2024 ఏడాదిలో వచ్చిన టాప్ 20 యాక్షన్ సినిమాలు ఇవే!
20+ views23 days ago
2024 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాదిలో అనేక సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వాటిలో బెస్ట్ యాక్షన్ సినిమాలను YouSay TFIDB లిస్ట్ చేయడం జరిగింది. ఈ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇయర్ ఎండ్‌లో యాక్షన్ మోడ్‌ను మరోసారి ఆస్వాదించండి.
1 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
2 . హను మాన్(జనవరి 12 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ
సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
3 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.
4 . సరిపోదా శనివారం(ఆగస్టు 29 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. అక్కడ అరాచకం చేస్తున్న పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? అక్కడి వారికి ఏ విధంగా అండగా నిలిచాడు? అన్నది స్టోరీ. సరిపోదా శనివారం సినిమాను రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
5 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
6 . డెడ్‌పూల్ & వుల్వరైన్(జూలై 26 , 2024)
A|యాక్షన్,హాస్యం,డ్రామా
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ - వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి? అన్నది స్టోరీ.
7 . మంజుమ్మెల్ బాయ్స్(ఏప్రిల్ 06 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
8 . తంగలాన్(ఆగస్టు 15 , 2024)
UA|యాక్షన్,డ్రామా
తంగలాన్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అన్నది స్టోరీ.
9 . కరటక దమనక(మార్చి 08 , 2024)
UA|యాక్షన్,డ్రామా
విరూపాక్ష (శివరాజ్‌కుమార్), బసవరాజు (ప్రభుదేవా) మోసాలు చేస్తూ బతుకుతుంటారు. ఓ మినిస్టర్‌ను బోల్తా కొట్టించబోయి జైలుకు వెళ్తారు. అక్కడ ఓ ఖైదీని కాపాడటంతో జైలర్ వారిని పని మీద ఓ ఊరికి పంపుతాడు. ఇంతకీ ఆ ఊరి సమస్య ఏంటి? ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారు? వారిని రప్పించేందుకు ఈ ఇద్దరు మిత్రులు ఏం చేశారు? అన్నది స్టోరీ.
10 . రోడ్ హౌస్(మార్చి 21 , 2024)
A|యాక్షన్
ఫ్లోరిడాలోని రోడ్ హౌస్ క్లబ్‌లో కస్టమర్లు తరచూ గొడవలకు దిగుతుంటారు. దీంతో మాజీ యూఎఫ్‌సీ ఫైటర్ జేక్‌ను రోడ్ హౌస్ యజమాని బౌన్సర్‌గా నియమిస్తుంది. అక్కడికి వెళ్లిన జేక్ పోకిరీలకు ఎలా బుద్ది చెప్పాడు? అక్కడి లోకల్ గ్యాంగ్‌తో జేక్‌కు ఎదురైన సమస్య ఏంటి? అన్నది స్టోరీ.
11 . డామ్‌సెల్(మార్చి 08 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్
ప్రిన్స్ హెన్రీని యువరాణి ఎలోడి వివాహం చేసుకుంటుంది. అనంతరం ఎలోడిని ఫైర్ డ్రాగెన్ ఉన్న గుహలో ప్రిన్స్ వదిలేస్తాడు. మరి ఆ గుహలోని డ్రాగెన్ నుంచి ఎలోడి తప్పించుకుందా? ఆ గుహలో ఎలోడి తెలుసుకున్న విషయాలు ఏంటి? చివరికీ ఎలోడి ఏమైంది? అన్నది కథ.
12 . మెకానిక్ రాకీ(నవంబర్ 22 , 2024)
UA|యాక్షన్,హాస్యం,డ్రామా
రాకీ (విష్వక్ సేన్) తండ్రి నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేస్తూ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతడి వద్ద డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? రాంకీ రెడ్డి (సునీల్) వల్ల రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? అన్నది స్టోరీ.
13 . ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా(మే 24 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్
ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్.. సిటాడెల్ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ.
14 . ది మినిస్ట్రీ అఫ్ ఉంగెంతలేమాన్ల్య్ వార్ఫేర్(ఏప్రిల్ 13 , 2024)
A|యాక్షన్,హాస్యం
బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, సైనిక అధికారులు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌పై పోరాడేందుకు అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన సైనికులను రిక్రూట్ చేసుకుంటారు. వారిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి నాజీలపైకి పంపుతారు. అప్పుడు వారు ఏం చేశారు? శత్రువులను సాహాసోపేతంగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.
15 . లాల్ సలామ్(ఫిబ్రవరి 09 , 2024)
UA|యాక్షన్,డ్రామా
హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులుగా ఉంటారు. కొంత కాలం ఒకే జట్టుకు ఆడినప్పటికీ.. వారిలో ఒకరు కొత్త టీమ్‌ను స్థాపిస్తారు. దీంతో రెండు జట్లు రెండు మతాలకు ప్రాతినిథ్యం వహించడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో ఓ మ్యాచ్ ఆ ఇద్దరు క్రికెటర్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. అప్పుడు ముస్లిం క్రికెటర్ తండ్రి (రజనీ) ఏం చేశాడు? అన్నది కథ.
16 . జితేందర్ రెడ్డి(నవంబర్ 07 , 2024)
UA|యాక్షన్,డ్రామా
జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న జితేందర్ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? నాయకుడిగా ఎలా ఎదిగాడు? అన్నది స్టోరీ.
