Editorial List
ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
600+ views1 year ago
తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం బోలెడంతా వినోదాన్ని పంచుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరిస్తుంటుంది. అయితే తాజాగా మరికొన్ని హిట్ చిత్రాలను ఫ్రీ స్ట్రీమింగ్ జాబితాలో చేర్చింది. వీటిలో పరుగు, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, 100% లవ్ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వీటిని చూసి ఆనందించండి మరి..
1 . మాస్(డిసెంబర్ 23 , 2004)
UA|162 minutes|యాక్షన్,డ్రామా
మాస్ ఒక అనాథ. మాఫియా డాన్ కూతురితో ప్రేమలో ఉన్న తన యజమాని కొడుకు ఆదితో మంచి బంధం ఏర్పడుతుంది. ప్రేమికులను విడదీసే ప్రయత్నంలో, గ్యాంగ్‌స్టర్లు ఆదిని చంపుతారు. దీంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మాస్ బయలుదేరుతాడు.
2 . అన్నమయ్య(నవంబర్ 11 , 1997)
U|147 minutes|డ్రామా,మ్యూజికల్
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుని జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అన్నమయ్య పాత్రను అక్కినేని నాగార్జున పోషించారు.
3 . మిస్టర్ పెళ్ళాం(సెప్టెంబర్ 05 , 1993)
U|129 mins|హాస్యం,డ్రామా
కుటుంబానికి మగాడే పెద్ద అని భావించే అహం భావం కలవాడు బాలజీ. కుటుంబం కోసం సంపాదించాల్సిన ప్రతిదాన్ని పురుషులు చేయగలరని భావిస్తాడు. అయితే అతని ఉద్యోగం పోయిన తర్వాత భార్య పని చేయాల్సి రావడంతో తన తప్పు తెలుసుకుంటాడు.
4 . వాసు(ఏప్రిల్ 10 , 2002)
U|147 minutes|మ్యూజికల్
వాసు గొప్ప సంగీతకారుడు కావాలని కలలు కంటుంటాడు. సివిల్స్ చేయాలన్న తన కోరికకు విరుద్ధంగా వాసు వెళ్తుండటంతో తండ్రి కోపం పెంచుకుంటాడు. చివరికి వాసు ఏం చేశాడు? అన్నది కథ.
5 . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(సెప్టెంబర్ 14 , 2012)
UA|169 minutes|డ్రామా,రొమాన్స్
కాలేజీ స్టూడెంట్ అయిన శ్రీను తన హైదరాబాద్‌లోని తన మేన మామ ఇంటికి ఇద్దరు చెల్లెల్లతో వెళ్తాడు. అక్కడ గోల్డ్ ఫేజ్‌లో డబ్బున్న యువకులతో గొడవ పడిన తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. అతని చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. మరి అతని చెల్లెలు పడిన ఇబ్బంది ఏంటి? అసలు శ్రీను ఏ ఉద్దేశంతోని హైదరాబాద్ వచ్చాడు అన్నది మిగతా కథ.
6 . గీతాంజలి(ఆగస్టు 08 , 2014)
A|హాస్యం,హారర్
హీరో తన ఫ్రెండ్‌తో కలిసి ఓ ఫ్లాట్‌లో దిగుతాడు. అప్పటి నుంచి వారికి తరచూ ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోకుండా జర్నీలో కలిసిన అంజలి రోజూ ఆ ఫ్లాట్‌కు వస్తుంది. ఇంతకీ అంజలి ఎవరు? ఆ ఫ్లాట్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? అన్నది కథ.
7 . రొటీన్ లవ్ స్టోరీ(నవంబర్ 23 , 2012)
UA|హాస్యం,రొమాన్స్
సంజు తన్విని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఫ్రెండ్స్ సంజూకి హెల్త్ చేస్తారు. తన్వి కూడా ఇష్టపడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు వస్తాయి. వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ.
8 . లవ్లీ(మార్చి 30 , 2012)
U|డ్రామా,రొమాన్స్
కిట్టు-లల్లి సోషల్ మీడియా ఫ్రెండ్స్. వారిద్దరు నేరుగా కలవాలని నిర్ణయించుకుంటారు. కానీ కిట్టు అతని స్థానంలో ఆకాష్‌ను పంపగా, లల్లి తన బదులు లావణ్యను పంపుతుంది. అయితే అనూహ్యంగా ఆకాష్, లావణ్య ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ
9 . రౌడీ(ఏప్రిల్ 04 , 2014)
A|109 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
రాయలసీమలో ప్రజలకు ఏ కష్టం వచ్చిన అన్నగారు (మోహన్‌బాబు) అండగా నిలుస్తుంటారు. అయితే ఓ రోజు ఆయనపై అటాక్ చేయాలని విలన్లు ప్లాన్ చేస్తారు. దీని గురించి తెలుసుకున్న ఆయన కుమారుడు (విష్ణు) ఏం చేశాడు? తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు? అన్నది కథ.
