
2023 ఏడాదిలో టాప్ ఫ్యామిలీ & డ్రామా సినిమాల లిస్ట్ ఇదే!
4k+ views1 year ago
2023 సంవత్సరం మరో నెలలో ముగియనుంది. ఈ ఏడాదిలో అనేక సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వాటిలో బెస్ట్ ఫ్యామిలీ సినిమాలను YouSay TFIDB లిస్ట్ చేయడం జరిగింది. ఈ జాబితాలో బలగం, రంగమార్తాండ, వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. మీ కుటుంబంతో కలిసి ఫ్యామిలీ సినిమాల్లో ఉన్న డెప్త్‌ను ఆనందించండి.
.jpeg)
1 . బలగం(మార్చి 03 , 2023)
U|డ్రామా
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. అయితే మూడో రోజు, ఐదో రోజు పిట్ట ముట్టదు. ఆ తర్వాత ఏం జరిగింది? పిట్ట ముట్టేందుకు సాయులు కుటుంబ సభ్యులు ఏం చేశారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న సాయిలు ఎలా బయటపడ్డాడు? సాయిలు తండ్రి తన చెల్లెలకు ఎందుకు దూరంగా ఉన్నాడు? అనేది మిగిలిన కథ.

2 . లక్కీ భాస్కర్(అక్టోబర్ 31 , 2024)
UA|డ్రామా
భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.

3 . యానిమల్ (డిసెంబర్ 01 , 2023)
A|యాక్షన్,క్రైమ్,డ్రామా
దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.

4 . అమరన్(అక్టోబర్ 31 , 2024)
UA|డ్రామా
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.

5 . రంగ మార్తాండ(మార్చి 22 , 2023)
U|డ్రామా,ఫ్యామిలీ
రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి? అనేది కథ.
.jpeg)
6 . ఖుషి(సెప్టెంబర్ 01 , 2023)
UA|రొమాన్స్,డ్రామా,హాస్యం
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.

7 . వాల్తేరు వీరయ్య(జనవరి 13 , 2023)
UA|యాక్షన్,డ్రామా
వాల్తేరు వీరయ్య( చిరంజీవి) జాలరి పేటలో ప్రజలకు దేవుడు. ఆయన మాటకు తిరుగులేదు. సముద్రపు ఒడ్డున చిరంజీవికి తెలియకుండా కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తుంటారు. వారిని ఏసీపీ విక్రమ్( రవితేజ) అరెస్ట్ చేస్తాడు. అడ్డుపడిన చిరంజీవిని కూడా లాకప్‌లో వేస్తాడు. చిరంజీవి జైళ్లో ఉన్న సమయంలో అనుకోని విషాదం ఎదురవుతుంది. ఆ విషాధానికి కారణం ప్రకాశ్ రాజ్ అని తెలుసుకుని పోలీస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి మలేషియా వెళ్తాడు. ఆ విషాదం ఏమిటి అనేది కథ
.jpeg)
8 . దసరా(మార్చి 30 , 2023)
UA|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ

9 . బేబీ(జూలై 14 , 2023)
UA|డ్రామా,రొమాన్స్
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌తో ఇష్టం లేకున్నా శారీరకంగా ఒకటవ్వాల్సి వస్తుంది. ఆనంద్‌ను వైష్ణవి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? చివరకు ఆనంద్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.

10 . వీర సింహా రెడ్డి(జనవరి 12 , 2023)
UA|యాక్షన్,డ్రామా
వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ ప్రజలకు దేవుడు. ఆయనకు సవతి తల్లి కూతురు భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైన త్యాగం చేస్తాడు. కానీ భానుమతి బాలయ్య చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు జూ. బాలయ్య విదేశాల్లో తన తల్లితో ఉంటాడు. అసలు వీరసింహారెడ్డి తన కుటుంబానికి ఎందుకు దూరమవుతాడు? ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఎందుకు చంపాలనుకుంటుంది అనేది కథ

11 . OMG 2(ఆగస్టు 11 , 2023)
UA|హాస్యం,డ్రామా
ముగ్దల్ గొప్ప శివ భక్తుడు. ఓ రోజు అతడి కొడుకు వివేక్ అసభ్య ప్రవర్తన వల్ల స్కూల్ నుంచి డిస్మిస్ అవుతాడు. టాయిలెట్‌లో కొడుకు చేసిన పని నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ముగ్దల్ ఊరి వదిలి వెళ్లాలని భావిస్తాడు. ఈ క్రమంలో దేవదూత ప్రత్యక్షమై కొడుకు చేసిన పనిపై భయపడకుండా పోరాటం చేయమంటాడు. ఆ మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అందుకు ఎంచుకున్న మార్గం ఏంటి? అన్నది కథ.
.jpeg)
12 . విమానం(జూన్ 09 , 2023)
UA|డ్రామా
ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలనే ఆశ ఉంటుంది. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తుంటాడు. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. ఇంతకు వీరయ్య తన కొడుకు చివరి కోరిక తీర్చాడా? అనేది మిగిలిన కథ.

13 . హసీనా(మే 19 , 2023)
A|డ్రామా,థ్రిల్లర్
జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత ఐదుగురు అనాథలు ఒక చిక్కులో పడతారు. ఆ చిక్కేంటి? తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా కథ.

14 . డెడ్‌పూల్ & వుల్వరైన్(జూలై 26 , 2024)
A|యాక్షన్,హాస్యం,డ్రామా
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ - వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి? అన్నది స్టోరీ.

15 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
UA|హాస్యం,డ్రామా
క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

16 . ఓపెన్‌హైమర్(జూలై 21 , 2023)
UA|బయోగ్రఫీ,డ్రామా,హిస్టరీ
ప్రముఖ అమెరికన్ సైంటిస్ట్ జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.

17 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.

18 . పెద్ద కాపు: పార్ట్ 1(సెప్టెంబర్ 29 , 2023)
UA|డ్రామా,యాక్షన్
లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) ఇద్దరు గ్రామపెద్దలు శాసిస్తుంటారు. హీరో అయిన పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళి కనిపించకుండా పోతాడు. ఈక్రమంలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని పెట్టి బలహీన వర్గాలను పార్టీలోకి ఆహ్వానిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామం కోసం ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

19 . నూనక్కళి(ఆగస్టు 15 , 2024)
UA|డ్రామా
భార్యతో కలిసి ఉన్న ప్రైవేటు వీడియోలను ఓ యువ వ్యాపారి తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుస్తాడు. ఐటీ అధికారులు ఆ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఎలాగైన ఆ ల్యాప్‌టాప్‌ను కొట్టేసేందుకు హీరో ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఈ క్రమంలో చేసిన తప్పులు ఏంటి? దాని వల్ల ఎదురైన చిక్కులు ఏంటి? అన్నది స్టోరీ.

20 . పుష్ప 2: ది రూల్(డిసెంబర్ 05 , 2024)
UA|యాక్షన్,డ్రామా
పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఓ రోజు సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి (రష్మిక) ఆశగా అడుగుతుంది. పుష్ప ఇందుకు యత్నించగా సీఎం హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ను సీఎం చేస్తానని సవాలు విసురుతాడు. ఇందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.