• TFIDB EN
  • Editorial List
    మే నెలలో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 15 చిత్రాలు ఇవే!
    Dislike
    200+ views
    3 months ago

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలో (OTT telugu movies in May) స్ట్రీమింగ్‌కు వస్తాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. మే నెల గడిచి పోయింది. మరి గత నెలలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బడే మియా ఛోటే మియా(ఏప్రిల్ 11 , 2024)
    UA|158 minutes|యాక్షన్,థ్రిల్లర్
    కబీర్ (పృథ్వీరాజ్) భారత సైన్యం నుండి ఒక ప్యాకేజీని దొంగిలించి.. కొంతమంది సైనికులను చంపుతాడు. దీంతో ఉన్నతాధికారులు అతడ్ని పట్టుకునే బాధ్యతను ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), రాకీ (టైగర్ ష్రాఫ్)కి అప్పగిస్తారు. ఇంతకీ కబీర్ ఎవరు? సైన్యానికి వ్యతిరేకంగా ఎందుకు మారాడు? దొంగిలించిన ప్యాకేజీలో ఏముంది? ఫిరోజ్, రాకేష్‌లు కబీర్‌ను అడ్డుకున్నారా? లేదా? అన్నది కథ.
    2 . ఆవేశం(ఏప్రిల్ 11 , 2024)
    UA|161 minutes|డ్రామా
    కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్‌ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్‌ గుండా రంగా (ఫహద్‌ ఫాసిల్‌)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? అన్నది కథ.
    3 . చోరుడు (కాల్వన్)(ఏప్రిల్ 04 , 2024)
    UA|డ్రామా,థ్రిల్లర్
    ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
    4 . షరతులు వర్తిస్తాయి!(మార్చి 15 , 2024)
    UA|డ్రామా
    చిరంజీవి, విజయ మధ్య తరగతి భార్య భర్తలు. చైన్‌ సిస్టమ్‌ బిజినెస్‌ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇంతకీ ఆ బోగస్‌ కంపెనీ ఎవరిది? తన డబ్బులు పోయాయని తెలిసిన చిరంజీవి ఏం చేశాడు? ఈ మోసానికి కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధం ఏంటి? అన్నది కథ.
    5 . విద్యా వాసుల అహం
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    రేటింగ్ లేదు
    విద్య తనకు ఎలాంటి భర్త కావాలో క్లారిటీతో ఉంటుంది. కొన్ని పరీక్షలు పెట్టి వాసును పెళ్లి చేసుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత వారి కాపురంలో సమస్యలు మెుదలవుతాయి. అహంతో ఒకరితో ఒకరు గొడవపడుతుంటారు. ఈ కొత్త జంట తమ కలహాలకు ఎలా ముగింపు పలికింది? అన్నది కథ.
    6 . ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌(డిసెంబర్ 21 , 2023)
    UA|124 minutes|యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ
    ఆర్థర్‌ కర్రీ (జాసన్‌ మోమోయ్‌).. సోదరుడు ఓరమ్‌ను ఓడించి ట్రైడెంట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అట్లాంటిస్‌ రాజు అవుతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సముద్రపు దొంగ డేవిడ్‌ బయలుదేరుతాడు. ఓ గుహలోకి వెళ్లిన అతడికి అద్భుతమైన శక్తులు ఉన్న బ్లాక్‌ ట్రైడెంట్‌ దొరుకుతుంది. దాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత డేవిడ్‌ ఎలా మారాడు? అతడికి లభించిన శక్తులు ఏమిటి? డేవిడ్ దుశ్చర్యలను ఆర్థర్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
    7 . క్రూ(మార్చి 29 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    జాస్మిన్‌ (కరీనా), గీతా (టబు), దివ్య (కృతి సనన్‌) కోహినూర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా చేస్తుంటారు. ఆర్థిక సమస్యల వల్ల యాజమాన్యం కొన్ని నెలలుగా వారికి జీతాలు చెల్లించదు. ముగ్గురికి డబ్బు అవసరం పడటంతో దాన్ని సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. చివరికీ ఏమైంది? అన్నది కథ.

    బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది.

    8 . ఆరంభం(మే 10 , 2024)
    UA|థ్రిల్లర్
    మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
    9 . రత్నం(ఏప్రిల్ 26 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    రత్నం (విశాల్‌).. ఏపీ, తమిళనాడు బోర్డర్‌లో జీవిస్తుంటాడు. జననీని (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అన్నది కథ.
    10 . ప్రసన్న వదనం(మే 03 , 2024)
    UA|డ్రామా
    రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.

    డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

    11 . రామన్న యూత్(సెప్టెంబర్ 15 , 2023)
    UA|యాక్షన్,డ్రామా
    అంక్సాపూర్ గ్రామానికి చెందిన రాజు.. ఎప్పటికైన యూత్‌ లీడర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. స్థానిక ఎమ్మెల్యే కంట్లో పడేందుకు రాజు అతడి ఫ్రెండ్స్‌ ఊరిలో ఒక బ్యానర్‌ కడతారు. అయితే అది వారి జీవితాలను మలుపు తిప్పుతుంది. ఇంతకీ ఆ బ్యానర్‌లో ఏముంది? అది ఎలాంటి పరిస్థితులకు కారణమైంది? అన్నది కథ.
    12 . కీచురాళ్లు(మే 20 , 2022)
    UA|106 minutes|డ్రామా,థ్రిల్లర్
    రాధికా బాలన్‌ ఓ సైబర్‌ సెక్యూరిటీ స్టార్టప్‌ను ప్రారంభించి కేసుల దర్యాప్తులో పోలీసులకు సాయపడుతుంటుంది. అనుకోకుండా ఓ రోజు ఆమె సైబర్‌ క్రైమ్‌ బాధితురాలిగా మారిపోతుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బెదిరిస్తుంటాడు. ఇంతకీ అతడు ఎవరు? ఆమెను ఎందుకు బెదిరించాడు? రాధికా తన తెలివితో అతడ్ని ఎలా పట్టుకుంది? అన్నది ప్లాట్.
    13 . ధూమం(జూన్ 23 , 2023)
    UA|142 minutes|థ్రిల్లర్,డ్రామా
    అవినాష్ ఓ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాడు. ఈ క్రమంలో యజమానితో భేదాభిప్రాయాలు రావడంతో కంపెనీ నుంచి బయటకు వస్తాడు. ఓ రోజు కారులో తన భార్యతో వెళ్తున్న క్రమంలో అతనిపై కొంతమంది దాడి చేస్తారు. ఇంతకు అతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అవినాష్ భార్యకు వచ్చిన ప్రమాదం ఏమిటన్నది మిగతా కథ.
    14 . శ్రీ‌రంగనీతులు (ఏప్రిల్ 12 , 2024)
    UA|డ్రామా
    మూడు కథల సమాహారమే ఈ చిత్రం. బస్తీకి చెందిన శివ (సుహాస్‌) ఓ టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. స్కూల్ గ్రౌండ్‌లో తన ఫోటోతో పెట్టిన పెద్ద ఫ్లెక్సీని ఎవరో తీసేయడంతో మళ్లీ కొత్తది పెట్టాలని పట్టుదలతో ఉంటాడు. అటు వరుణ్‌, ఐశ్వర్య ప్రేమించుకుంటారు. వీళ్లు కలిశారా? లేదా? అనేది రెండో కథ. ఉన్నత చదువులు చదివిన కార్తిక్‌ డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా మారతాడు. అతడ్ని మార్చడానికి తండ్రి ఏం చేశాడు? అనేది మూడో కథ.

    @2021 KTree