Editorial List
సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో టాప్ హిట్ సినిమాలు
300+ views9 months ago
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటనపరంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. డిఫరెంట్ జనర్స్‌లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. మరి సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాల్లో హిట్ చిత్రాలను ఇప్పుడు చూద్దాం.
1 . బ్రో(జూలై 28 , 2023)
UA|హాస్యం,డ్రామా
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథ
2 . చిత్రలహరి(ఏప్రిల్ 12 , 2019)
U|130 Minutes|డ్రామా,రొమాన్స్
వ్యక్తిగత, వృత్తి జీవితంలో నిరంతం వైఫల్యమవుతున్న విజయ్.. తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం వెతుకుతుంటాడు. కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వరు. అయితే స్వేచ్ఛ అనే యువతి అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది.
3 . సుప్రీమ్(మే 05 , 2016)
UA|142 minutes|యాక్షన్,హాస్యం,డ్రామా,రొమాన్స్
ట్యాక్సీ డ్రైవర్ అయిన హీరోకి ఓ రోజు కష్టాల్లో ఉన్న చిన్న పిల్లవాడు పరిచయం అవుతాడు. కోటీశ్వరుడైన ఆ బాలుడ్ని చంపేందుకు విలన్లు యత్నిస్తుంటారు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? విలన్లకు బాలుడికి సంబంధం ఏంటి? బాలుడ్ని రక్షించడం కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నది కథ.
4 . తిక్క(ఆగస్టు 13 , 2016)
UA|135 mins|యాక్షన్,రొమాన్స్
ఆదిత్య (సాయిధరమ్ తేజ్) లవ్ ఫెయిల్ అవుతాడు. బ్రేకప్ నుంచి బయటపడే క్రమంలో అతడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఆ తర్వాత ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? అన్నది కథ.
5 . సుబ్రహ్మణ్యం ఫర్ సేల్(సెప్టెంబర్ 24 , 2015)
UA|152 minutes|డ్రామా,రొమాన్స్
డబ్బు కోసం ఏదైనా చేసే సుబ్రమణ్యం, అమెరికాలో సీత అనే యువతిని కలుస్తాడు. ఆమెకు ఓ పని చేసిపెట్టేందుకు ఒప్పుకుంటాడు. వారి ప్రయాణం, అనూహ్య ఘటనలకు దారి తీస్తుంది. ప్రేమ, కుటుంబం నిజమైన అర్థాన్ని బయటపెడుతుంది.
ఈ చిత్ర సాయి ధరమ్‌కు తొలి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించింది. ఈ సినిమా తర్వాత హీరోగా
ఈ చిత్ర సాయి ధరమ్‌కు తొలి బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించింది. ఈ సినిమా తర్వాత హీరోగా
6 . పిల్లా నువ్వు లేని జీవితం(నవంబర్ 14 , 2014)
A|132 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
శీను (సాయి ధరమ్ తేజ్), శైలు (రెజీన)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ, అతడి ప్రపోజల్‌ను హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. అయితే శైలుని చంపేందుకు పెద్ద గూండా అయిన మైసమ్మ (జగపతి బాబు) యత్నిస్తుంటాడు. ఆ విషయం తెలుసుకున్న శీను ఏం చేశాడు? అన్నది కథ.
ఈ చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
ఈ చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు