Editorial List
విశ్వక్ సేన్ టాప్ హిట్ చిత్రాలు ఇవే!
300+ views6 months ago
తెలుగు యంగ్ హీరోస్‌లో విలక్షణ నటుడిగా పెరు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన కొద్ది మంది యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. అతను నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ చిత్రాలపై ఓలుక్ వేద్దాం.
1 . అశోక వనంలో అర్జున కల్యాణం(మే 06 , 2022)
UA|149 minutes|రొమాన్స్,డ్రామా
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
2 . దాస్ కా ధమ్కీ(మార్చి 22 , 2023)
UA|151 minutes|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
కృష్ణ దాస్(విశ్వక్‌సేన్) ఒక అనాథ. ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి రిచ్‌గా బతకాలని కలలు కంటుంటాడు. వెయిటర్‌గా చేస్తున్న సమయంలోనే కీర్తి(నివేథా పెతురాజ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, సంజయ్ రుద్ర(విశ్వక్‌సేన్) ఓ ఫార్మా కంపెనీని నడిపే సీఈవో. అనుకోని కారణాల వల్ల సంజయ్ జీవితంలోకి కృష్ణదాస్ ప్రవేశించాల్సి వస్తోంది. అయితే, సంజయ్‌గా దాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? సంజయ్, దాస్‌లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? అనేది మిగతా కథ.
3 . ఓరి దేవుడా(అక్టోబర్ 21 , 2022)
UA|141 mins|హాస్యం,రొమాన్స్
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.
4 . హిట్: ది ఫస్ట్ కేస్(ఫిబ్రవరి 28 , 2020)
UA|130 minutes|యాక్షన్,మిస్టరీ,థ్రిల్లర్
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
ఈ చిత్రం తొలి కమర్షియల్ విజయాన్ని విశ్వక్‌కు అందించింది.
ఈ చిత్రం తొలి కమర్షియల్ విజయాన్ని విశ్వక్‌కు అందించింది.
5 . ఈ నగరానికి ఏమైంది(జూన్ 29 , 2018)
UA|140 minutes|హాస్యం,డ్రామా
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
విశ్వక్ సేన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో అతని నటనకు పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న అరుదైన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.
విశ్వక్ సేన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో అతని నటనకు పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న అరుదైన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.