
ETVవిన్ యాప్‌లో టాప్ 10 రొమాంటిక్ డ్రామా సినిమాలు
3k+ views1 year ago
ETV విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ డ్రామా చిత్రాల్లో టాప్ రేటెడ్ సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో అలనాటి క్లాసిక్స్ అయిన రౌడిగారి పెళ్లం, ముద్దుల మావయ్య వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం రొమాంటిక్ మోడ్‌ను ఆస్వాదించండి.

1 . సమరసింహా రెడ్డి(జనవరి 13 , 1999)
UA|యాక్షన్,డ్రామా
సమరసింహారెడ్డి తన కుటుంబ హత్యకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అనుకోకుండా వాసు అనే అమాయకుడిని చంపేస్తాడు. ఓ అబద్దంతో వాసు కుటుంబానికి దగ్గరై వారిని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

2 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
A|యాక్షన్,డ్రామా
ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

3 . నువ్వే కావాలి(అక్టోబర్ 13 , 2000)
U|డ్రామా,రొమాన్స్
తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.

4 . అంతస్తులు(మే 27 , 1965)
U|డ్రామా
రాజా జగన్నాథ రావు, ఒక సంపన్న జమీందార్. చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాడు. అతని కుటుంబంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని ఆశిస్తాడు. అయితే అతని చిన్న కొడుకు తిరుగుబాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతాయి.
.jpeg)
5 . జగన్మోహిని(జనవరి 01 , 1978)
UA|డ్రామా
మోహిని ఒక రాజు చేత మోసం చేయబడి ఆత్మహత్య చేసుకుంటుంది. తర్వాత దెయ్యంగా మారుతుంది. మరోవైపు రాజు చనిపోయి రాజా అనే రైతుగా పునర్జన్మ పొందుతాడు. దీంతో మోహిని అతనిపై ప్రతీకారానికి యత్నిస్తుంది.
.jpeg)
6 . సింహాద్రి(జూలై 09 , 2003)
U|డ్రామా
సింహాద్రి (జూ.ఎన్టీఆర్)ను రామ్ భూపాల్ వర్మ (నాజర్) చిన్నప్పుడే దత్తత తీసుకుంటాడు. వర్మ మనవరాలు సింహాద్రిని ప్రేమిస్తుంది. అయితే సింహాద్రి వద్ద ఓ మతిస్థిమితం లేని అమ్మాయి ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? కేరళతో హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.

7 . షావుకారు(ఏప్రిల్ 07 , 1950)
U|డ్రామా
వడ్డీ వ్యాపారి కొడుకు సత్యం తన పొరుగింటి అమ్మాయి సుబ్బులుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే, కొన్ని కారణాల వల్ల సత్యం జైలుకు వెళ్లడంతో సమస్యలు ఎదురవుతాయి.

8 . దసరా బుల్లోడు(జనవరి 13 , 1971)
U|డ్రామా
రాధ, నిర్మల ఇద్దరూ గోపిని ప్రేమిస్తారు. కానీ గోపికి రాధ మాత్రమే ఇష్టం. వారి మనసులు తెలుసుకున్న నిర్మల వారిద్దరిని కలపాలని నిర్ణయించుకుంటుంది.

9 . రామ కృష్ణులు(జూన్ 08 , 1978)
U|డ్రామా
తల్లి, సోదరి దారుణ హత్యకు గురైన తర్వాత రాము పారిపోతాడు. అనాథ అయిన కృష్ణుడ్ని కలుసుకొని స్నేహం చేస్తాడు. వారిద్దరు పెద్దయ్యాక ఒక జట్టుగా ఏర్పడి విలన్లపై ప్రతీకారం తీర్చుకుంటారు.

10 . బలరామ కృష్ణులు(నవంబర్ 07 , 1992)
U|డ్రామా,రొమాన్స్
బలరామయ్య తన సవతి తల్లి వేరే కులం కాబట్టి సవతి సోదరుడు, సవతి సోదరిని అంగీకరించడు. అతని కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడంతో పరిస్థితులు మారతాయి.