• TFIDB EN
  • Editorial List
    శర్వానంద్ కెరీర్‌లో టాప్ హిట్ సినిమాలు
    Dislike
    400+ views
    9 months ago

    ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో శర్వానంద్. నిత్యం సరికొత్త కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంటాడు. మరి శర్వా నటించిన చిత్రాల్లో హిట్ చిత్రాలేవో ఇక్కడ చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . జర్నీ(సెప్టెంబర్ 16 , 2011)
    U|138 minutes|డ్రామా,రొమాన్స్
    జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంతో సినిమా మొదలవుతుంది. శర్వానంద్-అనన్య, జై-అంజలి అనే రెండు జంటల జీవితాలు ఈ ప్రమాదం వల్ల ఎలా ప్రభావితం అయ్యాయి అన్నది కథ.
    2 . మహానుభావుడు(సెప్టెంబర్ 29 , 2017)
    UA|151 minutes|హాస్యం,రొమాన్స్
    శర్వానంద్ అతి శుభ్రత వ్యాధిని కలిగి(OCD) ఉంటాడు. ఈక్రమంలో హీరోయిన్‌ మెహ్రీన్‌ను ప్రేమిస్తాడు. కానీ ఆ శుభ్రతే అతని ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఇంతకు తన ప్రేమను గెలుచుకున్నాడ? లేదా? అన్నది మిగతా కథ.
    3 . మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(ఫిబ్రవరి 06 , 2015)
    U|144 minutes|డ్రామా,రొమాన్స్
    రాజారాం (శర్వానంద్) నేషనల్ లెవల్‌ రన్నింగ్ కాంపిటీషన్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. అదే టైములో ముస్లిం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. అనుకోని కారణం చేత వారిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తిరిగి వారు కలిశారా లేదా? అన్నది స్టోరీ.

    పరణతి చెందిన ప్రేమ కథతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ శర్వానంద్ మిడిల్ ఏజ్ వ్యక్తిలా అద్భుతంగా నటించాడు.

    4 . రన్ రాజా రన్(ఆగస్టు 01 , 2014)
    UA|137 minutes|డ్రామా,రొమాన్స్
    రాజా (శర్వానంద్‌) కూరగాయాలు అమ్ముకునే వ్యక్తి కుమారుడు. అయితే అతడు పోలీసు కమీషనర్‌ కూతురు ప్రియను ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కమీషనర్‌ అంగీకరించడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ

    శర్వానంద్‌కు హీరోగా హిట్ రుచి చూపించిన చిత్రమిది.. ఈ చిత్రం ద్వారా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు

    5 . శతమానం భవతి(జనవరి 14 , 2017)
    U|133 minutes|డ్రామా,ఫ్యామిలీ
    "శతమానం భవతి" అనే చిత్రం, తమ ఉద్యోగాల పరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, బిజీగా గడుపుతున్న పిల్లల నుంచి అప్యాయత కోరుకునే ఓ వృద్ధ జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. బిజీ లైఫ్‌ గడుపుతున్న పిల్లల్ని ఏకతాటిపై తెచ్చేందుకు వారు ఒక ప్లాన్ వేయడంతో కథ మొదలుతుంది.
    6 . జాను(ఫిబ్రవరి 07 , 2020)
    U|151 minutes|డ్రామా,రొమాన్స్
    రామ్‌కు జాను అంటే ఎంతో ప్రేమ. ఆమెను హైస్కూల్‌ లైఫ్‌లో ప్రేమిస్తాడు. కానీ ఎప్పుడూ ప్రపోజ్ చేయడు. విధి వారిని దూరం చేస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూలు రీయూనియన్ ఫంక్షన్‌లో వాళ్లిద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
    7 . గమ్యం(ఫిబ్రవరి 29 , 2008)
    U|128 minutes|డ్రామా
    అభిరామ్‌ (శర్వానంద్‌) జానకి (కమలిని ముఖర్జీ)ని ప్రేమలోకి దింపుతాతని ఫ్రెండ్స్‌తో బెట్‌ కాస్తాడు. ఈ విషయం తెలిసి జానకి అతడ్ని వదిలి వెళ్లిపోతుంది. జానకిని నిజంగానే ప్రేమిస్తున్నట్లు గ్రహించిన హీరో ఆమెను వెత్తుక్కుంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇందులో గాలిశీను (అల్లరి నరేష్‌) పాత్ర ఏంటి? అన్నది కథ.

    ఈ చిత్రం శర్వానంద్‌లోని సరికొత్త నటున్ని పరిచయం చేసింది. ఈ చిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

    8 . ప్రస్థానం(ఏప్రిల్ 16 , 2010)
    U|181 minutes|యాక్షన్,డ్రామా
    తన తండ్రి, ప్రఖ్యాత రాజకీయ నాయకుడైన తన సవతి సోదరుడు మిత్రా పట్ల చిన్నా నిత్యం అసూయతో ఉంటాడు. చివరికి, మిత్ర జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ దారితప్పిపోతాడు.
    9 . శ్రీకారం(మార్చి 11 , 2021)
    U|132 minutes|రొమాన్స్,డ్రామా
    కార్తిక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్‌లో లక్షల్లో సంపాదిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో గ్రామంలో పెరగటం వల్ల వ్యవసాయంపై ఇష్టం ఏర్పడుతుంది. జాబ్‌కు రిజైన్ చేసి వ్యసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ కార్తిక్ తండ్రి అందుకు ఒప్పుకోడు. ఇద్దరి మధ్య అగాథం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ .
    10 . కణం(ఏప్రిల్ 27 , 2018)
    UA|97 minutes|డ్రామా,హారర్
    తులసి, కృష్ణ 19 ఏళ్ల వయసులోనే శారీరకంగా ఒక్కటవుతారు. ఆ తొందరపాటు మూలంగా తులసి గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ పెద్దలు బలవంతంగా తులసికి అబార్షన్ చేయిస్తారు. అబార్షన్ జరిగిన ఐదేళ్లకు అబార్షన్ కారణంగా తులసి కడుపులోనే మరణించిన బిడ్డ ఆత్మ రూపంలో వచ్చి తులసి కుటుంబ సభ్యులపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ బిడ్డ ఆత్మ ఎవరెవరిపై, ఎలా కక్ష సాధించింది అనేదే ఈ సినిమా కథ.

    @2021 KTree