10 . రన్(మే 29 , 2020)
UA|87 minutes|థ్రిల్లర్
సందీప్(నవదీప్), శృతి(పూజిత పొన్నాడ) సంతోషంగా జీవిస్తుంటారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, సందీప్, శృతిని భోజనానికి తీసుకువెళతానని హామీ ఇస్తాడు. కానీ అకస్మాత్తుగా అతనికి శృతి చనిపోయిందని కాల్ వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి పోలీసులు అతన్ని హత్య కేసులో ఇరికిస్తారు. ఆ తర్వాత సందీప్ ఏం చేశాడు. అసలు శృతిని హత్య చేసింది ఎవరు? అనేది మిగిలిన కథ.
11 . బ్లఫ్ మాస్టర్(డిసెంబర్ 28 , 2018)
UA|138 minutes|హాస్యం,థ్రిల్లర్
ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) ప్రజలను మోసం చేస్తుంటాడు. అవని (నందిత శ్వేత) తన జీవితంలోకి అడుగుపెట్టాక మారతాడు. అయితే అతడికి పశుపతి (ఆదిత్య మీనన్) రూపంలో కొత్త సమస్య ఎదురవుతుంది. దాన్ని హీరో ఎలా అధిగమించాడు? అన్నది కథ.
12 . కరెంట్ తీగ(అక్టోబర్ 31 , 2014)
A|128 minutes|హాస్యం,రొమాన్స్
హీరో స్కూల్ టీచర్‌ను ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు హీరోయిన్ చేత రాయబారం పంపుతుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ హీరోను ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
13 . పాండవులు పాండవులు తుమ్మడ(జనవరి 31 , 2014)
UA|156 mins|హాస్యం,డ్రామా
హనీ (హన్సిక) అనే యువతి ఇద్దరు మాజీ ప్రేమికులను కలుపుతుంది. ఇందుకు వారి దత్తత పిల్లలు కూడా ఒప్పుకుంటారు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో హనీ కిడ్నాప్ అవుతుంది. హనీ కోసం మాజీ ప్రేమికులు ఏం చేశారు? అన్నది కథ.
14 . బిగ్ బాస్(జూన్ 15 , 1995)
A|యాక్షన్,డ్రామా
రెండు మాఫియా ముఠాల మధ్య జరుగుతున్న పోరాటంలో ఓ వ్యక్తి జోక్యం చేసుకుంటాడు. పరిస్థితులు అతడ్ని డాన్‌గా మారేందుకు ప్రేరేపిస్తాయి. తన కుటుంబాన్ని నాశనం చేసిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకుంటాడు.
15 . అప్పట్లో ఒకడుండేవాడు(డిసెంబర్ 30 , 2016)
UA|125 minute|యాక్షన్,రొమాన్స్
క్రికెట్ కావాలని కలలు కన్న రైల్వే రాజు (శ్రీ విష్ణు) అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుంటాడు. పోలీసు అధికారి ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) అతడ్ని బాగా ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కథ.
16 . పదహారేళ్ళ వయసు(ఆగస్టు 31 , 1978)
U|డ్రామా
పదహారేళ్ల మల్లి తన గ్రామాన్ని సందర్శించినప్పుడు పశువైద్యుడ్ని ఇష్టపడుతుంది. అయితే అతనికి చెడు ఉద్దేశాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆమె ఇబ్బందుల్లో పడుతుంది.
17 . దడ(ఆగస్టు 11 , 2011)
UA|130 minutes|యాక్షన్,రొమాన్స్
విశ్వ అన్యాయాన్ని ఎదిరిస్తూ ఏదోక గొడవలో ఇరుక్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే సిటీలో ఇద్దరు డాన్‌లు నిర్వహిస్తున్న ప్రాసిట్యూషన్ వ్యాపారాన్ని అడ్డుకుంటాడు. వారి వద్ద బందీలుగా ఉన్న అమ్మాయిలని విడిపిస్తాడు. అప్పుడు ఆ ఇద్దరు డాన్‌లు ఏం చేశారు? వారిని విశ్వ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
18 . సీతారామయ్య గారి మనవరాలు(జనవరి 11 , 1991)
U|131 min|డ్రామా
సీతారామయ్య (నాగేశ్వరరావు) ఊరిలో పరువుగల పెద్ద మనిషి. ప్రేమ పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోయిన కుమారుడిపై కోపం పెంచుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత ఊరిలో జరిగే ఓ శుభకార్యానికి మనవరాలు (మీనా) వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది కథ.
19 . సెల్ఫీ రాజా(జూలై 15 , 2016)
UA|126 mins|హాస్యం,డ్రామా
సెల్ఫీ రాజా (అల్లరి నరేష్) సరదాగా కాలం వెళ్లదీసే యువకుడు. సిటీ కమిషనర్ కూతురు (కామ్న రనౌత్)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే అతడి నోటి దురుసు వల్ల హీరోయిన్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
20 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
U|140 minutes|డ్రామా
కళ్యాణ్ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.