• TFIDB EN
  • Editorial List
    నిఖిల్ సిద్ధార్థ్ టాప్ హిట్ చిత్రాలు
    Dislike
    300+ views
    9 months ago

    ప్రస్తుతం తెలుగు యంగ్ హీరోల్లో మంచి సక్సెస్‌తో దూసుకెళ్తున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సిద్ధార్థ్.. ఢిపరెంట్ జనర్స్‌లో చిత్రాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కిర్రాక్ పార్టీ(మార్చి 16 , 2018)
    UA|151 minutes|హాస్యం,రొమాన్స్
    కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ
    2 . యువత(నవంబర్ 07 , 2008)
    UA|డ్రామా
    గూండాల దాడిలో హీరో ఫ్రెండ్‌ తీవ్రంగా గాయపడతాడు. అతడి ట్రీట్‌మెంట్‌కు పెద్ద మెుత్తంలో డబ్బు అవసరం అవుతుంది. దీంతో బ్యాంక్‌ దోపిడి చేయాలని నిర్ణయించుకుంటాడు హీరో. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    3 . శంకరాభరణం(డిసెంబర్ 04 , 2015)
    UA|154 minutes|యాక్షన్,హాస్యం,క్రైమ్
    గౌతమ్ ఒక NRI. తన తండ్రి అప్పులు తీర్చేందుకు ఇండియాలోని తమ ప్యాలెస్‌ను అమ్మేందుకు భారత్‌ వస్తాడు. అక్కడ అతన్ని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
    4 . సూర్య vs సూర్య(మార్చి 05 , 2015)
    U|130 minutes|రొమాన్స్
    సూర్య వంశపారంపర్యమైన వ్యాధితో బాధపడుతుంటాడు, అది అతన్ని పగలు బయటికి వెళ్లనివ్వదు. అతను టీవీ యాంకర్ సంజనతో ప్రేమలో పడడంతో పరిస్థితులు మారిపోతాయి.

    ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో సూర్య నటనకు మంచి గుర్తింపు లభించింది.

    5 . కార్తికేయ(అక్టోబర్ 24 , 2014)
    UA|124 minutes|థ్రిల్లర్
    వైద్య విద్యార్థి అయిన హీరో ఓ ఆలయం చుట్టూ నెలకొని ఉన్న రహస్యాలను బహిర్గతం చేసేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.
    6 . స్వామి రా రా(మార్చి 23 , 2013)
    UA|120 minutes|క్రైమ్
    ఈ సినిమా కథ ఓ చిన్న దొంగ చుట్టూ తిరుగుతుంది, అతడు ఓ గుడి నుంచి అమూల్యమై విగ్రహాన్ని దొంగిలిస్తాడు. ఈ విగ్రహం కోసం నేరగాళ్లతో పాటు పోలీసులు వెంబడిస్తారు.
    7 . అర్జున్ సురవరం(నవంబర్ 29 , 2019)
    UA|149 minutes|క్రైమ్,థ్రిల్లర్
    అర్జున్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నందుకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనకు సంబంధంలేని కేసులో ఇరుక్కున్న అర్జున్ ఎలా బయటపడ్డాడు అనేది కథ
    8 . హ్యాపీ డేస్(అక్టోబర్ 02 , 2007)
    U|160 minutes|డ్రామా
    ఒక ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఎనిమిది మంది యవకులు తమ స్నేహాన్ని నిలుపుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చిత్రం యూత్‌లో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించింది. 2007లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. స్నేహితులతో కలిసే చూసేందుకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.

    నిఖిల్ నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో హీరోగా నిఖిల్‌కు అవకాశాలు లభించాయి.

    9 . 18 పేజెస్(డిసెంబర్ 23 , 2022)
    UA|137 Minutes|డ్రామా
    సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) యాప్ డెవలపర్. ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. సిద్ధూ డిప్రెషన్‌లోకి వెళ్తాడు. ఈక్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) డైరీని చూస్తాడు. సిద్ధూ దానిని చదవడం ప్రారంభించి, మెల్లగా ఆమెను ఇష్టపడుతాడు. సిద్ధు నందిని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఆమెను కలిసే ప్రయత్నంలో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇంతకు ఆమెను సిద్ధు కలిశాడా? అన్నది మిగతా కథ.
    10 . కార్తికేయ 2(ఆగస్టు 13 , 2022)
    UA|145 minutes|థ్రిల్లర్,ఫాంటసీ,మిస్టరీ
    కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.

    నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా నిఖిల్ స్టార్ డం సంపాదించాడు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది.


    @2021 KTree