• TFIDB EN
  • Editorial List
    అడవి శేష్‌ను హీరోగా నిలబెట్టిన అత్యుత్తమ చిత్రాలు మీకోసం
    Dislike
    400+ views
    1 year ago

    టాలీవుడ్‌లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించిన హీరోల్లో అడవి శేష్‌ కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ప్రయోగాత్మక చిత్రాలకు ఈ యువ హీరో పెట్టింది పేరు. తీసింది తక్కువ చిత్రాలే అయిన సక్సెస్‌ రేటు మాత్రం 90%కి పైగా ఉంది. క్షణం, మేజర్‌, గూఢచారి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో అడవి శేష్‌ నటించారు. అతడు హీరోగా చేసిన అత్యుత్తమ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అమీ తుమీ(జూన్ 09 , 2017)
    U|124 minutes|హాస్యం,రొమాన్స్
    గంగాధర్ రావు(తనికెళ్ల భరణి) తన కూతురు(ఈషా)కి అనంత్(అడివి శేష్)తో మధ్య ప్రేమను వ్యతిరేకిస్తాడు. శ్రీచిలిపి(వెన్నెల కిషోర్)తో ఆమె పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. మరోవైపు గంగాధర్ కొడుకు (శ్రీనివాస అవసరాల) తన శత్రువు కూతురు మాయ (అదితి)ని ప్రేమిస్తాడు. తన పిల్లలతో కలత చెందిన గంగాధర్ తన కూతురిని గదిలోకి లాక్కెళ్లి, కొడుకును ఇంటి నుండి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    2 . కర్మ(నవంబర్ 15 , 2010)
    UA|145 minutes|థ్రిల్లర్
    తల్లి మరణం తర్వాత పద్మ ఒంటరి జీవిస్తుంటుంది. అతీంద్రియ శక్తులు ఉన్నట్లు కనిపించే దేవ్‌ని కలవడంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

    పద్మ (జేడ్‌ టైలర్‌) తన తల్లి చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటుంది. అనుకోకుండా ఓ రోజు ఆమె దేవ్‌ (అడవి శేష్‌)ను కలుస్తుంది. దీంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఏమిటా మలుపు? దేవ్‌కు ఉన్న సూపర్‌ పవర్స్‌ ఏంటి? అన్నది కథ.

    3 . హిట్: ది ఫస్ట్ కేస్(ఫిబ్రవరి 28 , 2020)
    UA|130 minutes|యాక్షన్,మిస్టరీ,థ్రిల్లర్
    ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
    4 . హిట్: ది సెకండ్ కేస్(డిసెంబర్ 02 , 2022)
    A|118 minutes|క్రైమ్,మిస్టరీ
    వైజాగ్‌లో ఓ యువతి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారుతుంది. ఆ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ దేవ్ (అడివి శేష్) ప్రత్యేక అధికారిగా వస్తాడు. ఇంతకు హంతకుడు ఎవరు? మహిళలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నాడు అనేది మిగతా కథ
    5 . గూడాచారి(ఆగస్టు 03 , 2018)
    UA|147 minutes|యాక్షన్,డ్రామా
    గోపి (అడివి శేషు) RAW ఏజెంట్‌. దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరతాడు. అనూహ్య ఘటన వల్ల అర్జున్‌పై దేశద్రోహం నేరం మోపబడుతుంది. దాని నుంచి అర్జున్‌ ఎలా బయటపడ్డాడు? ఒకప్పటి రా ఏజెంట్‌ అయిన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏంటి? అన్నది కథ.
    6 . ఎవరు(ఆగస్టు 15 , 2019)
    UA|118 minutes|క్రైమ్,థ్రిల్లర్
    సమీరాపై అత్యాచారం చేసే క్రమంలో సీనియర్ అధికారి అశోక్‌ హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాఫ్తును విక్రమ్ చేపడుతాడు. సమీరాను విచారిస్తున్న క్రమంలో అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకు సమీరాకు అశోక్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథలో ట్విస్ట్.
    7 . మేజర్(జూన్ 03 , 2022)
    UA|146 minutes|థ్రిల్లర్,యాక్షన్,బయోగ్రఫీ
    సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌) కష్టపడి ఆర్మీలో చేరతాడు. అంచెలంచెలుగా ఎదిగి NSG కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే ముంబయి తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో వారిని మట్టుబెట్టే బాధ్యత సందీప్‌ బృందంపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    8 . క్షణం(ఫిబ్రవరి 26 , 2016)
    UA|118 minutes|డ్రామా,థ్రిల్లర్
    హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.

    రిషి (అడివి శేష్) అమెరికాలో సెటిలైన ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన శ్వేత (అదా శర్మ) నుంచి వచ్చిన కాల్‌తో ఆమెను కలిసేందుకు ఇండియా వస్తాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారన్న షాకింగ్ విషయాన్ని శ్వేత చెప్తుంది. రిషికి పాపను వెతికే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అన్నది కథ.


    @2021 KTree