• TFIDB EN
  • Editorial List
    సునిల్ హీరోగా నటించిన హిట్ చిత్రాలు
    Dislike
    400+ views
    8 months ago

    టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా పేరు సంపాదించిన సునిల్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో తన అదృష్టం పరిక్షించుకున్నాడు. అయితే కమెడియన్‌గా సక్సెస్ అయినంతగా హీరోగా సక్సెస్‌ కాలేదు. తిరిగి విలన్‌ రీఎంట్రీ ఇచ్చి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి సునిల్ హీరోగా వచ్చి సక్సెస్ సాధించిన చిత్రాలు ఓసారి చూద్దాం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
    UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.

    సునిల్ తనలోని విలనిజాన్ని ఈ చిత్రంలో సరికొత్త పంథాలో చూపించాడు.

    2 . కలర్ ఫోటో(అక్టోబర్ 23 , 2020)
    UA|142 minutes|డ్రామా,రొమాన్స్
    జయకృష్ణ, దీప్తి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరిద్దరి కులాలు, ఆస్తి అంతస్తులు వేరు. కానీ ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమకు ఒకరి వల్ల పెద్ద విఘాతం ఏర్పడుతుంది. చివరికి వీరిద్దరు కలిశారా? లేరా? అన్నది అసలు కథ.

    విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన సునిల్ అద్భుతమైన విజయాన్ని అందించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత సునిల్‌కు విలన్‌గా అవకాశాలు వెల్లువెత్తాయి.

    3 . జక్కన్న(జూలై 29 , 2016)
    UA|హాస్యం,డ్రామా
    జక్కన్న (సునీల్‌) తనకు సాయం చేసిన వారి కోసం ఎంత దూరమైన వెళ్తాడు. రౌడియిజం చేసే భైరాగి (కబీర్‌ సింగ్‌)కు అనుకోకుండా సాయం చేస్తాడు. మరి భైరాగి కోసం జక్కన్న ఏం చేశాడు? అన్నది కథ.
    4 . భీమవరం బుల్లోడు(ఫిబ్రవరి 27 , 2014)
    UA|153 minutes|రొమాన్స్
    హీరోకి బ్రెయిన్‌ ట్యూమర్ ఉందని తెలుస్తుంది. 10 రోజులే బతుకుతావని డాక్టర్లు చెప్తారు. దీంతో హైదరాబాద్‌ వచ్చి అక్కడి రౌడీలందర్నీ హత మార్చాలని హీరో నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరోకి నిజంగానే అనారోగ్య సమస్య ఉందా? అన్నది కథ.
    5 . మిస్టర్ పెళ్లికొడుకు(మార్చి 01 , 2013)
    U|138 minutes|హాస్యం,రొమాన్స్
    బుచ్చిబాబు ఒక NRI. ఆరేళ్ల తర్వాత పెళ్లి చూపుల కోసం ఇండియాకు వస్తాడు. అక్కడ పెళ్లి చూపుల్లో అంజలిని చూసి ఇష్టపడుతాడు. కానీ అంజలి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది.
    6 . పూల రంగడు(ఫిబ్రవరి 18 , 2012)
    UA|150 minutes|హాస్యం,రొమాన్స్
    ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
    7 . కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు(ఫిబ్రవరి 18 , 2011)
    UA|హాస్యం
    అప్పల్రాజు స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
    8 . మర్యాద రామన్న(జూలై 23 , 2010)
    U|125 minutes|యాక్షన్,హాస్యం
    రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.

    సునిల్ కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న చిత్రం ఇది. ఈ చిత్రం సునిల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

    9 . అందాల రాముడు(ఆగస్టు 11 , 2006)
    U|హాస్యం
    రాముడు తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు.

    ఈ చిత్రం ద్వారా సునిల్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పటివరకు చేసిన కామెడియన్ రోల్‌ను వదిలిపెట్టి హీరోగా కొనసాగాడు.


    @2021 KTree