• TFIDB EN
 • Editorial List
  2023- తెలుగులో టాప్ 10 మ్యూజికల్ హిట్ సినిమాలు
  Dislike
  2k+ views
  5 months ago

  2023 ఏడాదిలో చాలా సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. కొన్ని సినిమాలు కలెక్షన్లతో సంబంధం లేకుండా మ్యూజికల్ హిట్లుగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. వాటిలో టాప్ మ్యూజికల్ హిట్ సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది.

  ఇంగ్లీష్‌లో చదవండి

  1 . ఖుషి(సెప్టెంబర్ 01 , 2023)
  U/A|165 minutes|రొమాన్స్,డ్రామా,హాస్యం
  సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.

  ఈ చిత్రంలోని నా రోజా నువ్వే సాంగ్ 129 మిలియన్ వ్యూస్‌ను క్రాస్‌ చేసి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది.

  2 . బేబీ(జూలై 14 , 2023)
  U/A|177 minutes|డ్రామా,రొమాన్స్
  ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌తో ఇష్టం లేకున్నా శారీరకంగా ఒకటవ్వాల్సి వస్తుంది. ఆనంద్‌ను వైష్ణవి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? చివరకు ఆనంద్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.

  ఈ సినిమాలోని ఓ రెండు ప్రేమ మేఘాలు పాట ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. 83 మిలియన్ వ్యూస్‌ను యూట్యూబ్‌లో క్రాస్ చేసింది.

  3 . దసరా(మార్చి 30 , 2023)
  U/A|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
  ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

  ఈ చిత్రంలోని ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ సాంగ్‌తో పాటు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

  5 . సార్(ఫిబ్రవరి 17 , 2023)
  U|148 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
  బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ

  ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్‌ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు' సాంగ్ యూట్యూబ్‌లో 127 మిలియన్ వ్యూస్‌ క్రాస్ చేసింది.

  7 . రూల్స్ రంజన్!(అక్టోబర్ 06 , 2023)
  U/A|డ్రామా,రొమాన్స్
  మనో రంజన్(కిరణ్ అబ్బవరం) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన లైఫ్‌లో కఠినమైన రూల్స్‌ పెట్టుకుని జీవిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత ఫ్రెండ్ సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకున్న.. మనో రంజన్.. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి షాకవుతాడు. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనేది కథ.

  ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని 'సమ్మోహనుడా' సాంగ్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.

  8 . కోట బొమ్మాళి P.S(నవంబర్ 24 , 2023)
  U/A|క్రైమ్,థ్రిల్లర్
  కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ.

  ఈ చిత్రం విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 'నాఅమ్మ.. నాతల్లి' సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే 37 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.


  @2021 KTree