు సమర్పిస్తారు. అయితే అతను దొంగ అని తెలిసిన ఓ వ్యక్తి అతని బండారం బయటపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ తన భక్తుల్ని ఎలా హ్యాండిల్ చేశాడు ? స్వామిజీ ముసుగు నుండి ఎలా బయటికొచ్చాడు ? అనేది మిగతా కథ..

    @2021 KTree