17 . కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(మే 10 , 2024)
UA|యాక్షన్,డ్రామా,సైన్స్ ఫిక్షన్
ఏప్స్‌ను పాలిస్తున్న ప్రాక్సిమస్ సీజర్.. మనుషులను అంతం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో నోవా అనే యువతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సీజర్ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్ సీజర్.. నోవా, చింపాజీతో ఎలాంటి పోరాటం చేసింది? ప్రాక్సిమస్‌ను వారు కలిసికట్టుగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.
18 . భజే వాయు వేగం(మే 31 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్
తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పుడే అనాథగా మారిన వెంకట్‌ను... రాజన్న దత్తత తీసుకుంటాడు. కొడుకు రాజుతో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని కారణాల వల్ల వెంకట్.. విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేస్తాడు. వారు మోసం చేయడంతో పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
19 . కెప్టెన్ మిల్లర్(జనవరి 25 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
20 . వెట్టయన్(అక్టోబర్ 10 , 2024)
UA|యాక్షన్,డ్రామా
ఎస్పీ అదియన్ (రజనీకాంత్) స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదుతో గంజాయి మాఫియాను అణిచివేస్తాడు. ఈ క్రమంలో చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయిన శరణ్య అనూహ్యంగా అక్కడ హత్యాచారానికి గురవుతుంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు మెుదలవడంతో ఈ కేసును అదియన్‌కు ప్రభుత్వం అప్పగిస్తుంది. అసలు శరణ్య హత్యకు కారణం ఏంటి? దాని వెనక ఉన్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? శరణ్యకు అదియన్ ఎలా న్యాయం చేశాడు? అన్నది స్టోరీ.
21 . అయాలన్(జనవరి 12 , 2024)
UA|యాక్షన్,హాస్యం,సైన్స్ ఫిక్షన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
22 . నా సామి రంగ(జనవరి 14 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
23 . గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్(మార్చి 29 , 2024)
UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
భూమిని అంతం చేయడానికి వచ్చిన ఒక టైటాన్‌ను గాడ్జిల్లా, కాంగ్ కలిసికట్టుగా ఎలా ఆపాయి? గాడ్జిల్లా, కాంగ్‌లతో మనుషులు ఎలాంటి బంధాన్ని ఏర్పరుచుకున్నారు? ఇంతకీ కాంగ్ ఎవర్ని వెతుకుతుంది? గాడ్జిల్లా పవర్ పెంచుకునేందుకు ఎందుకు యత్నించింది? అన్నది కథ.
24 . సివిల్ వార్(మార్చి 14 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్
అమెరికాలో సివిల్ వార్ మెుదలవుతుంది. సొంత వారే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. వైట్ హౌస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రాలు ఎదురు తిరుగుతాయి. వెస్ట్రన్ ఫోర్సెస్ అన్నీ రాజ్యాధికారం కోసం యుద్ధం ప్రకటిస్తాయి. అప్పుడు అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఈ సివిల్ వార్ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.
25 . డబల్ ఇస్మార్ట్(ఆగస్టు 15 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్,సైన్స్ ఫిక్షన్
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? అనేది కథ
26 . గుంటూరు కారం(జనవరి 12 , 2024)
UA|యాక్షన్,డ్రామా
రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల అతని తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లికి దూరంగా 25 ఏళ్లు పెరిగిన తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి. మరి రమణ తన తల్లిని కలిశాడా? లేదా? అసలు వసుంధర తన కొడుకును ఎందుకు దూరం పెట్టింది ? ఇద్దరి మధ్య దూరానికి కారణం ఎవరు? అన్నది మిగతా కథ.
27 . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(మే 31 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం అనే కుర్రాడు.. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
28 . మహారాజా(జూన్ 14 , 2024)
UA|యాక్షన్,డ్రామా
మహారాజా ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మహారాజా గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాడు. ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి దాడి చేశారని చెప్తాడు. తన బిడ్డను కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అన్నది కథ.
29 . ఎ.ఆర్.ఎం(సెప్టెంబర్ 12 , 2024)
UA|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
అజయ్ (టొవినో థామస్) ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం బంగారం కంటే విలువైంది. దాన్ని కొట్టేసి ఆ నిందని అజయ్‌పై వేయాలని సుదేవ్‌వర్మ కుట్ర చేస్తాడు. అయితే విగ్రహాన్ని అజయ్ ఫ్యామిలీ తరతరాలుగా రక్షిస్తుంటుంది. మరి ఈసారి అజయ్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్రహం చరిత్ర ఏంటి? కథలో మహావీరుడు కుంజికేలు, మణియన్ ఎవరు? అన్నది స్టోరీ.
30 . భీమా(ఆగస్టు 09 , 2024)
A|యాక్షన్,థ్రిల్లర్
భీమా (దునియా విజయ్) ఓ అనాథ. సాధారణ బైక్ మెకానిక్ అయిన అతడు అనుకోకుండా డ్రగ్ మాఫియాపై పోరాటానికి దిగుతాడు. బ్లాక్ డ్రాగన్ మంజా అనే రౌడీని ఎదిరిస్తాడు. దీంతో అతడి వెనకున్న రౌడీలు, పోలీసులతో పాటు పొలిటికల్ లీడర్స్‌కు భీమా శత్రువుగా మారతాడు. వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భీమాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? డ్రగ్ మాఫియాను భీమా అంతం చేశాడా? లేదా? అన్నది స్టోరీ.