• TFIDB EN
  • Editorial List
    అడవి శేష్ కెరీర్‌లో టాప్ హిట్ చిత్రాలు
    Dislike
    300+ views
    8 months ago

    తెలుగులో ప్రస్తుతం డిఫరెంట్ జనర్స్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరోల్లో అడవి శేషు అగ్రస్థానంలో ఉంటాడు. ఫలితంతో సంబంధం లేకుండా మంచి కథలతో ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. మరి అడవి శేషు నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . బలుపు(జూన్ 28 , 2013)
    A|143 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    హీరో ఓ బ్యాంక్‌లో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. స్నేహితుడ్ని మోసం చేసిన శ్రుతికి బుద్ది చెబుతాడు. ఈ క్రమంలో శ్రుతి అతడ్ని ప్రేమిస్తుంది. అయితే వీరి నిశ్చితార్థాన్ని విలన్ అడ్డుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రవి గతం ఏంటి? అన్నది కథ.
    2 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
    UA|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.

    ఈ చిత్రంలో రాకుమారుడిగా నెగిటివ్ షేడ్స్‌లో నటించి మెప్పించాడు.

    3 . హిట్: ది సెకండ్ కేస్(డిసెంబర్ 02 , 2022)
    A|118 minutes|క్రైమ్,మిస్టరీ
    వైజాగ్‌లో ఓ యువతి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారుతుంది. ఆ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ దేవ్ (అడివి శేష్) ప్రత్యేక అధికారిగా వస్తాడు. ఇంతకు హంతకుడు ఎవరు? మహిళలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నాడు అనేది మిగతా కథ
    4 . మేజర్(జూన్ 03 , 2022)
    UA|146 minutes|థ్రిల్లర్,యాక్షన్,బయోగ్రఫీ
    సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌) కష్టపడి ఆర్మీలో చేరతాడు. అంచెలంచెలుగా ఎదిగి NSG కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే ముంబయి తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో వారిని మట్టుబెట్టే బాధ్యత సందీప్‌ బృందంపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.

    ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు అడవి శేషుకు దేశవ్యాప్తంగా గుర్తింపు అందించింది.

    5 . ఎవరు(ఆగస్టు 15 , 2019)
    UA|118 minutes|క్రైమ్,థ్రిల్లర్
    సమీరాపై అత్యాచారం చేసే క్రమంలో సీనియర్ అధికారి అశోక్‌ హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాఫ్తును విక్రమ్ చేపడుతాడు. సమీరాను విచారిస్తున్న క్రమంలో అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకు సమీరాకు అశోక్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథలో ట్విస్ట్.
    6 . గూడాచారి(ఆగస్టు 03 , 2018)
    UA|147 minutes|యాక్షన్,డ్రామా
    గోపి (అడివి శేషు) RAW ఏజెంట్‌. దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరతాడు. అనూహ్య ఘటన వల్ల అర్జున్‌పై దేశద్రోహం నేరం మోపబడుతుంది. దాని నుంచి అర్జున్‌ ఎలా బయటపడ్డాడు? ఒకప్పటి రా ఏజెంట్‌ అయిన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏంటి? అన్నది కథ.

    ఈ చిత్రం ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అడవి శేషుకు అందించింది.

    7 . అమీ తుమీ(జూన్ 09 , 2017)
    U|124 minutes|హాస్యం,రొమాన్స్
    గంగాధర్ రావు(తనికెళ్ల భరణి) తన కూతురు(ఈషా)కి అనంత్(అడివి శేష్)తో మధ్య ప్రేమను వ్యతిరేకిస్తాడు. శ్రీచిలిపి(వెన్నెల కిషోర్)తో ఆమె పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. మరోవైపు గంగాధర్ కొడుకు (శ్రీనివాస అవసరాల) తన శత్రువు కూతురు మాయ (అదితి)ని ప్రేమిస్తాడు. తన పిల్లలతో కలత చెందిన గంగాధర్ తన కూతురిని గదిలోకి లాక్కెళ్లి, కొడుకును ఇంటి నుండి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    8 . క్షణం(ఫిబ్రవరి 26 , 2016)
    UA|118 minutes|డ్రామా,థ్రిల్లర్
    హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    9 . దొంగాట(మే 08 , 2015)
    UA|హాస్యం,థ్రిల్లర్
    ఓ నటి, నిర్మాతల నుంచి డబ్బు వసూలు చేయడానికి కొంతమంది కిడ్నాపర్లతో కలిసి నకిలీ అపహరణ నాటకం ఆడుతుంది.
    10 . పంజా(డిసెంబర్ 09 , 2011)
    A|156 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా,రొమాన్స్
    జై ఓ అనాథ. జైకు గ్యాంగ్‌స్టర్‌ భగవాన్‌ ఆశ్రయం ఇస్తాడు. కొత్త జీవితాన్ని అందిస్తాడు. భగవాన్‌ కొడుకు మున్నా చాలా క్రూరుడు. ఓ కారణం చేత జై అతడ్ని చంపుతాడు. దీంతో భగవాన్‌కు జై శత్రువుగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రంలో అడవి శేషు విలన్‌ రోల్‌లో మెప్పించాడు. సైకో క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు.


    @2021 KTree