• TFIDB EN
  • ఆహాలో చిరంజీవి టాప్‌ యాక్షన్ సినిమాలు ఇవే!
    Dislike
    2k+ views
    6 months ago

    వింటేజ్ చిరంజీవి యాక్షన్‌ చిత్రాలను మీరు మిస్ అవుతున్నారా? ఇక ఆ బాధ అవసరం లేదు. ఆహాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి మంచి సినిమాల కలెక్షన్ ఉంది. వీటిలో టాప్ యాక్షన్ చిత్రాల లిస్ట్ YouSay TFIDB సేకరించింది. వాటిపై ఇప్పుడే ఓ లుక్‌ వేయండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మగధీర(జూలై 31 , 2009)
    A|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    రఘువీర్ ఇందిర తండ్రిని హత్య చేసి ఆ నేరాన్ని ఆమె ప్రేమించిన హర్షపై వేస్తాడు. దీంతో అపార్థం చేసుకున్న ఆమె హర్షకు దూరంగా వెళ్లిపోతుంది. ఇందిరను వెతుకుతూ బయల్దేరిన హర్ష తన పూర్వ జన్మ గురించి తెలుసుకుంటాడు.
    2 . స్టాలిన్(సెప్టెంబర్ 20 , 2006)
    U/A|యాక్షన్
    స్టాలిన్ మాజీ ఆర్మి మేజర్. అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కలిగి ఉంటాడు. సాయం లభించని ఓ దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకోవడంతో స్టాలిన్‌ తీవ్ర మనోవేదనకు గురవుతాడు. దీంతో సమాజాన్ని మార్చేందుకు ఓ సాయం చేయాలని సూత్రాన్ని కనిపెడుతాడు.
    3 . ఠాగూర్(సెప్టెంబర్ 24 , 2003)
    U|యాక్షన్,డ్రామా
    ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండి అధికారులను నిర్మూలించడానికి ఠాగూర్ అనే ప్రొఫెసర్ తన స్టూడెంట్స్‌తో ఒక నిఘా సంస్థను రూపొందిస్తాడు. ఆ సంస్థ ద్వారా అవినీతి పరులను ఏరిపారేస్తాడు.
    4 . బిగ్ బాస్(జూన్ 15 , 1995)
    A|యాక్షన్,డ్రామా
    రెండు మాఫియా ముఠాల మధ్య జరుగుతున్న పోరాటంలో ఓ వ్యక్తి జోక్యం చేసుకుంటాడు. పరిస్థితులు అతడ్ని డాన్‌గా మారేందుకు ప్రేరేపిస్తాయి. తన కుటుంబాన్ని నాశనం చేసిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకుంటాడు.
    5 . మెకానిక్ అల్లుడు(మే 27 , 1993)
    U|యాక్షన్,డ్రామా
    రవికి టీవీ ప్రెజెంటర్ ఉద్యోగం పోవడంతో గ్యారేజీలో మెకానిక్‌గా చేరుతాడు. గ్యారేజ్ ఓనర్ కూతురితో ప్రేమలో పడతాడు. కానీ, రవి తన శత్రువు కుమారుడని తెలుసుకున్న తర్వాత గ్యారేజ్ ఓనర్ తిరస్కరిస్తాడు.
    6 . ఘరానా మొగుడు(ఏప్రిల్ 09 , 1992)
    U|యాక్షన్,హాస్యం,డ్రామా
    పారిశ్రామికవేత్త కుమార్తె అయిన ఉమకు అహంకారం ఎక్కువ. అయితే తన ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన రాజాకు గుణపాఠం చెప్పాలని అతన్ని వివాహం చేసుకుంటుంది. క్రమంగా అతనితో ప్రేమలో పడుతుంది.
    7 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
    8 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
    U|యాక్షన్,థ్రిల్లర్
    రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.
    9 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
    U|డ్రామా
    కళ్యాణ్‌ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్‌ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.
    10 . పశివాడి ప్రాణం(జూలై 23 , 1987)
    U|యాక్షన్,క్రైమ్
    భార్య చనిపోవడంతో మధు మద్యానికి బానిసవుతాడు. అతని జీవితంలోకి అనుకోకుండా వినికిడి, మాట లోపం ఉన్న రాజా అనే పిల్లవాడు వస్తాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను చంపిన హంతకులు అతన్ని చంపేందుకు వెతుకుతుంటారు.

    @2021 KTree