Editorial List
నాగ శౌర్య నటించిన టాప్ హిట్ చిత్రాలు
300+ views9 months ago
టాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో ఒకడిగా నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం అతని సొంతం. చేసినవి కొన్ని సినిమాలే అయినా అవి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.
1 . దిక్కులు చూడకు రామయ్య(అక్టోబర్ 10 , 2014)
UA|రొమాన్స్
హీరో అతని తండ్రి ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ తర్వాత కుటుంబంలో ఎలాంటి సంఘర్షణలు తలెత్తాయి? వారి ప్రేమ చివరికీ ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది కథ.
2 . జ్యో అచ్యుతానంద(సెప్టెంబర్ 09 , 2016)
U|125 minutes|డ్రామా,రొమాన్స్,హాస్యం
ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆమె కూడా ఇద్దరితోనూ ఎంతో అనురాగంగా ఉంటుంది. చివరికీ ఏమైంది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు లభించింది? అన్నది కథ.
3 . రంగబలి
(జూలై 07 , 2023)
UA|హాస్యం,రొమాన్స్,డ్రామా
శౌర్య (నాగ శౌర్య) తన సొంత ఊరు రాజవరం అంటే ఎనలేని ప్రేమ. ఆ ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. అయితే తండ్రి మాట విని ఉన్నత చదువు కోసం వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ (యుక్తి తరేజా) అనే డాక్టర్‌తో ప్రేమలో పడతాడు. అయితే రావవరంలో ఓ సమస్య కారణంగా సహజ తండ్రి మురళి శర్మ వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఇంతకు ఆ సమస్య ఏమిటి? శౌర్య పరిష్కరించగలిగాడా? అనేది మిగతా కథ
4 . కళ్యాణ వైభోగమే(మార్చి 04 , 2016)
U|158 min|హాస్యం,రొమాన్స్
హీరో, హీరోయిన్లకు మెుదటి నుంచి పెళ్లి అంటే అసలు పడదు. విచిత్రంగా వీరిద్దరికి ఇరు కుటుంబాలూ పెళ్ళి ఫిక్స్ చేస్తాయి. ఈ పరిస్థితుల్లో పెళ్ళి అంటేనే ఇష్టం లేని వీరిద్దరూ ఏం చేశారు? తర్వాత వీరిద్దరి ప్రయాణం ఎటువైపు దారితీసింది? అన్నది కథ.
5 . ఊహలు గుసగుసలాడే(జూన్ 20 , 2014)
U|128 minutes|హాస్యం,రొమాన్స్
హీరో (నాగశౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది లక్ష్యం. దీనిని ఆసరాగ చేసుకోని కంపెనీ ఎండీ (అవసరాల శ్రీనివాస్) హీరోయిన్‌ను పడేసేందుకు సాయం చేయమంటాడు. అలా హీరో ఇచ్చిన సలహాలతో హీరోయిన్‌కు దగ్గర అవ్వాలని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎండీని కాదని హీరోయిన్ హీరోకు ఎలా దగ్గరయ్యింది? అన్నది కథ.
6 . కృష్ణ వ్రింద విహారి(సెప్టెంబర్ 23 , 2022)
UA|139 minutes|హాస్యం,రొమాన్స్,డ్రామా
కృష్ణాచారి (నాగశౌర్య) పల్లెటూరుకు చెందిన బ్రాహ్మణ కుర్రాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి మేనేజర్‌గా పనిచేసే వ్రిందా (షిర్లే సేథియా)ను ప్రేమిస్తాడు. ఓ సమస్యతో బాధపడుతున్న వ్రిందా అతడితో పెళ్లికి నిరాకరిస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి? పెళ్లి కోసం కృష్ణ ఎన్ని అబద్దాలు ఆడాడు? అనేది మిగతా కథ.
7 . ఛలో(ఫిబ్రవరి 02 , 2018)
UA|140 min|హాస్యం,రొమాన్స్
ఓ ఊరు తమిళం, తెలుగు భాగాలుగా విడిపోతుంది. ఒకరంటే ఒకరికి అసలు పడదు. ఆ ఊరిలోని కాలేజ్‌లో తెలుగు వాడైన హరి (శౌర్య) జాయిన్ అవుతాడు. కార్తిక (రష్మిక మందన)ను ప్రేమిస్తాడు. ఆ ఊరి సమస్య వారి ప్రేమకు ఎలా అడ్డు తగిలింది? చివరికీ వారు కలిశారా లేదా? అన్నది కథ.
నాగ శౌర్య కెరీర్‌లో తొలి విజయం అందించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా రష్మిక మంధాన తెలుగు తెరకు పరిచయమైంది.
నాగ శౌర్య కెరీర్‌లో తొలి విజయం అందించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా రష్మిక మంధాన తెలుగు తెరకు పరిచయమైంది.
8 . వరుడు కావలెను(అక్టోబర్ 29 , 2021)
UA|133 minutes|హాస్యం,రొమాన్స్
భూమి (రీతు వర్మ) చాలా పర్టిక్యులర్‌గా ఉండే అమ్మాయి. ఆమె వర్క్ చేసే కంపెనీలోకి ఆకాష్ (నాగ శౌర్య) ఎంటర్ అవుతాడు. ఆ ఇద్దరికీ ఎలా రిలేషన్ కుదిరింది? పెళ్లిపై ఆసక్తి లేని భూమి ఆకాష్‌ను ఇష్టపడుతుందా? లేదా? అన్నది కథ.
ఈ చిత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చి మంచి విజయం సాధించింది.
ఈ చిత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చి మంచి విజయం సాధించింది.